AP TET DSC 7TH CLASS TELUGU PART-1

1)శ్రీలుపొంగినజీవగడ్డ

రచన: శ్రీలు పొంగిన జీవగడ్డ పాఠం పక్రియ గేయం , ఇతివృత్తం దేశభక్తి. కవిరాయప్రోలు సుబ్బారావు.

కవి పరిచయం :

రాయప్రోలు సుబ్బారావు గార్లపాడు బాపట్ల తాలూకా గుంటూరు జిల్లా లో జన్మించాడు.

కాలం: 1892 మార్చి 13– 1894 జూన్ 30

రచనలు :

తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమారమొదలయినవిభావకవిత్వం లోని ప్రసిద్ధి పొందిన కావ్యాలు .

ఆంధ్రావని , జడ కుచ్చులు,  వనమాలమొదలైనవి ప్రసిద్ధ ఖండ కావ్యాలు.

రమ్యాలోకం, మాధురిదర్శనంపద్య రూపం లోని లక్షణ గ్రంథాలు.

అర్థాలు :

శ్రీలు = సిరి , సంపద

బాధరాయణ = వ్యాసుడు

విపినం = అడవి

విపుల = విస్తరించిన

విమల = పవిత్రమైన, నిర్మలమైన

భంగం =

త్రుళ్ళి =

మహిత =

చేవ = సత్తువ

మధువు = తేనె

పర్యాయ పదాలు

అడవి – విపినం , అరణ్యం

కలకాలం – ఎల్లప్పుడూ

ధరణి – భూమి

విశాలమైన – విస్తారమైన

సంధులు

సోమన + అధ్రి = సోమనాద్రి

రవీంద్రుడు = రవి + ఇంద్రుడు : సవర్ణదీర్ఘ సంధి

భానూదయం = భాను + ఉదయం :

మాతృ + ఋణం  = మాతౄణం

సు + ఆగతం = స్వాగతం

అతి + ఆశ  = అత్యాశ

అణు + అస్త్రం = అణ్వాస్రం

పితృ + ఆర్జితం = పిత్రార్జితం

మహీంద్రుడు = మహి + ఇంద్రుడు

అత్యంత = అతి + అంత

మాత్రంశ = మాతృ + అంశ

అణ్వాయుధం = అణు + ఆయుధం

2)అతిధి మర్యాద

రచన : ప్రక్రియ – పురాణ కథ,. ఇతివృత్తం – సంస్కృతి సంప్రదాయాలు, కవి – ఉష శ్రీ , మూలం – ఆంధ్ర మహా భారతం

పాత్రలు : ముంగిస,పాండవులు,కృష్ణుడు,సాత్యకి,కృతవర్మ,అశ్వత్థామ,కృపాచార్యుడు, భీష్ముడు,సక్తు ప్రస్థుడు,

Content :

కురుక్షేత్ర యుద్ధం చివరగా మిగిలింది –అశ్వత్థామ,కృతవర్మ,కృపాచార్యుడు,పాండవులు,కృష్ణుడు,సాత్యకి,

అంపశయ్య మీద సర్వ ధర్మ విషయాలు బోధించింది  – భీష్ముడు

అశ్వమేధ యాగం నిర్వహించింది – ధర్మ రాజు

సభలోకి వచ్చిన జంతువు – ముంగిస

సక్తుప్రస్తుదు ఉండేది – కురుక్షేత్రం

అధరువు = ఆధారం

సంభాషణల

“ దేవతలు కూడా అభినందించే యాగామా ఇది?” – ముంగిస

సక్తుప్రస్థుడిధర్మ బుద్ధితో పోలిస్తే ఆ యాగ జాలలో జరిగినదానం ఏదానం”. – ముంగిస

“ ప్రపంచం లో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికి అయినా ఓడగొడతాడు ” – సక్తుప్రస్తూడుఆతిథ్యం స్వీకరించిన వృద్దుడు

“ రాజుల సొమ్ము భీదసాదలకి , బడువుజీవులకి , అన్నార్తులకిఅక్కరకు రావాలి,అదే ముక్తికి మార్గం -;వశిష్టుడు , శ్వేత రాజు తో ప్

సంధులు

వేయ్యమ్మా = వెయ్యి + అమ్మ

చిర్రేత్తు =  చిర్రు + ఎత్తు

అప్పటికే = అప్పటికి + ఏ

రాకుంటే = రాక + ఉంటే

ఏమిటాకత = ఎమిటి + ఆ కథ

జీవగడ్డయి. = జీవాగడ్డ + అయి

భాగ్యసీమయి = బాగ్యసీమ + అయి

చేసుకోవాలని = చేసుకోవాలి + అని

సెలవిచ్చి = సెలవు + ఇచ్చి

రానిదని = రానిది + అని

ఎవరికెంత = ఎవరికి + ఎంత

వచ్చిందిప్పుడు  = వచ్చింది + ఇప్పుడు

కవితలల్లిన = కవితలు + అల్లిన

విభక్తులు

1. డుమువులు

ప్రథమా విభక్తి

2. ని(న్)ను(న్)ల(న్)కూర్చిగురించి

ద్వితీయా విభక్తి

3. చేత(న్)చే(న్)

తోడ(న్)తో(న్)

తృతీయా విభక్తి

4. కొఱకు(న్)కై

చతుర్థివిభక్తి

5. వలన(న్)కంటె(న్)పట్టి

పంచము విభక్తి

6. కి(న్)కు(న్)యొక్కలో(న్)లోపల(న్)

షష్ఠీ విభక్తి

7. అందు(న్)న(న్)

సప్తమీ విభక్తి

8. ఓఓరిఓయిఓసి

సంబోధనా ప్రథమా విభక్తి

నామవాచకాలువాక్యాలలోఉపయోగిస్తున్నప్పుడుకొన్నిసందర్భాల్లోవాటిస్వరూపంమారుతున్నది. (కన్ను – కంటిగా, ఇల్లు – ఇంటిగా, ఏరు – ఏటిగా, ఊరు – ఊరిగా; కాలు – కాలిగా, రాయి – రాతిగామారాయి.)

అలామారేటప్పుడునామవాచకంచివరిఅక్షరంమీదఇగాని, ‘టీ’ గాని, ‘తి’ గానిచేరుతున్నాయి. వీటినిఉపవిభక్తులు’ అంటారు.

ఇవిచేరిననామవాచకాలనుఔపావిభక్తికాలుఅంటారు.

3)ఆనందం

రచన : ప్రక్రియ – కథ,ఇతివృత్తం – వృద్ధుల పట్ల వైఖరి,

పాత్రలు : సుశీల్,సునీత,సాగర్,సావిత్రి,తోటమాలి,నితిన్,

పిల్లలు వేసిన నాటకం – గుశ్వం

సంభాషణలు :

“ చక్కటి పూలు కోసి,మంచి గుత్తి మి అమ్మగారికి ఇవ్వండి,ఆమె తప్పక సంతోషిస్తారు” – తోటమాలి

“ ముసలి వాళ్ళంతా ఉండే వృద్ధాశ్రమం గుర్తుందా నీకు?వాళ్ళు దీన్ని తప్పకుండా ఇష్టపడతారు” – సాగర్

“ మనం వాళ్ళ కోసం ఉచితంగా ఓ ప్రదర్శన ఇస్తే కనీసం వాళ్ళని ఆనంద పరిచినట్లు అవుతుంది” – సుశీల్

“ తోటమాలి , సావిత్రి పిన్ని స్టేజ్ వెనుక నుండి మనకు సహాయం చేస్తారు ” –సాగర్

“ టికెట్ల ఎక్కడ ప్రింట్ చేద్దాం ” – సునీతా

4)మేలిమి ముత్యాలు

కవిపరిచయం:

గువ్వల చెన్న–గువ్వల చెన్న శతకం –  16వ శతాబ్ధం

పక్కి అప్పల నర్సయ్య – కుమార శతకం – 16వ శతాబ్ధం

నార్ల చిరంజీవి – తెలుగుపూలు శతకం – 20వ శతాబ్ధం

వేమన – వేమన శతకం – 17వ శతాబ్ధం

నార్ల వెంకటేశ్వరరావు – నార్ల వారి మాట- 20వ శతాబ్ధం

ఏనుగు లక్ష్మణ కవి – సుభాషిత రత్నావళి- 17వ శతాబ్ధం

శేషప్ప్ కవి – నరసింహ శతకం – 18వ శతాబ్ధం

అర్థాలు

కలిమి – సంపద

వితరణి – దానం గుణం కలివాడు

యంభోధి = సముద్రం

బుధులు = పండితులు

సంస్తవనీయ = గొప్పవాళ్ళు

నెరవు =

వేగ = వేగంగా

మంచిత =

తాల్మీ = ఓర్పు

అజి = యుద్ధం

జుంటీగ = తేనెటీగ

లోభి = పిసినారి

పుత్తడి – బంగారం

పద్యం ( పద్య పాదం క్రమం,ఛందస్సు,మకుటం , రచయిత)

కలిమిగలలోభికన్నను

విలసితముగఁబేదమేలువితరణియైనన్

చలిచెలమమేలుకాదా

కులనిధియంభోధికన్నగువ్వలచెన్నా!

గువ్వలచెన్నశతకం – కందం

అర్థాంతరన్యాసాలంకారం

అవయవహీనుని, సౌంద

ర్యవిహీను, దరిద్రు, విద్యరానియతని, సం

ఆస్తవనీయు, దేవు, శ్రుతులన్

భువినిందింపదగదండ్రుబుధులుకుమారా

కుమారశతకం – కందం

వీటిని నిందించ కూడదు – వికలాంగులను,నిరక్షరాస్యులు , నిరుపేదలు, అందంగా లేని వాళ్ళను,గొప్ప వాళ్ళని,దైవాన్ని,వేదాలను

పుస్తకములనీవుపూవువలెనుజూడు

చింపఁబోకుమురికిచేయఁబోకు

పరులపుస్తకములనెరవుతెచ్చితివేని

తిరిగియిమ్మువేగు, తెలుఁగుబిడ్డ

తెలుగుపూలుశతకం – ఆటవెలది

4.సానఁబెట్టినవజ్రంబులీనుకాంతి

పొలముజక్కగదున్నినఫలమునిచ్చు

నటులెయజ్ఞానియైననునవనిపైని

విద్యనేర్చినయనివివేకియగును.

 

తేటగీతి

ఆపుత్తడిగలవానిపుండుబాడైనను

వసుధలోనచాలవారకెక్కు

పేదవానియింటపెండైనయెరుగరు

విశ్వదాభిరామవినురవేమ.

వేమనశతకం – ఆటవెలది

ఆపదలందుధైర్యగుణ, మంచితసంపదలందుఁదాల్మియున్,

భూపసభాంతరాళమునఁబుష్కలవాక్చతురత్వమారట

హాపటుశక్తియున్, యశమునంధనురక్తియు, విద్యయందువాం

ఛాపరివృద్ధియున్, బ్రకృతిసిద్ధగుణంబులుసజ్జనాళికిన్

సుభాషితరత్నావళి – ఉత్పలమాల

పత్రికొకటియున్నపదివేలసైన్యము

పత్రికొక్కటున్నమిత్రకోటి

ప్రజకురక్షలేదుపత్రికలేకున్న

వాస్తవమ్మునార్లవారిమాట.

నార్లవారిమాట – ఆటవెలది

మొదలఁజూచినఁగడుగొప్పపిదపఁగుఱుచ

యాదిగొంచెముతర్వాతనధికమగుచుఁ

దనరు, దినపూర్వ, పరభాగజనితమైన

ఛాయపోలికఁగుజనసజ్జనులమైత్రి.

సుభాషితరత్నావళి – తేటగీతి

సత్యసూక్తిఘటించుధీజడిమమాన్చు

గౌరవమొసంగుజనులకుగలుషమడంచు

గీర్తిఁబ్రకటించుచిత్తవిస్ఫూర్తిఁజేయు

సాధుసంగంబుసకలార్థసాధకంబు.

సుభాషితరత్నావళి

తల్లిగర్భమునుండిధనముతేడెవ్వఁడు,

వెళ్ళిపోయెడినాడువెంటరాదు

లక్షాధికారైనలవణమన్నమెకాని

మెఱుగుబంగారంబుమ్రింగఁబోడు

విత్తమార్జనచేసివిఱ్ఱవీగుటెకాని,

కూడఁబెట్టినసొమ్ముఁగుడువఁబోడు

పొందుగామణుగైనభూమిలోపలపెట్టి

దానధర్మములేకదాచిదాచి

తుదకుదొంగలకితురో? దొరలకవునా?

తేనెజుంటీగలియ్యవాతెరువరులకు?

భూషణవికాస! శ్రీధర్మపురనివాస!

దుష్టసంహార! నరసింహ! దురితదూర!

-నరసింహశతకం – సీసం, తేటగీతి

ధనుకుడైనపిసినారి – సముద్రం

పేదవాడు – మంచి నీటి చేలిమే

చెడ్డవాళ్ళతో స్నేహం –ఉదయం పూట నీడ

మంచివాళ్ళు తో స్నేహం –సాయంకాలం నీడ

డబ్బు సంపాదించికూడబెట్టడం – తేనెటీగ తేనె కూడబెట్టాడం

కోటిమంది మిత్రులు –పత్రిక

పర్యాయ పదాలు

సముద్రం –  సంద్రం,అంభుది,

సంపద – కలిమి

వ్యతిరేఖ పదాలు

కలిమి × లేమి

సజ్జనులు × దుర్ణనులు

సత్యం × అసత్యం

కీర్తి × అపకీర్తి

దరిద్రుడు × ధనవంతుడు

ప్రకృతి – వికృతి

పుస్తకం –పుత్తకం

భూమి –

శ్రీ – సిరి

భృంగారం -బంగారం

సుఖం –

ధర్మం – ధమ్మం

గౌరవం –

ప్రాణం –పానం

సమాసాలు

ఎండవానలు – ఎండ,వాన : ద్వంద్వ సమాసం

తల్లిదండ్రులు – తల్లి,తండ్రి : ద్వంద్వ సమాసం

రేయింబవళ్ళు – రేయి ,పగలు : ద్వంద్వ సమాసం

గంగాయమునలు – గంగా,యమునా : ద్వంద్వ సమాసం

రామలక్ష్మణులు – రాముడు,లక్ష్మణుడు : ద్వంద్వ సమాసం

కూరగాయలు – కూర,కాయ : ద్వంద్వ సమాసం

కష్టసుఖాలు – కష్టం ,సుఖం : ద్వంద్వ సమాసం

మంచిచెడులు – మంచి చెడూ : ద్వంద్వ సమాసం

ద్వంద్వ సమాసంలో రెండు నామవాచకాలేఉంటాయి,రెండు కలిసినప్పుడు బహువచనం ఏర్పడుతుంది

నవరసాలు  – నవ సంఖ్య గల రసాలు

నాలుగు వేదాలు – నాలుగు సంఖ్య గల వేదాలు

దశావతారాలు – దశ సంఖ్య గల అవతారాలు

మొదటి పదం సంఖ్యా వాచకం,రెండవ పదంనామవాచకం గా ఉంటే దానిని ద్విగు సమాసం అంటారు.

సాన – కొడవళ్ళు,గొడ్డళ్లుపదునుపెట్టే రాయి.గంధం కోసం రాతి మీధ అరగదిస్తరు , దానినికూడా సాన అంటారు.

5)తెలుగు వెలుగు

రచన : ప్రక్రియ – సంభాషణ,ఇతివృత్తం – నైతిక విలువలు,

పాత్రలు : తాతయ్య,సురభి,శ్రీనిధి,

Content :

జాతీయం : ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇచ్చే పదబంధం అయితే దానిని జాతీయం అంటారు.పలుకుబడి అనే పేరుతో కూడా పిలుస్తారు.

పండినదెండినదొక్కటి

ఖండించినపచ్చిదొకటికాలినదొకటై

తిండికిరుచియైయుండును

ఖండితముగదీనిదెల్పుకవియుంగలడే?

వక్కఆకు, సున్నం

“తోకలేనిపిట్టతొంభైఆమడలుపోయింది” – ఉత్తరం

శబ్దపల్లవం : నామవాచకానికిక్రియాచేరినపదాలనుశబ్దపల్లవంఅంటారు

మేలు,కొనుఅనేరెండుచిన్నమాటలుఉన్నాయి.. ‘మేలు’ అంటేమంచి; ఇదినామవాచకం. ‘కను’ అంటేచూడటం; ఇదిక్రియ. ‘కను’ ‘కొను’గామారింది. మేలుకొనుఅంటేనిద్రలేవడం, జాగృతమవడంఅనిఅర్ధం.

జానపద గేయాలు – మౌలికంగా,ఆశువుగా చెప్పేవి.కర్తృత్వం ఉండదు.

పలుకే బంగారమాయెనా  – సంకీర్తన

కప్పను గనిఫణివరుండుగడగడవణికెన్ – సమస్యా పూరణం

ఉప్పు కర్పూరంబు – పద్యం

అదిగో అల్లదిగో – సంకీర్తన

నేను అన్నం తిని బడికి వెళ్తాను   – వచనం

బొబ్బిలి పులినీ నేనురా – సై

దేశ రక్షణ చేసేదర –సై           – బుర్ర కథ

శ్రీమద్రామాయణ గోవిందో హరి. – హరికథ

కవి ఏకాగ్రతను,దారణను ప్రతిభ ను తెలుసుకోదగినప్రక్రియ – అవధానం ( అష్టావధానం,శతావధానం,సహస్రవదనం)

మా నిజాం రాజు తరతరాల బూజు – దశరధికృష్ణమాచార్య

వట్టిమాటలు కట్టిపెట్టోయ్ , గట్టి మేలు తలపెట్టవోయ్  – మహాకవి గురజాడ

తూర్పు దేశాల ఇటాలియన్ – తెలుగు , ( ఇటలీ భాష కూడా అజంతంకావున)

జాతీయాలు

భగీరథ ప్రయత్నం – గొప్ప కృషి

గుండె కరిగింది – జాలి పడు

కొట్టిన పిండి. – నేర్పు,నైపుణ్యం

తలలో నాలుక  – అనుకూలంగా

కలగాపులగం – గందరోళం

కళ్ళు కాయలు కాయటం – చాలా రోజుల నుండి ఎదురు చూడటం

పుక్కుటిపురాణం  – అసత్యం

వీనులవిందు – అందమైన

కాలికి బుద్ది చెప్పు – పారిపోవడం

తుమ్మితే ఊడిపోయే ముక్కు. –

చెవిలో పోరు

చెప్పులరగటం

శబ్ద పల్లవం

బయటపడు

చెప్పుకొను

ఏరుకొను

కూరుచు ఉండు

బుద్ధిగా ఉండు

సమాసాలు

తెలుగుభాష – తెలుగు అనే పేరు గల భాష

కోపాగ్ని.  – కోపం వలన అగ్ని

హరికథ. – హరి యొక్క కథ

దేశభాష – దేశము నందలి భాషలు

సంధులు

అయ్యయ్యో = అయ్యో + అయ్యో

కుట్టుసూరు = కుఱు + ఉసూరు

కొట్టకొన  = కొన + కొన

పట్టపగలు = పగలు + పగలు

అన్నన్న = అన్న + అన్న

చిట్టెలుక = చిఱు + ఎలుక

ఎట్లెట్లు = ఎట్ల + ఎట్ల

అహహా = ఆహా + ఆహా

ఆమ్రేడితసంధి

సూత్రం 1: అచ్చునకుఆమ్రేడితంపరమైనప్పుడుసంధిజరుగుతుంది.

సూత్రం 2 : ఆమ్రేడితంబుపరంబగునపుడుకదాదులతొలిఅచ్చుమీదివర్ణంబులకెల్లఅదంతంబగుద్విరుక్తటకారంబగు. తొలిఅచ్చుమీదివర్ణములకులోపంజరిగిఅకారాంతద్విరుక్తటకారంఆదేశముగావచ్చిచేరుతుంది.

సూత్రం 3: అందదుకుప్రభృతులుయధాప్రయోగంబుగగ్రాహ్యంబు

ద్విరుక్తటకారసంధి:

కుఱు, చిఱు, నడు, నిడుశబ్దాలలోఱ, డలకుఅచ్చుపరమైనపుడుఱ, డలస్థానంలోద్విరుక్తటకారం (ట్) వచ్చిచేరుతుంది.

సూత్రం : కుఱు, చిఱు, నడు, నిడు, శబ్దంబులకుఅచ్చుపరంబైనద్విరుక్తటకారంబగు.

6)ఎందుకు పారెస్తాను నాన్న

రచన: ప్రక్రియ – కథ,ఇతివృత్తం – మానవ సంబంధాలు , రచయిత – చాగంటిసోమయాజులుమూలం : కథాస్రవంతి

పాత్రలు: కృష్ణుడు , నరసింహం,నాన్న,శకుంతల,

సంభాషణ

“కొత్త పుస్తకం వాసన భలే ఉంటుంది కదరా?”. నరసింహం కృష్ణుడు తో

“ తస్సా చెక్కా!ఆడపిల్లలు చేదివెస్తునారు కదా! ” నరసింహం కృష్ణుడు తో

“ ఎక్కడైనా చదువు మన్పించుతారా? ఋణమోపణమో చేసి ముక్క చెల్లించకపోతే కుర్రడెందుకుపనికొస్తడా? – కృష్ణుడు తల్లి,కృష్ణుడు తండ్రితో

“ ఇందాక చుట్టలకని డబ్బులు ఇచ్చాను ,డబ్బులున్నయా?పారేశావా? – కృష్ణుడు తండ్రి కృష్ణుడు తో

 

7)శిల్పి

రచన : ప్రక్రియ – ఆధునిక పద్యం,ఇతివృత్తం – కళలు శిల్పం,కవి – గుర్రం జాషువా ,

మూలం – ఖండ కావ్యం మొదటి భాగం లోనిది

కవిపరిచయం

కవిపేరు : గుఱ్ఱంజాషువ.

కాలము : 1895 – 1971.

జన్మస్థలం: వినుకొండ, గుంటూరుజిల్లా.

రచనలు : గబ్బిలము,పిరదౌసి, ముంతాజ్మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తుకథ, నాకథ, స్వప్నకథ, కొత్తలోకము,ఖండకావ్యములు. (7 భాగములు) 

బిరుదులు: కవికోకిల, పద్మభూషణ్, కళాప్రపూర్ణ, నవయుగకవిచక్రవర్తి.

అర్థాలు

దేవస్థలములు = దేవాలయాలు

గహ్వర శ్రేణి = గుహల శ్రేణి

                   = ఎప్పుడు ఉండేవాడు

                  = ఏడవడం

ప్రకృతి – వికృతి

సింహం – సింగం

స్తంభం – కంబం

నిద్ర – నిద్దుర

పుణ్యం – పున్నెం

సంధులు

రాజేంద్ర = రాజ + ఇంద్ర

గజేంద్ర =గజ + ఇంద్ర

మహేంద్ర =మహా + ఇంద్ర

పరోపకారం =పర + ఉపకారం

మహోన్నత =మహా + ఉన్నత

దేశోన్నత=దేశ + ఉన్నత

మాహర్షి =మహా + ఋషి

రాజర్షి =రాజ +ఋషి

సురేంద్ర =సుర + ఇంద్ర

దేవర్షి =దేవ + ఋషి

స్వాతంత్రోధ్యమం =స్వాతంత్ర్య + ఉద్యమం

పూర్వస్వరం ‘అ’; పరస్వరంస్థానంలోఇ, ఉ, ఋలుఇకలిసినపుడు ‘ఏ’, ‘ఉ’ కలిసినపుడు “ఓ’, ‘ఋ’ కలిసినపుడు ‘అర్’ ఆదేశంగావచ్చాయి. ఇలాఏర్పడేసంధినిగుణసంధిఅంటారు.

Content

జనపదంఅంటేగ్రామం. జనపదంలోనివసించేవాళ్ళుజానపదులు. వీళ్ళుప్రదర్శించే

కళలనుజానపదకళలుఅంటారు.

యక్షగానం, వీధినాటకం, వీరభద్రవిన్యాసాలు, హరికథ, ఒగ్గుకథ, బుర్రకథవంటివికొన్నిజానపదకళారూపాలు.

చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వంవంటివిలలితకళలు. భావంమనస్సుకు

హత్తుకొనేరకంగాబొమ్మనుగీయడంచిత్రలేఖనం.

వీనుల విందుగా ఉండేగానకళ సంగీతం. మనలనుకదలకుండా  అనేకభావాలను మనసుకు అందించేకళ శిల్పకళ, రాగ, తాళ, లయ లకు తగినవిధంగా అభినయం చేయడం నృత్యకళ. ఒకభావాన్నిసూటిగాచెప్పకుండా మాటల వెనుక మరుగుపరచి మనసుకు ఉల్లాసం 

కలిగించేవిధంగా పదాలనుకూర్చిచెప్పేదేకవిత్వం