HomeUncategorizedTET DSC GRAMMAR ప్రత్యక్ష కధనం - పరోక్ష కధనం

TET DSC GRAMMAR ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం

ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం

ప్రత్యక్ష కధనం: ఒక వ్యక్తి చెప్పిన మాటలను యధాతధంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం ప్రత్యక్ష కధనం. 

ప్రత్యక్ష కధనానికి మరియొక పేరు ప్రత్యక్షానుకృతి.

ఉదా: “నేను చదువుచున్నాను” అని సరళ చెప్పింది. “నేను వస్తాను” అని అతడు అన్నాడు.

పరోక్ష కధనం: వేరే వాళ్ళు చెప్పిన దాన్ని మన మాటల్లో చెబితే అది పరోక్ష కధనం. పరోక్ష కథనానికి మరియొక పేరు పరోక్షానుకృతి.

ఉదా: తాను చదువుచున్నానని సరళ చెప్పింది. తాను వస్తానని అతడు అన్నాడు.

అనుకారకం: ప్రత్యక్ష కధనం, పరోక్ష కధనం ఈ రెండు కూడా అనుకరణాలే. అనుకరణంలో అంతా చెప్పి చివరకు ‘అని’ అనే పదాన్ని వాడతాం. కధనం చివర ఈ ‘అని’ని వాడతాం. దీనికి అనుకారకం అని పేరు. అంటే ‘అని’ అనుకారక పదం.

ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోనికి మార్చుట : 

1. కాకి ‘కావ్ కావ్’ మని అరుస్తుంది. (ప్రత్యక్షం)

కాకి కావు కావుమని అరుస్తుంది. (పరోక్షం) 

2 కోకిల “కుహూ కుహూ” అని కూస్తుంది. (ప్రత్యక్షం)

కోకిల కుహూ కుహూమని కూస్తుంది. (పరోక్షం) | 

3. “వ్యక్తికి బహువచనం శక్తి” అని శ్రీశ్రీ రాశాడు. (ప్రత్యక్షం) అని

వ్యక్తికి బహువచనం శక్తి అని శ్రీశ్రీ రాశాడు. (పరోక్షం)

 4. “నాకు చాలా సంతోషంగా ఉంది” అని నాన్న చెప్పాడు. (ప్రత్యక్షం)

తనకు చాలా సంతోషంగా ఉందని నాన్న చెప్పాడు. (పరోక్షం) 

5. నువ్వు నాతో “నువ్వు బాగా చదువుకో” అని అన్నావు. (ప్రత్యక్షం)

నువ్వు నన్ను బాగా చదువుకోమన్నావు. (పరోక్షం)

 6. “నాకు ఈ రోజు ఆరోగ్యం బాగా లేదు” అని రవి చెప్పాడు. (ప్రత్యక్షం)

తనకు ఆ రోజు ఆరోగ్యం బాగా లేదని రవి చెప్పాడు. (పరోక్షం) 

8. “ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లే చేస్తాము” అని పిల్లలు అన్నారు. (ప్రత్యక్షం) 

ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లే చేస్తామని పిల్లలు అన్నారు.(పరోక్షం)

9. “మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు” అన్నారు భాగ్యరెడ్డి వర్మ,

మనుషులంతా పుట్టుకతో సమానమేనని, ఎవరూ ఎక్కువ కాదని, ఎవరూ తక్కువ కాదం భాగ్యరెడ్డి వర్మ అన్నాడు.

 

పరోక్ష కధనాన్ని ప్రత్యక్ష కధనంలోనికి మార్చుట :

1. తన దినం తీరుతాదని నాతో తాత చెప్పాడు. (పరోక్షం)

“నా దినం తీరుతాది” అని తాత నాతో చెప్పాడు. (ప్రత్యక్షం) 

2 తమ కృషే తమకు అధికారాన్ని సంపాదించి పెడుతుందని గాంధీజీ వారితో అన్నారు. (పరోక్షం) 

తమకు “మీ కృషే మీకు అధికారాన్ని సంపాదించి పెడుతుంది” అని గాంధీజీ వారితో అన్నారు. (ప్రత్యక్షం 

3. తాను కనబడకపోతే తన తల్లి దుఃఖిస్తుందని అనుకున్నాడు ప్రవరుడు. (పరోక్షం) 

“నేను కనబడకపోతే నా తల్లి దుఃఖిస్తుంది” అని అనుకొన్నాడు ప్రవరుడు. (ప్రత్యక్షం)

 4. తన ఇంటి పేరేమిటని తనను నిర్వాహకులు అడిగారని లక్ష్మీబాయి అంది. (పరోక్షం)

 “మీ ఇంటి పేరేమిటి? అని నిర్వాహకులు నన్నడిగారు” అని లక్ష్మీబాయి అంది. (ప్రత్యక్షం)

5. తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు. (పరోక్షం)

“నన్ను క్షమించు” అని రాజు తన మిత్రునితో అన్నాడు.(ప్రత్యక్షం) 

6. హర్షవర్ధన్ తాను రానని హర్షిణితో అన్నాడు. (పరోక్షం) హర్షవర్ధన్ “నేను రాను” అని హర్షిణితో అన్నాడు. (ప్రత్యక్షం)

వాక్య రీతులు

వాక్యాలలో వాక్య అంగాలు, బేధాలు, రకాలే కాకుండా వాక్య రీతులలో ప్రశ్నార్ధక వాక్యాలు ఉన్నాయి.

7.ప్రశ్నార్ధక వాక్యాలు .

ప్రశ్న అంటే సమాధానాన్ని ఆశించి అడిగేది. వాక్యం చివర ‘ఆ’ చేర్చి ప్రశ్నార్ధక వాక్యాలుగా మార్చవచ్చు 

ఉదా: వాక్యం రాణి పాఠాలు చదువుచున్నది. 

రాణి పాఠాలు చదువుతున్నదా? 

వాక్యం కృష్ణ డాక్టరు. ప్రశ్న కృష్ణ డాక్టరా?

7. టీచర్ “మీరందరూ ఇంటికి వెళ్ళండి” అని చెప్పింది. (ప్రత్యక్షం)

టీచర్ మమ్మల్నందరినీ ఇంటికి వెళ్ళమని చెప్పింది. (పరోక్షం) 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments