TS TELUGU 5TH CLASS 2021 Best and Top Notes

TS TELUGU 5TH CLASS 2021 – TS TET 2022 is the new Telugu syllabus.

This course includes a detailed study of Telugu grammar and vocabulary as well as an introduction to Telugu linguistics and literature. It also includes a brief introduction to the history of Telugu language, including the scripts used to represent it.  — Telugu notes for TS TET 2022, Telugu notes for ts tet 2022. Telugu notes for ts tet 2020., Telugu notes for ts tet 2020 pdf. Telugu notes for ts tet 2020 telugu pdf ,Telugu notes for ts tet 2020 teluguri –  TS TELUGU 6TH CLASS Telugu 2021 PART-1 Best Notes TS TELUGU 6TH CLASS 2021 PART- 2 , TS TELUGU 5TH CLASS 2021 ,TS TELUGU 4TH CLASS 2021 , TS TELUGU 3RD CLASS 2021 ,TS TELUGU 2ND CLASS 2021

1. మన జెండా

ప్రక్రియ : గేయం

ఇతివృత్తం : దేశభక్తి

రచయిత: శేషం లక్ష్మీ నారాయణాచార్య

మూలం : స్వరభారతి – భక్తి, దేశభక్తి గేయ సంకలనం

ఉద్దేశం : భారత స్వతంత్ర పోరాటంలో మన వెండా కలిగించిన చైతన్యం, ఉత్తేజం గురించి తెలియజెప్పడం ఈ పాఠం ఉద్దేశ్యం.

గేయం :

శాంతి సహనం సత్యరూపమా

శౌర్యకాంతితో వెలిగిన దీపమా

నమామి భారత పతాకమా

స్వరామి త్రివర్ణ కేతనమా

పవిత్ర భారత ధరాతలమ్మున

పరాయిపాలన ముంత మొనర్చి

పంజర విముక్త జగమ్ములా

అంబర మెగిసిన స్వతంత్రమా!

TS TELUGU 5TH CLASS 2021 – TS TET 2022 is the new Telugu syllabus.

స్వేచ్ఛా సాధన సమరంలో

ముందు నడిచిన ప్రతాపమా

స్వాతంత్ర్యం మా జన్మహక్కునీ

గర్జించిన పర్జన్య రావమా!

Telugu notes for TS TET 2022, Telugu notes for ts tet 2022. Telugu notes for ts tet 2020., Telugu notes for ts tet 2020 pdf. Telugu notes for ts tet 2020 telugu pdf ,Telugu notes for ts tet 2020 teluguri –  TS TELUGU 6TH CLASS Telugu 2021 PART-1 Best Notes TS TELUGU 6TH CLASS 2021 PART- 2 , TS TELUGU 5TH CLASS 2021 ,TS TELUGU 4TH CLASS 2021 , TS TELUGU 3RD CLASS 2021 ,TS TELUGU 2ND CLASS 2021

ముష్కర బ్రిటీషు మత్తగజాలను

హడలెత్తించిన అంకుశమా

సమరావనిలో సహోదరాశికి

అండగ నిల్చిన ఆయుధమా

అర్ధాలు:

త్రివర్ణకేతనం = మూడు రంగుల జెండా

అంబరం – ఆకాశం

ధరాతలం – భూమి

పర్జన్యాలు = మేఘాలు

ముష్కరులు -దొంగలు

ఖగం – పక్షి

రవం – శబ్ధం

సమరం – యుద్ధం

TS TELUGU 5TH CLASS 2021 – TS TET 2022 is the new Telugu syllabus.

సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13న హైదరాబాదులో జన్మించింది.

తల్లిదండ్రులు – అఘోరనాథ చటోపాధ్యాయ, వరద సుందరీ దేవి, భర్త – జనరల్ ముత్యాలరాజుల , గోవిందనాయుడు.

 1916 సరోజినీ నాయుడుకు గాంధీతో పరిచయం ఏర్పడింది.

సరోజినీ నాయుడుకు గల బిరుదు – భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా)

 1930లో గాంధీజీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఎరవాడ జైలులో

శిక్షను అనుభవించినది – సరోజినీ నాయుడు

Telugu notes for TS TET 2022, Telugu notes for ts tet 2022. Telugu notes for ts tet 2020., Telugu notes for ts tet 2020 pdf. Telugu notes for ts tet 2020 telugu pdf ,Telugu notes for ts tet 2020 teluguri –  TS TELUGU 6TH CLASS Telugu 2021 PART-1 Best Notes TS TELUGU 6TH CLASS 2021 PART- 2 , TS TELUGU 5TH CLASS 2021 ,TS TELUGU 4TH CLASS 2021 , TS TELUGU 3RD CLASS 2021 ,TS TELUGU 2ND CLASS 2021

2. యాదగిరి గుట్ట

ప్రక్రియ : వ్యాసం

ఇతివృత్తం : దర్శనీయ స్థలం – సంస్కృతి

తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట. పూర్వం నల్గొండ జిల్లాలో, ప్రస్తుతం ‘యాదాద్రి జిల్లాలో గలదు.

 హైదరాబాద్ కు 60 కి.మీ. దూరంలో ఉంది.

ఆ ఋష్యశృంగుని కొడుకు యాదర్షి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్ట పైన తపస్సు చేసి నరసింహ స్వామిని ప్రసన్నం చేసుకొన్నాడు.

 అప్పటి నుండి ఆ గుట్టను యాదర్షి పేరు మీద ‘యాదగిరి గుట్ట’ అని పిలుస్తున్నారు.

ఈ గుట్టమీద ఉన్న గుండం “విష్ణు గుండం’. ఇందులో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం.

విష్ణు గుండం పక్కనే ఉన్న ఆలయం – ఆంజనేయస్వామి ఆలయం

నరసింహ స్వామిని దర్శించుకున్న భక్తులు తప్పకుండా యాదగిరి గుట్ట మీద ఉన్న మరొక ఆలయం రామలింగేశ్వరాలయాన్ని దర్శించుకొంటారు.

ఆలయంలో స్వామి వారికి ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజున అష్ణోత్తర శత కలశాభిషేకం జరుగుతుంది.

ఉగాది రోజున స్వామి వారికి తిరువీధి సేవ చేసి పంచాంగ శ్రవణం జరుపుతారు.

ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ లో స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.పాల్ఘున శుద్ధ విదియ నుండి ద్వాదశివరకు 11 రోజుల పాటు వైభవంగా బ్రహోత్సవాలు జరుగుతాయి.

ఋష్యశృంగుని కొడుకైన యాదర్షి ఈ గుట్టపై తపస్సు చేసి నారసింహస్వామి దర్శనం పొంది, గుట్టపై వెలయమని కోరుకున్నాడు. యాదర్షి పేరు మీద ‘యాదగిరి గుట్ట’ నామం ఏర్పడింది.

యాదర్షి ఎవరి కుమారుడు – ఋష్యశృంగుడు

యాదగిరి గుట్టపైకి చేరుకోవడానికి రెండు కొవ్వులు గలవు. అవి : మెట్ట తొవ్వు, బస్సులు పోయే తొవ్వ,

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక “సప్తగిరి’ ఛానల్ కు పెట్టిన పేరు – యాదగిరి

కొండగట్టు అంజనేయస్వామి పుణ్యక్షేత్రం – కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం – జగిత్యాల జిల్లా)

ఇక్కడి ఆంజనేయుడు సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉంటాడు.

ఆంజనేయస్వామి భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి 41 రోజుల పాటు నిష్ఠతో ఉంటారు.

శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం – వేములవాడ, కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం – రాజన్న సిరిసిల్లా)

వాక్యాలు – కాలాలు

జరిగిపోయిన పనిని తెలుపు వాక్యాలు – భూతకాలపు వాక్యాలు

లక్ష్మీ ప్రసన్న సినిమా చూసింది.

జరుగుతున్న పనిని తెలుపు వాక్యాలు – వర్తమానకాలపు వాక్యాలు

సరళ నృత్యం చేస్తున్నది.

జరగబోవు పనిని గురించి తెలుపు వాక్యాలు – భవిష్యత్ జాలపు వాక్యాలు

సుదర్శనాచారి రేపు హైదరాబాద్ వెళ్తాడు.

వేరుగా ఉన్నదానిని గుర్తించండి

(1) బ్రహ్మ విష్ణువు యాదర్షి ఈశ్వరుడు – యాదర్షి

(2) రథోత్సవం కల్యాణోత్సవం బ్రహ్మోత్సవం ఏకాదశి – ఏకాదశి

(9) ఆదిలాబాద్ యాదగిరిగుట్ట కరీంనగర్ వరంగల్ – యాదగిరి గుట్ట

(4) శ్రీరామనవమి జాతర హనుమజ్జయంతి  శ్రీకృష్ణాష్టమి – జాతర

Telugu notes for TS TET 2022, Telugu notes for ts tet 2022. Telugu notes for ts tet 2020., Telugu notes for ts tet 2020 pdf. Telugu notes for ts tet 2020 telugu pdf ,Telugu notes for ts tet 2020 teluguri –  TS TELUGU 6TH CLASS Telugu 2021 PART-1 Best Notes TS TELUGU 6TH CLASS 2021 PART- 2 , TS TELUGU 5TH CLASS 2021 ,TS TELUGU 4TH CLASS 2021 , TS TELUGU 3RD CLASS 2021 ,TS TELUGU 2ND CLASS 2021

3. సాలార్‌జంగ్ మ్యూజియం

ప్రక్రియ : డైరీ

ఇతివృత్తం : దర్శనీయ స్థలం, సంస్కృతి

ఉద్దేశ్యం  : మ్యూజియంను, అందులో భద్రపరిచే వస్తువులను, వాటి ప్రాశస్త్యాన్ని, ఉద్దేశ్యాన్ని పిల్లలకు తెలపటమే ఈ పాఠం ఉద్దేశ్యం.

సాలార్ జంగ్ మ్యూజియం’ చూడటానికి విహారయాత్ర చేసిన ఒక పాఠశాల విద్యార్థి రాసిన డైరీలోనిదే ఈ పాఠం,

సాలార్‌జంగ్ మ్యూజియం హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నది. ” – మూసీనదికి దక్షిణం ఒడ్డున ‘దార్-ఉల్-షిఫా’ అనే ప్రాంతంలో ఉంది.

సాలార్‌జంగ్ కుటుంబానికి చెందిన ‘మీర్ యూసుఫ్ అలీఖాన్ సాలార్‌జంగ్ – III. ప్రపంచ నలుమూలల నుంచి ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తు సామాగ్రి సేకరించాడు.

భారతదేశంలోని మ్యూజియాలలో సాలార్ జంగ్ మ్యూజియం స్థానం – 3వ

సాలార్‌జంగ్ మ్యూజియంను ఎప్పుడు ఆరంభించారు ? – 1951 డిసెంబర్ 16న

సాలార్‌జంగ్ మ్యూజియం ఏ ఆకారంలో ఉంది ? – అర్ధ చంద్రాకారంలో

సాలార్‌జంగ్ మ్యూజియం లోని అర్రల సంఖ్య – 38

సాలార్‌జంగ్ మ్యూజియంలోపై అంతస్తులోని అర్రల సంఖ్య – 18

మ్యూజియంలో ఉన్న గంటల గడియారంలో ఒక ప్రత్యేకత –  అందులో సమయం ఎన్ని గంటలైతే అన్ని గంటలను ఒక మనిషి రూపంలోని బొమ్మ వచ్చి మ్రోగిస్తుంది.

పాలరాతి శిల్పాలున్న అరలో రెబెక్కా శిల్పం ఉన్నది. ఈ శిల్పం ప్రత్యేకత ఏమిటంటే పై నుండి కింది దాకా సన్నని పరదా కప్పుకున్నట్లు ఉంటుంది. అందులో నుంచి ముఖం కనపడుతున్నట్లుఅద్భుతంగా ఉంటుంది.

సాలార్‌జంగ్ మ్యూజియంలో నున్న రెబెక్కా శిల్పం చెక్కించెవరు ? – GB. బెని, ఇటలీ దేశస్థుడు.

ఏనుగు దంతముల పై వివిధ బొమ్మలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

మైసూరు రాజైన టిప్పు సుల్తానుకు, కుర్చీలు, టీపాయ్ లు బహూకరించిందెవరు ? – ఫ్రాన్స్ రాజు లూయిస్ XVI

ముందు నుండి చూస్తే మగమనిషి వెనుక నుండి చూస్తే బడమనిషి కనిపించే చెక్కు బొమ్మను చెక్కిన శిల్పి ఏ దేశస్థుడు – ఫ్రాన్స్ దేశస్థుడు,

ఆడమనిషి – మార్గరిట్టా

మగమనిషి –మెఫిస్టోఫిలిప్స్

ఈ రెండు బొమ్మలు జర్మన్ దేశంలో ప్రదర్శించే ప్రసిద్ధ నాటకంలోని పాత్రలు.

నెహ్రూ జూలాజికల్ పార్కు – హైద్రాబాద్ (తెలంగాణ

Telugu notes for TS TET 2022, Telugu notes for ts tet 2022. Telugu notes for ts tet 2020., Telugu notes for ts tet 2020 pdf. Telugu notes for ts tet 2020 telugu pdf ,Telugu notes for ts tet 2020 teluguri –  TS TELUGU 6TH CLASS Telugu 2021 PART-1 Best Notes TS TELUGU 6TH CLASS 2021 PART- 2 , TS TELUGU 5TH CLASS 2021 ,TS TELUGU 4TH CLASS 2021 , TS TELUGU 3RD CLASS 2021 ,TS TELUGU 2ND CLASS 2021

ప్యారా హైదరాబాద్:

ప్రక్రియ – గేయం

ఇతివృత్తం – సంస్కృతి

హైదరాబాద్ హైదరాబాద్

ప్యారా ప్యారా హైదరాబాద్

చార్ మినారులా పావురమూ

నీ గుండెల నిండా గావురమూ

నువు నెత్తురు చిందిన నందనమూ

నీకు చెమట పూలతో వందనమూ

గోల్కొండల కొడితె చప్పట్లు

అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు

కులీ కుతుబ్ షా ఫర్మానా

భాగమతికి దిల్ నజరానా

మూసీ నదిపై వెన్నెలవూ

జలతారు ముసుగులో వన్నెలవూ

అస్సోయి దూలా ఆటలవూ

ఫకీరు సూఫీ పాటలవూ

లష్కర్ లోన కవాతువూ

పట్నంలోన బరాతుపూ

యుద్ధ ఫిరంగుల ఆవాజుపూ

ఆ మక్కా మసీదు నమాజుపూ

తాళం తప్పెట నాదాలు

పోతరాజుల కొరడాలు

తీన్మార్ దరువుల గానాలూ

మాంకాలమ్మకు బోనాలూ

మల్లేశ్, మస్తాన్ భాయీ భాయి

ఏకమై దోపియ ఇరాని ఛాయి

తెలంగాణాంక పసీన హై

హైదరాబాద్ ఏక్ హసీన హై

Telugu notes for TS TET 2022, Telugu notes for ts tet 2022. Telugu notes for ts tet 2020., Telugu notes for ts tet 2020 pdf. Telugu notes for ts tet 2020 telugu pdf ,Telugu notes for ts tet 2020 teluguri –  TS TELUGU 6TH CLASS Telugu 2021 PART-1 Best Notes TS TELUGU 6TH CLASS 2021 PART- 2 , TS TELUGU 5TH CLASS 2021 ,TS TELUGU 4TH CLASS 2021 , TS TELUGU 3RD CLASS 2021 ,TS TELUGU 2ND CLASS 2021

4. నీడ ఖరీదు

ప్రక్రియ – కథ

ఇతివృత్తం – హాస్యం, మానవ స్వభావం

పాత్రలు – పిసినారి పాపయ్య, శివయ్య, ఊరు పెద్ద

సంభాషణ ( ఎవరు ఎవరితో అన్నారు ? )

 ‘లే, పరాయి చెట్టు నీడన పడుకుంటావా’ అనికస్సుమన్నది – పాపయ్య

‘చెట్టు నీడఅమ్ముతావా ” అని అడిగినది – శివయ్య ,పాపయ్య తో

 పాపయ్య చెట్టు నీడను శివయ్యకు ఎంతకు అమ్మాడు? – 1000 రూపాయలకు

క్రియలు

వాక్య భావాన్ని పూర్తిగా తెలిపే క్రియా పదాలను సమాపక క్రియలు అంటారు.

ఉదా : చూసాడు. వెళ్ళిపోయింది. కూర్చున్నాడు.

రాధిక, సుకన్యలు నాట్యం చేసారు.

వాక్య భావాన్ని అసంపూర్తిగా తెలిపే క్రియా పదాలు అసమాపక క్రియలు,

ఉదా : చూసి, వెళ్ళి, తిని

మధు, బడికి వెళ్ళి, చదువుకున్నాడు.

జాతీయాలు :

పిల్లికి బిచ్చం పెట్టనీ – ఎవరికి ఏమీ ఇవ్వకపోవదం

కాలికి బుద్ధి చెప్పు – భయపడి పారిపోవడం

మొహం చిట్లించుకొని  – చిరాగ్గాఫేస్పెట్టి

నిప్పులు చెరుగు – బాగా కోపగించుకొను

చెవికెక్కక పోవడం – పట్టించుకోకపోవడం

నషాళానికి అంటడం – బాగా ఎక్కువవడం (బాగా కోపగించుకోవడం)

చిందులు తొక్కడం – కోపంతో ఊగిపోవడం.

రుసరుసలాడు – చిరాకుపడు

Telugu notes for TS TET 2022, Telugu notes for ts tet 2022. Telugu notes for ts tet 2020., Telugu notes for ts tet 2020 pdf. Telugu notes for ts tet 2020 telugu pdf ,Telugu notes for ts tet 2020 teluguri –  TS TELUGU 6TH CLASS Telugu 2021 PART-1 Best Notes TS TELUGU 6TH CLASS 2021 PART- 2 , TS TELUGU 5TH CLASS 2021 ,TS TELUGU 4TH CLASS 2021 , TS TELUGU 3RD CLASS 2021 ,TS TELUGU 2ND CLASS 2021

5. నీతి పద్యాలు

ప్రక్రియ : పద్యాలు

ఇతివృత్తం : నైతిక విలువలు

తింటే గారెలే తినాలి  వింటే – భారతం వినాలి’

ఆలిగిన నలుగక, యెగ్గులు

పలికిన మఱి విననియట్లు ప్రతివచనంబుల్

పలకక బన్నము వడి యెడఁ

దలఁపడ, యున్నవండ చూపె! ధర్మజ్ఞుండిబన్.    – నన్నయ

పలుమల శపథంబులు, నం

బలియును, నభివాదముయును, సామప్రియ ఖా

షలు, మిఖ్యా వినయంబులు

గలయని దుష్ట స్వధాన కాపురుషులకున్.     – నన్నయ

ధనమును, విద్యయు, పంశం

బును, దుర్మతులకు ముదంబుఁ బొనరించును, స

జనులైన వారికడఁకును

యును, వినయము, నివియతెచ్చు సుర్వీనాథా!     – తిక్కన

తనుఁవున విరిగిన యలుఁగులు

ననువునఁ బుచ్చంగవచ్చు. నతి నిష్ఠురతన్

మనమున నాటిన మాటలు

విను మెన్నియుపాయములను వెడలునె? యధిపా!      – తిక్కన

పాపముల లెల్ల నెక్కుడు పాతకములు

సువ్వే క్రోధ, లోభంబులు సువ్రతాత్మ!

వాని రెంటి జయించిన వాఁడు గాని

యెందుఁ బరమ ధార్మికులడని యెన్నబడలడు.    – ఎఱ్ఱన

శరణంబని వచ్చిన భీ

కర శత్రువు సయినఁ బ్రీతిఁ గావగవలయున్

గరుణాపరుల తెలంగిది;

యిరవుగ సరిగావు దీనికే ధర్మంబుల్.    – ఎఱ్ఱన

చదువని వాడజ్ఞుండగు

జదివిన సదసద్వివేక చతురత గలుగున్

జదువగ వలయును జనులకు

జదివించెద నార్యులొద్ద జదువుము తండ్రీ!   – పోతన

పరహితము సేయునెవ్వడు

పరమహిమండగును భూత పంచకమును

బరహితమె పరమ ధర్మము

పరహితునకు నెదురులేదు. పర్వేందుముఖీ!  – పోతన

TS TELUGU 5TH CLASS 2021 – TS TET 2022 is the new Telugu syllabus.

నన్నయ అభిప్రాయంలో ధర్మం తెలిసినవాడు ఎవరు ? – ఎవరైనా తనను కోపగించుకుంటే తాను వాళ్ళను. కోపించక, దూషిస్తే విననట్లుండి ఎదురు మాట్లాడక, అవమానపడినా చింతించకుండా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు

నన్నయ అభిప్రాయంలో చెడ్డ వాళ్ళ లక్షణం –  మళ్ళీ మళ్ళీ ఒట్లు పెట్టుకోవడం, నమస్కారం చేయడం, ఎదుటివానికి నచ్చే మాటలు వాడడం, దొంగవినయాలను ప్రదర్శించడం

తిక్కన ప్రకారం ఏవి చెడ్డ వాళ్ళకి మధం కల్గిస్తాయి – ధనము, విద్య,వంశము

ఎఱ్ఱన ప్రకారం అన్ని పాపాలకంటే పెద్ద పాపం – కోపము, పిసినారితనం (అత్యాశ)

ఎఱ్ఱన ప్రకారం సాటిలేని ధర్మం –  ఎంత భయంకర శత్రువైనా శరణని వస్తే ప్రేమతో కాపాడటం.

పోతన ప్రకారం పంచ భూతాలకు మిత్రుడు -ఇతరులకు మేలు చేసేవాడు

అలంకారాలు :

పరహితునకు నెదురులేదు పర్వెందుముఖీ ! – ఈ వాక్యంలో గల అలంకారం – ఉపమాఅలంకారం

TS TELUGU 5TH CLASS 2021 – TS TET 2022 is the new Telugu syllabus.

తెలుగు సంవత్సరాలు :

ప్రక్రియ – కథనం

ఇతివృత్తం – సంస్కృతి

పాత్రలు : హారిక, దీపిక

చేతిలోని శుభలేఖను చూసుకుని మురిసిపోయినది – దీపిక

మాబాబాయి కొడుకు రామూకి పెళ్ళి కుదిరింది అంటూ హారికకు శుభలేఖ ఇచ్చినది – దీపిక

శుభలేఖలో ఏ సంవత్సరం అని రాసి ఉంది – జయనామ

జయ అంటే ఒక తెలుగు సంవత్సరం పేరు అన్నది – దీపిక

తెలుగులో 60 సంవత్సరాలు ఉన్నాయి, ఆరవై సంవత్సరాలు పూర్తయిన తరువాత మళ్లీ అనే వస్తాయి – దీన్ని షష్టి వర్ష చక్రం అంటారు.

తెలుగు సంవత్సరాలలో మొదటిది – ప్రభవ

తెలుగు సంవత్సరాలలో చివరిది – అక్షయ

నా ప్రస్తుత సం 2021 తెలుగు పేరు – శార్వరి

2020 తెలుగు సంవత్సరం పేరు – వికారి

2022 తెలుగు సంవత్సరం పేరు  –ప్లవ

2015 తెలుగు సంవత్సరం – జయ

వాక్యాలు – కాలాలు

పాప వచ్చి భోజనం చేసింది (భూతకాలం)

పాప వచ్చి భోజనం చేస్తూ ఉన్నది. (వర్తమాన కాలం)

పాప వచ్చి భోజనం చేస్తుంది. (భవిష్యత్ కాలం)

Telugu notes for TS TET 2022, Telugu notes for ts tet 2022. Telugu notes for ts tet 2020., Telugu notes for ts tet 2020 pdf. Telugu notes for ts tet 2020 telugu pdf ,Telugu notes for ts tet 2020 teluguri –  TS TELUGU 6TH CLASS Telugu 2021 PART-1 Best Notes TS TELUGU 6TH CLASS 2021 PART- 2 , TS TELUGU 5TH CLASS 2021 ,TS TELUGU 4TH CLASS 2021 , TS TELUGU 3RD CLASS 2021 ,TS TELUGU 2ND CLASS 2021

6. మనసుంటే మార్గముంటది

ప్రక్రియ : లేఖ

ఇతివృత్తం : వికలాంగుల పట్ల సున్నితత్వం, ఆత్మ విశ్వాసం.

ఉద్దేశం : అవయవ లోపం ఉన్న వాళ్ళు కూడా ఇతరులతో సమానంగా రాణించగలరని, వారిని చూసి ఇతరులు స్ఫూర్తి పొందాలనే ఉద్దేశ్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.

ఈ పాఠంలో లేఖను వ్రాస్తున్న వారు ఎవరు ? ” శాంతి

శాంతి లేఖని తన స్నేహితురాలైన లక్ష్మీకి రాసింది.

శాంతి ఎక్కడ నుండి లేఖ రాస్తున్నది ? – సరూర్ నగర్

శాంతి తెలంగాణ రాకముందు ఎక్కడ ఉండేది – గుజరాత్ లోని సూరత్

శాంతికి స్నేహితురాలు – జ్యోత్స్న

లక్ష్మీ తండ్రి పేరు – శ్రీనివాసు, శివాలయం వీధి, చెన్నూరు, ఆదిలాబాదు (ప్రస్తుతం : మంచిర్యాల జిల్లా)

శాంతి అనే అమ్మాయి తన స్నేహితురాలు లక్ష్మికి లేఖ ద్వారా జ్యోత్స్న అనే అమ్మాయి రెండు చేతులు లేకపోయినా చిత్రలేఖనంలోనూ, ఎంబ్రాయిడరీ కళాకారిణిగా ఎలా ఎదిగిందో తెలియజేసింది.

జోత్స్న వంటి స్నేహితురాలు ఉండటం నా అదృష్టమనీ, జోత్స్న తన అంగ వైకల్యాన్ని సైతం జయించి కాలితోనే ఎంబ్రాయిడరీ కళను ఎంతో నేర్పుగా చేస్తుందని లేఖ ద్వారా తెలియజెప్పింది –శాంతి

వాక్యాలు

ఈ క్రింది వాక్యంలో కర్త, కర్మలను గుర్తించంది.

శివ గుర్రం కళ్ళాన్ని చేత్తో పట్టుకున్నాడు – కర్త – శివ ; కర్మ – గుర్రపు కళ్ళం

ప్రజ్ఞ మొక్కలు నాటింది – కర్త – ప్రజ్ఞ ; కర్మ – మొక్కలు

3.మన ముఖ్యమంత్రి పండితులను సత్కరించాడు – కర్త – ముఖ్యమంత్రి ; కర్మ – పండితులు

Telugu notes for TS TET 2022, Telugu notes for ts tet 2022. Telugu notes for ts tet 2020., Telugu notes for ts tet 2020 pdf. Telugu notes for ts tet 2020 telugu pdf ,Telugu notes for ts tet 2020 teluguri –  TS TELUGU 6TH CLASS Telugu 2021 PART-1 Best Notes TS TELUGU 6TH CLASS 2021 PART- 2 , TS TELUGU 5TH CLASS 2021 ,TS TELUGU 4TH CLASS 2021 , TS TELUGU 3RD CLASS 2021 ,TS TELUGU 2ND CLASS 2021

బోనాలు:

ప్రక్రియ – వ్యాసం

ఇతివృత్తం – సంస్కృతి

ఆషాఢమాసంలో దేవి తన పుట్టింటికి పోతుందని నమ్మకం. భక్తి శ్రద్ధలతో

“బోనాలను” నైవేద్యంగా అర్చిస్తారు. వస్త్రాలను, కానుకలను, ఒడిబియ్యాన్ని కూడ

సమర్పిస్తారు. ఈ తంతును “ఊరడి” అంటారు.

‘బోనం’ అంటే భోజనం. కుండ అనే మరో అర్థం కూడ ఉన్నది. అదే దేవికి సమర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వేపాకులను జడగా అల్లి కుండకు కడుతారు. పూలమాల కూడ కడుతారు. ఆ కుండలో పసుపు కలిపి వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చిపులుసు, ఆకుకూర మొదలగు వంటకాలను నైవేద్యంగా పెట్టుకొని దానిపై మరో చిన్న కుండను పెడుతారు.

చిన్న కుండను కూడా అలంకరించి దానిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం, పెరుగు వేస్తారు. దీనినే ‘సాక’ అంటారు.

ఈ చిన్న కుండపై మట్టి కంచుడు ఉంచి అందుల నూనె పోసి గండదీపం వెలిగిస్తారు. డప్పులతో, పోతరాజు ఆటలతో, మంగళహారతులతో ఊరేగింపుగా గుడికి పోతారు.

పండుగ మరునాడు పూనకం వచ్చిన శివసత్తులు చేతిలో వేపమండలు పట్టుకొని జుట్టు విరబోసుకొని బోధించిన పచ్చి మట్టికుండ పై నిలబడి భవిష్యవాణి చెప్తారు. ఈ తంతును ‘రంగమెక్కుడు’ అంటారు.

భక్తికి చిహ్నంగా భక్తులు రంగురంగుల కాగితపు “తొట్టెల”లను గుడి కట్టి మొక్కులుతీర్చుకుంటారు.

TS TELUGU 5TH CLASS 2021 – TS TET 2022 is the new Telugu syllabus.

7. చిట్యాల ఐలమ్మ

ప్రక్రియ: గేయం

ఇతివృత్తం : స్ఫూర్తి, తెలంగాణ చరిత్ర

ఉద్దేశం : అన్యాయాన్ని ఎదిరించడం వీరుల లక్షణం. తెలంగాణ ఎంతోమంది వీరులు, వీర వనితలకు నిలయం. వాళ్ళలో ఒకరైన చాకలి ఐలమ్మ గురించి తెలియజేయటమే ఈ పాఠం ఉద్దేశ్యం.

ఓరుగల్లు జిల్లా రాయపర్తి లోని కిష్టాపురంలో (ప్రస్తుతం : వరంగల్ రూరల్ జిల్లా) ఓరుగంటి మల్లమ్మ, సాయన్న దంపతులకు జన్మించింది.

పదమూడో ఏటనే నర్సింలును వివాహం చేస చిట్యాలలో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించింది.

ఐలమ్మ ఎవరి దగ్గర కౌలు కి చేసింది – మల్లంపల్లి కొండల్రావు అనే భూస్వామి దగ్గర

ఐలమ్మ పొలాన్ని నాశనం చేసింది – మల్లంపల్లి కొండల్రావు,రామచంద్రారెడ్డి ధేశ్ముఖ్

కూలి జేసేటోళ్ళు కాలు పనేందని

పట పట పండ్లు కొరికిండు లాడు …… ఈ పంక్తులు గల గేయం – చిట్యాల ఐలమ్మ

Telugu notes for TS TET 2022, Telugu notes for ts tet 2022. Telugu notes for ts tet 2020., Telugu notes for ts tet 2020 pdf. Telugu notes for ts tet 2020 telugu pdf ,Telugu notes for ts tet 2020 teluguri –  TS TELUGU 6TH CLASS Telugu 2021 PART-1 Best Notes TS TELUGU 6TH CLASS 2021 PART- 2 , TS TELUGU 5TH CLASS 2021 ,TS TELUGU 4TH CLASS 2021 , TS TELUGU 3RD CLASS 2021 ,TS TELUGU 2ND CLASS 2021

జాతీయాలు:

తలప్రాణం తోకకు వచ్చినట్లు-

తోక తొక్కిన త్రాచు–మిక్కిలి కోపం

పొయ్యిలో ఉప్పు వేసినట్లు–సమస్య పెద్దది చేయడం

4.అరికాలి మంట నెత్తికెక్కినట్లు – కోపంఎక్కువ అవడం

5.తంతే పరుపులో పడ్డట్టు–చెడు చేయాలనుకొన్న మంచి జరగడం

6.పోయింది పొల్లు ఉన్నది గట్టి-  కొద్ది పని మాత్రమే జరిగింది అని తెలపటానికి

వాటిలోని పదాలలో కర్త, కర్మ, క్రియలు గుర్తించండి

విద్యార్థులు ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. – విద్యార్థులు ( కర్త) , ఊరేగింపులు ( కర్మ), నిర్వహిస్తున్నారు ( క్రియ )

తాతయ్య స్నేహను సర్కస్ కు తీసుకొని పోయాడు. – తాతయ్య( కర్త) స్నేహను( ) సర్కస్ ( కర్మ ) కు( విభక్తి ప్రత్యయం )  తీసుకొని పోయాడు. ( క్రియా )

పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని రూపొందించాడు. – పింగళి వెంకయ్య ( కర్త )  త్రివర్ణ పతాకాన్ని ( కర్మ)  రూపొందించాడు ( క్రియ )

రజిత గేయం రాసింది – రజిత ( కర్త)  గేయం(కర్మ)  రాసింది (క్రియ)

అమ్మ పాపాయికి పాలు ఇచ్చింది – అమ్మ ( కర్త )  పాపాయికి ( )  పాలు ( కర్మ )  ఇచ్చింది ( క్రియ )

కృష్ణ మామిడి పండ్లు తెచ్చిండు – కృష్ణ ( కర్త )  మామిడి పండ్లు ( కర్మ) తెచ్చిండు ( క్రియా)

మంగ శుభలేఖను చదివింది. – మంగ ( కర్త ) శుభలేఖను ( కర్మ ) చదివింది.(క్రియా)

సందీప్ నాయనమ్మను కథలు చెప్పుమని అడిగాడు – సందీప్ ( కర్త )  నాయనమ్మను ( ) కథలు ( కర్మ )  చెప్పుమని అడిగాడు ( క్రియా)

TS TELUGU 5TH CLASS 2021 – TS TET 2022 is the new Telugu syllabus.

8. వృథా చేయం

ప్రక్రియ : సంభాషణ

ఇతివృత్తం : పర్యావరణ

పాత్రలు – నర్మద, శైలజు, రాధ, సరిత, అనిరుధ్, లక్ష్మి

ఉద్దేశం : నీరు, విద్యుత్ వృథా గురించి అవగాహన కల్పించడం, పోస్టరును పరిచయం చేయడం ఈ పాఠం

శైలజ, లక్ష్మి, రాధ, సరిత, అనిరుధ్ లు స్నేహితులు.

ఒక రోజు గోడ మీద ఒక పోస్టర్ ను చూస్తారు. ఏం మాట్లాడుకుంటున్నారు” అని అడిగిన నర్మదతో పోస్టర్ గూర్చి చూస్తున్నాం, దాన్ని ఎవరు అతికించారు అని అడిగింది – రాధ

విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి అని, అనవసరంగా ఫ్యాన్లు, లైట్లు, ఫ్రిజ్ లు వేయడంవంటివి చేయకూడదని చెప్పే పోస్టరును అతికించినవారు – విద్యుత్ శాఖవారు.

విద్యుత్ కోతకు, నీళ్ళకు ఏమిటి సంబంధం అని అనిరుధ్ అడుగగా విద్యుత్ ఉత్పత్తి

కూడా జరుగుతుందని చెప్పింది -నర్మద

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి బొగ్గుతోనే జరుగుతున్నది.

కొత్తగూడెం, రామగుండంలో విద్యుత్ ను దీని ద్వారా తయారుచేస్తున్నారు – బొగ్గు

ఫిబ్రవరి 4 వసంత పంచమి అనంత సాగర్ లో సరస్వతీ మాత ఉత్సవంజరుగుతుంది.

‘సరే అక్క ఈ రోజు నుంచి మేము విద్యుత్ ను వృథా చేయకుండా పొదుపు చేస్తాం” అని నర్మదకుమాట ఇచ్చినవారు – శైలజ, లక్ష్మి, రాధ, సరితలు

Telugu notes for TS TET 2022, Telugu notes for ts tet 2022. Telugu notes for ts tet 2020., Telugu notes for ts tet 2020 pdf. Telugu notes for ts tet 2020 telugu pdf ,Telugu notes for ts tet 2020 teluguri –  TS TELUGU 6TH CLASS Telugu 2021 PART-1 Best Notes TS TELUGU 6TH CLASS 2021 PART- 2 , TS TELUGU 5TH CLASS 2021 ,TS TELUGU 4TH CLASS 2021 , TS TELUGU 3RD CLASS 2021 ,TS TELUGU 2ND CLASS 2021

వాక్యాలు :

క్రియారహిత వాక్యాలు : కొన్ని వాక్యాలలో క్రియాపదం లేకపోయినా పూర్తి అర్థాన్ని ఇస్తాయి. ఇటువంటి వాక్యాలనే క్రియారహిత వాక్యాలు అంటారు.

ఉదా :  పోతన గొప్ప కవి.

క్రిస్మస్:

ప్రక్రియ – వ్యాసం

ఇతివృత్తం – సంస్కృతి

ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న పండుగలలో క్రిస్మస్ కూడా ఒకటి. ఈ పండుగ క్రైస్తవులకు అతి పెద్ద పండుగ

ఈవ్ క్రిస్మస్, క్రిస్మస్, బాక్సింగ్ దినం ప్రతి సంవత్సరం డిసెంబర్ 24, 25, 26 తేదీలలో జరుపుకుంటారు.

2000 సంవత్సరాల కిందట జీసస్ డిసెంబర్ 24 అర్ధరాత్రి జన్మించారు. అందుచేత ఆ మరునాడు అంటే డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటారు.

దేవదూతల ద్వారా ఒక తొట్టెలో గొర్రెల కాపరులు ఏసుక్రీస్తును కనుగొన్నారు.

క్రిస్మస్ క్రిందటి రాత్రి శాంతాక్లాజ్ (ఫాదర్ క్రిస్మస్) ఆకాశం నుండి దృవపు జింకలు లాగే బండిలో బయలుదేరి వచ్చి పిల్లలకు బహుమతులు ఇస్తాడని నమ్ముతారు.

Telugu notes for TS TET 2022, Telugu notes for ts tet 2022. Telugu notes for ts tet 2020., Telugu notes for ts tet 2020 pdf. Telugu notes for ts tet 2020 telugu pdf ,Telugu notes for ts tet 2020 teluguri –  TS TELUGU 6TH CLASS Telugu 2021 PART-1 Best Notes TS TELUGU 6TH CLASS 2021 PART- 2 , TS TELUGU 5TH CLASS 2021 ,TS TELUGU 4TH CLASS 2021 , TS TELUGU 3RD CLASS 2021 ,TS TELUGU 2ND CLASS 2021

9. గోపి డప్పు

ప్రక్రియ : కథ

ఇతివృత్తం : పిల్లల స్వభావం

ఉద్దేశం : మనం ఇతరులకు చేతనైన సహాయం చేస్తే మనకు కూడా మేలు జరుగుతుంది. దీనివల్లఅసలైన ఆనందం కలుగుతుంది అని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశ్యం.

పాత్రలు: గోపి, నాయనమ్మ, ముసలమ్మ, సరిత, రాజయ్య, వ్యాపారి,  షావుకారు

 రామాపురంలో గోపి అనే పిల్లవాడు ఉండేవాడు. నాయనమ్మతో కలిసి జీవించేవాడు.

” నాయనమ్మ కర్రలనమ్మి, మనవడిని చూసుకుంటూ జీవితం కొనసాగించేది.

ఒక రోజు నాయనమ్మ అంగడి నుండి ఏమి తీసుకురావాలని అడుగగా గోపి డప్పు’ కావాలనిఅడుగుతాడు.

22 రూపాయల డప్పును కొనలేక నాయనమ్మ కర్రచక్రం తీసుకుని వచ్చి గోపికి ఇస్తుంది.

చక్రంతో ఆడుకుంటూ పోతూ ఉంటే గోపీకి ఒకచోట ఒక ముసలమ్మ ఏడుస్తూ కనిపించింది.ఎందుకేడుస్తున్నావ్ అని అడగ్గా పొయ్యిలోకి కర్రలు లేవు, ఇంట్లో పిండి ఉంది, బాగా ఆకలిగా ఉంది. అనటంతో కర్ర చక్రాన్ని వేసి పొయ్యి వెలిగించి వంట చేసుకోమని గోపి చెప్పాడు.

అవ్వ ఇచ్చిన రొట్టెను తీసుకుని బయలుదేరగా దారి మధ్యలో కుండలు చేసే కనకయ్య కూతురు సరిత, వాళ్ళమ్మ ఒడిలో పడుకుని ఏడుస్తోంది. ఎందుకు అని అడగ్గా ఆకలి వలన అని తెలిసి రొట్టెను ఇచ్చాడు.ఆవిడ కుండ ఇచ్చింది.

ఆ కుండను తీసుకుని నడుస్తుండగా బట్టలు ఉతికే రాజయ్య కుమారుణ్ణి కుండ పగులగొట్టినందుకు మందలిస్తున్నాడు. దానిని చూసి రాజయ్యకి కుండ ఇవ్వగా గొంగడిని గోపికి రాజయ్య ఇచ్చాడు.

నది దగ్గర చలికి వణుకుతున్న వ్యక్తికి గోపి గొంగడిని కప్పగా, తాను వ్యాపారినని, దారి మధ్యలో దొంగలు మొత్తం దోచుకుపోయారని తెలిపాడు. కృతజ్ఞతగా గుర్రాన్ని తీసుకెళ్ళమనగా, గోపి గుర్రాన్ని తీసుకుని వెళ్తుండగా పట్నంలో ఊరేగింపు కనిపించింది. కాని ముందుకు సాగక అందరూ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు.

గోపి ఏమైందని అడగగా ‘ఈ రోజు నా కొడుకు పెళ్ళి’ ఇప్పుడు ఊరేగింపు జరపాలి, కాని సమయానికి రావలసిన గుర్రం ఇంకా రాలేదు అని చెప్పాడు.

మీరమీ చింతించకంది. నా దగ్గర గుర్రం ఉంది. ఊరేగింపు మొదలు పెట్టండి అంటూ గోపి చెప్పాడు.

ఊరేగింపు ఘనంగా జరిగిన తర్వాత గోపితో పెళ్ళికొడుకు తండ్రి, గుర్రం ధర ఎంతో చెప్తే ఇస్తానని, సమయానికి అనుకున్నావు, నువ్వు చాలా మంచి బాలుడిని అని చెప్పగా గోపి నాకు డప్పు అంటే ఇష్టం అది ఇస్తే చాలు అని చెప్పాడు.

డప్పుతో పాటు ధనాన్ని కూడా ఆ షావుకారు ఇవ్వగా గోపి మనసులో “నేను వచ్చేటప్పుడు కర్ర చక్రంతో వచ్చాను. అందరికీ సాయం చేస్తూ వెళ్ళటం వలన నాకు ఇష్టమైన దానిని పొందగలిగానని” ఎంతో సంతోషపడతాడు.

.

నాయనమ్మ

కర్రచక్రం

ముసలమ్మ

కర్రచక్రం

రొట్టె

కనకయ్యకూతురుసరిత

రొట్టె

కుండ

రాజయ్య

కుండ

కంబళి

వ్యాపారి

కంబళి

గుర్రం

షావుకారు

గుర్రం

డబ్బు + డప్పు

TS TELUGU 5TH CLASS 2021 – TS TET 2022 is the new Telugu syllabus.

Telugu notes for TS TET 2022, Telugu notes for ts tet 2022. Telugu notes for ts tet 2020., Telugu notes for ts tet 2020 pdf. Telugu notes for ts tet 2020 telugu pdf ,Telugu notes for ts tet 2020 teluguri –  TS TELUGU 6TH CLASS Telugu 2021 PART-1 Best Notes TS TELUGU 6TH CLASS 2021 PART- 2 , TS TELUGU 5TH CLASS 2021 ,TS TELUGU 4TH CLASS 2021 , TS TELUGU 3RD CLASS 2021 ,TS TELUGU 2ND CLASS 2021

విభక్తి ప్రత్యయాలు :

విభక్తి ప్రత్యాయాలు :

వాక్యంలో చేరి వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు.

ఉదా : 1. పాలు సేమ్యాతో పాయసం చేస్తారు..

2 రాజు కంటే రవి మంచి మార్కులు పొందాడు.

10. చింతచెట్టు

ప్రక్రియ : స్వగతం

ఇతివృత్తం : పర్యావరణం

ఉద్దేశం : చెట్లతో మనకు అవినాభావ సంబంధం ఉన్నది. చెట్టులోని ప్రతిభాగం మనకు ఏదో విధంగా ఉపయోగపడుతూనే ఉంది. అటువంటి చెట్లలో ఒకటైన చింతచెట్టు గూర్చి, చెట్ల ప్రాముఖ్యత గూర్చి తెలపటమే ఈ పాఠం ముఖ్య ఉద్దేశం.

ఈ పాఠం చింత చెట్టు ఆత్మకథ.

దిట్టంగా ఉన్న వారిని ఏ గింజతో పోలుస్తారు ? – చింతగింజ

చింత చెట్లు గుంపుని ‘చింత తోపు” అంటారు.

హైదరాబాద్ లో బస్టాండ్ పేరు – ఇమ్లిబన్

 ఇమ్లిబన్ – ‘ఇమ్లి’ అంటే చింతకాయ, ‘బస్’ అంటే వనం

చింతచెట్టు నుండి మనం పొందుతున్న లాభాలన్నింటిని చింత చెట్టు స్వగతంలో మనకుతెలియజేసింది.

చింత గింజలతో ఆడే ఆటలు – పులిజూదం, వామనగుంటలు, పచ్చీసు, అష్టాచెమ్మా,

వట్టికోట ఆళ్వారు స్వామి

సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరం కథారచయిత

నల్గొండ జిల్లాలోని చెరువు మాదారంలో 01-11-1915 నాడు జన్మించాడు.

నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు.

 2015వ సంవత్సరంలో వట్టికోట ఆళ్వారు స్వామి శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. దీన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి వట్టికోట ఆళ్వారు స్వామి పేరును పెట్టి నివాళులు అర్పించింది.

ఈయన 05-02-1961 నాడు మరణించాడు.

TS TELUGU 5TH CLASS 2021 Best and Top Notes

Telugu notes for TS TET 2022, Telugu notes for ts tet 2022. Telugu notes for ts tet 2020., Telugu notes for ts tet 2020 pdf. Telugu notes for ts tet 2020 telugu pdf ,Telugu notes for ts tet 2020 teluguri –  TS TELUGU 6TH CLASS Telugu 2021 PART-1 Best Notes TS TELUGU 6TH CLASS 2021 PART- 2 , TS TELUGU 5TH CLASS 2021 ,TS TELUGU 4TH CLASS 2021 , TS TELUGU 3RD CLASS 2021 ,TS TELUGU 2ND CLASS 2021

పైడిమర్రి వేంకట సుబ్బారావు.

ఈయన నల్లగొండ జిల్లా అన్నెపర్తిలో 1916 జూన్ 10న పుట్టాడు. రాంబాయమ్మ, రామయ్య ఈయన అమ్మనాయనలు.

ట్రెజరీ శాఖలో పనిచేశాడు.

పైడిమర్రి రాసిన ఈ ప్రతిజ్ఞ 1963లో ఆనాటి ప్రభుత్వం అధికారికంగా పాఠ్య పుస్తకాలలోచేర్చింది.

జనగణమన, వందేమాతరం లాగా ప్రతిజ్ఞకు కూడ అంత గుర్తింపు వచ్చింది.

 ట్రెజరీ అధికారిగా పనిచేసిన పైడిమర్రి 1971లో ఉద్యోగ విరమణ చేశాడు. తర్వాత హోమియో వైద్యుడిగా నల్లగొండ పట్టణంలో దవాఖాన నడిపాడు.

పైడిమర్రికి తెలుగుతో పాటు సంస్కృతం,ఉర్దూ, పారసీ, ఇంగ్లీష్, అరబ్బీ భాషలు కూడ వచ్చు. కవిత్వం రాశాడు. కథలు రాశాడు. అరబ్బీలోని కవిత్వాన్ని తెలుగులోకి అనువదించాడు

1988 ఆగస్ట్ 18న చనిపోయాడు.

Telugu notes for TS TET 2022, Telugu notes for ts tet 2022. Telugu notes for ts tet 2020., Telugu notes for ts tet 2020 pdf. Telugu notes for ts tet 2020 telugu pdf ,Telugu notes for ts tet 2020 teluguri –  TS TELUGU 6TH CLASS Telugu 2021 PART-1 Best Notes TS TELUGU 6TH CLASS 2021 PART- 2 , TS TELUGU 5TH CLASS 2021 ,TS TELUGU 4TH CLASS 2021 , TS TELUGU 3RD CLASS 2021 ,TS TELUGU 2ND CLASS 2021

TS TELUGU 6TH CLASS Telugu 2021 PART-1 Best Notes

 TS TELUGU 6TH CLASS 2021 PART- 2 ,

 TS TELUGU 5TH CLASS 2021 ,

TS TELUGU 4TH CLASS 2021 ,

 TS TELUGU 3RD CLASS 2021 ,

TS TELUGU 2ND CLASS 2021