శతక మాధుర్యం | Shataka Maduryam Class 10 Best Notes

Shataka Maduryam Class 10 Best Notes శతక మాధుర్యం

చదవండి ఆలోచించి చెప్పండి.

ఆ.వె.

 జ్ఞానుల చరితము వీనుల న
నానుచు సత్పురుష గోష్ఠి ననఘంబనుచున్
బూనుము; ధర్మపథంబును
దానెరిగినయంత; మరువదగదు కుమారా! — పక్కి అప్పల నరసయ్య

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.   నుంచి వారితో స్నేహం వలన ఫలితం ఏమిటి ?
జవాబు:
మంచి వారితో స్నేహం వలన పుణ్యం లభిస్తుంది.

ప్రశ్న2.   దేనిని మరువకూడదు ?
జవాబు:
ధర్మ మార్గాన్ని మరువకూడదు.

ప్రశ్న 3.    ఇలాంటి పద్యాలు మనకు వేటిని బోధిస్తాయి ?
జవాబు:  ఇలాంటి పద్యాలు మనకు భక్తిని, నీతులను, లోకరీతిని, ఉత్తమ జీవిత పద్ధతులను బోధిస్తాయి.

అవగాహన-ప్రతిస్పందన- ఇవి చేయండి

అ) కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి, రాయండి.

ప్రశ్న1.
పాఠంలోని పద్యాలను రాగ, భావయుక్తంగా పాడండి.
జవాబు:
మీ ఉపాధ్యాయుని అనుసరించండి.

ప్రశ్న2.
పారంలో మీకు నచ్చిన పద్యాలు ఏవి ? అవి ఎందుకు నచ్చాయో చెప్పండి.
జవాబు:
నాకు “పలుచని భాస్కరా !” అనే పద్యం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది దృష్టాంత అలంకారంతో ఉన్నది. పద్యభావాన్ని ఉదాహరణ పూర్వకంగా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు. నీచుడు పల్కినట్లుగా కఠినపదాలను అన్యాయంగా గొప్పవారు పలకరు. ఎందుకంటే వెలితి కుండ తొణికినట్లుగా నిండుకుండ తొణకదు. ఈ పద్యంలో
నీ వెలితి కుండతో పోల్చారు. అలాగే గొప్పవాడిని నిండుకుండతో పోల్చారు.

నాకు నచ్చిన రెండో పద్యం “మాతృభాష కుప్పుసామి” అనే పద్యం. ఎందుకంటే మాతృభాష మీదా, మాతృదేశం మీదా అభిమానం లేనివాడు మనిషి కింద లెక్కింపదగినవాడు కాదు. పక్షులకు, జంతువులకూ కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది. ఈ రోజులలో పరాయి దేశాలపైనా, పరాయి భాషలపైనా మోజు పెరిగిపోతుంది. అది తప్పని చెబుతూ బోధించే పద్యం కాబట్టి నాకు చాలా నచ్చింది.

ప్రశ్న3.
మంచి గుణాలు కలవాడు ఎలా మాట్లాడుతాడు ?
జవాబు:
మంచి గుణాలు కలవాడు నీచుడిలా మాట్లాడడు. కఠినంగా మాట్లాడడు. అన్యాయంగా మాట్లాడడు. చక్కగా ఇతరుల మనసు నొప్పించకుండా మాట్లాడతాడు. నిండుకుండలా గుంభనంగా ఉంటాడు.

ప్రశ్న 4.
వేటిపై మమతను కలిగి ఉండాలి ?
జవాబు:
మన మాతృభాషపైనా, మన మాతృదేశంపైనా మమతను కలిగి ఉండాలి.

ఆ) కింది పద్యాన్ని చదవండి. పద్య భావం రాయండి.

తే.గీ. సద్గురువు చేయునుపదేశ సారములను
యెంత యజ్ఞానమైనను నిట్టై పోవు
మంచి వైద్యుడిచ్చేడి చిన్ని మాత్ర చేత
దారుణం బగు రోగంబు తలఁగునట్లు — చిలకమర్తి లక్ష్మీనరసింహం

భావం: మంచి గురువు చేసే ఉపదేశం వలన ఎంత అజ్ఞానం ఐనా ఇట్టే పోతుంది. మంచి వైద్యుడు ఇచ్చే చిన్న మాత్ర వలన ఎంత గడ్డురోగమైనా తగ్గిపోతుంది కదా !

ఇ) కింది గద్యం చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

మగధ దేశమునందలి దుర్గమను పట్టణము కలదు. అందు మహావిభవ సంపన్నుఁడయి శుభదత్తుఁడను వైశ్యుఁడు గలఁడు. అతఁడు సంతానము లేనివాఁడు కాఁబట్టి తన ధన మారామ తటాకాది ప్రతిష్టల వెచ్చించుచు నా పట్టణములో ! నొక దేవళము జీర్ణమై యుండఁగా జూచి కారువులను రావించి తగిన వేతనములు నియమించి దానిఁ గట్ట నియోగించెను.

వారు దానిఁ గట్టుచుండఁగా నొకనాఁడు చేవదూలము అంపముచేఁ గోయించుచునది సుకరముగా వ్రీల్చుటకు. సూత్రధారుఁడక్కడక్కడ మ్రాని మేకులు దిగఁగొట్టి మధ్యాహ్న భోజనార్ధము కూలి వాండ్రును దానును బోయెను. అప్పు | డాపరిసరతరువులందుఁ దిరుగుచున్న కోఁతులు దేవాలయము దాపునకు వచ్చి ప్రాకారములు ప్రాఁకుచుఁ బ్రాఁత శ్రీ మహీరుహముల మీఁదికిఁ గుప్పించి దాఁటుచు బండ్లిగిలించుచు, వెక్కిరించుచు, గిలకిలా రావములు గావించుచు నొండొంటితోఁ బోరుచు, ఫలములు భక్షించుచు, మధువు లానుచు స్వాభావిక చపల భావముతోఁదిరుగుచుండెను.

ఒక ముసలిమల్లు కాలచోదితమై చేవదూలము డాసి యెక్కి దానినెఱియలోఁ దనముష్కము వ్రేలం గూర్చుండి యందు బిగియఁ గొట్టిన కొయ్య మేకు రెండు చేతులతోఁ జిక్కఁబట్టి బలిమితో నూడఁబెఱికి యానెరియలో వ్రేలు ముష్కము చదియుటఁ జేసి తోలుచుఁ గాలధర్మము నొందెను. కాఁబట్టి జోలిమాలిన పనికిఁ బోరాదు

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
శుభదత్తుడికి ఉన్న కొరత ఏమిటి ?
జవాబు:
సంతానం లేకపోవడమే అతనికి ఉన్న కొరత.

ప్రశ్న 2.
ముసలి కోతి ఏం చేసింది ?
జవాబు:
ముసలి కోతి చేవ దూలపు పగులులో తన ముష్కం వ్రేలాడదీసి మేకు పీకింది. ఆ పగులు మూసుకుపోవడంతో
ముష్కం నలిగి మరణించింది.

ప్రశ్న 3.
ఈ పేరాలోని నీతి ఏమిటి ?
జవాబు:
జోలిమాలిన పనికి పోరాదనేది ఈ పేరాలోని నీతి.

ప్రశ్న 4.
పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
సూత్రధారుడెక్కడికి వెళ్లాడు ?

ఈ) కింది వాటికి అర్థ సందర్భములు రాయండి.

ప్రశ్న 1.
పనుల ననుసరించి ఫలములు చేకూరు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం దార్ల సుందరీమణి రచించిన భావలింగ శతకం నుండి గ్రహింపబడిన ‘శతక మాధుర్యం’ అనే పాఠం నుండి గ్రహింపబడినది.
సందర్భం : భావాన్ని బట్టి మాట, మాటను బట్టి పని, పనిని బట్టి ఫలితం చేకూరుతుందని చెబుతూ రచయిత్రి పల్కిన వాక్యమిది.
భావము : పనులను బట్టి ఫలితాలు వస్తాయి.

ప్రశ్న 2.
మాతృభాష యందు మాతృదేశము నందు మమత లేనివాడు మనుజుఁడగునే.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం త్రిపురనేని రామస్వామి చౌదరి గారు రచించిన కుప్పుసామి శతకం నుండి గ్రహించబడిన
‘శతక మాధుర్యం’ పాఠ్యాంశంలోనిది.
సందర్భం : మానవులకు, పక్షులకు, జంతువులకు గల బుద్ధి కూడా లేదని చెబుతూ కవి పలికిన వాక్యమిది.
భావము : మాతృభాష మీదా, తన దేశం మీదా అభిమానం లేనివాడు మనిషే కాదని భావం.

ఉ) కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ముక్తకం అంటే ఏమిటి ?.
జవాబు:
ముక్తకం అంటే ఏ పద్యానికి ఆ పద్యం ప్రత్యేక భావం కలిగి ఉండడం. పద్యాల మధ్య అన్వయం, భావం కొనసాగింపు లేకపోవడం.

ప్రశ్న 2.
కవి హరిహరనాథుని ఏమి ఇమ్మని కోరాడు ?
జవాబు:
అది కావాలి, ఇది కావాలని తాపత్రయపడే మనసుకు ఏకాగ్రతను ప్రసాదించమని హరిహరనాథుని కవి కోరాడు.

ప్రశ్న 3.
సజ్జన సాంగత్యం ఏం చేస్తుంది ?
జవాబు:
సజ్జన సాంగత్యం వలన దుర్జనునకు కూడా మంచి లక్షణాలు వస్తాయి. సేవాతత్వం అలవడుతుంది.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సంస్కారుల గొప్పదనం ఏమిటి ?
జవాబు:
సంస్కారులకు సహజశక్తి ఉంటుంది. వారు సత్యస్థాపనకై జన్మిస్తారు. మంచి స్వభావాలు వ్యాపింపచేస్తారు. ధర్మ సంస్థాపన కోసం జన్మిస్తారు.

ప్రశ్న2.
సత్ఫలితాలు పొందాలంటే ఏం చేయాలి ?
జవాబు:
మన భావం ఏదైతే అదే మాట్లాడాలి. మన మాట ఎలా ఉంటే పని అలాగే ఉండాలి. మన పనులను బట్టే మంచి ఫలితాలు వస్తాయి. అంటే త్రికరణ (మనసు, మాట, పని) శుద్ది ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి.

ప్రశ్న 3.
ధీరోత్తముల లక్షణాలు ఏవి ?
జవాబు:
నీతివేత్తలు ఐన నిపుణులు నిందించినా, పొగిడినా, సంపదలు ఉన్నా, పోయినా, మరణమే కలిగినా ధీరగుణం గల ఉత్తములు నీతిని తప్పరు. కీర్తిని తెచ్చే దానిని విడవరు.

ఆ) కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
విద్యావంతులు ఎటువంటి గుణాలను కలిగి ఉంటారు ?
జవాబు:
పరాక్రమం వలన జన్మ సాఫల్యం కలుగుతుంది. శాంతం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మాభిమానమే గొప్ప సంపద. తప్పు చేయడానికి సిగ్గుపడే బ్రతుకే అమరత్వాన్ని ఇస్తుంది. వినయంతో కూడిన మాట అన్నిటినీ, అందరినీ వశం చేస్తుంది. ఆచారమే గొప్ప బలం. దానం చేయడం అంటే రేపటికి దాచుకోవడమే. మంచివారితో స్నేహం సౌఖ్యాన్ని ఇస్తుంది. అందుకే విద్యావంతులు పైన చెప్పిన గుణాలు అన్నీ కలిగి ఉంటారు.

ప్రశ్న 2.
వ్యక్తుల నిత్య జీవితంలో నైతిక విలువల అవసరాన్ని తెలపండి.
జవాబు:
వ్యక్తుల నిత్యజీవితంలో నైతిక విలువలు చాలా అవసరం. ఎందుకంటే నైతిక విలువలు కలవారు తప్పులు చేయరు. ఎవ్వరినీ మోసం చేయరు. అనవసరమైన గొడవలు పెట్టుకోరు. న్యాయంగా మాట్లాడతారు. ధర్మం తప్పి ప్రవర్తించరు. ఎవ్వరినీ నొప్పించేలా మాట్లాడరు. తాము ఒకవేళ తెలియక తప్పు చేసినా వెంటనే గుర్తిస్తారు. సరిదిద్దుకొంటారు. అసత్యాలు మాట్లాడరు. అందరూ ఇలాగే ఉంటే సమాజంలో ప్రశాంతత ఉంటుంది. అనవసర గొడవలుండవు. అందరూ నిర్భయంగా బ్రతకవచ్చు.

ప్రశ్న 3.
పాఠం ఆధారంగా పది నీతి. వాక్యాలు రాయండి.
జవాబు:
1. నారు పోసినవాడు నీరు పోయక పోడు..
2. ప్రకృతిని నమ్ముకో – ఆనందాన్ని జుర్రుకో.
3. అల్పుడెపుడు పల్కు అన్యాయపు మాటలు – సజ్జనుండు పల్కు న్యాయసూత్రాలు.
4. ధర్మ సంస్థాపన కోసం ఎవరో పుడతారనుకోకు – నీవే ధర్మాత్ముడవుకా.
5. అన్నీ నీలోనే ఉన్నాయని తెలుసుకో !
6. ఆరు నూరైనా – గొప్పవారు నీతి తప్పరు.
7. మూర్ఖుడికి గర్వం – పండితునికి నిగర్వం సహజం.
8. మనసు, మాట, పని ఒకటైతే సాధ్యం కానిది లేదు.
9. నీ భాషను, నీ దేశాన్ని అభిమానించడం పశుపక్ష్యాదులను చూసైనా నేర్చుకో..
10. మనసును అదుపులో పెట్టుకోవాలి.
11. మంచివాడి స్నేహం చేస్తే దుర్గుణాలు పోతాయి.
12. విద్వాంసులు మంచి గుణాలు విడువరు. అవే వారికి రక్ష.

ఇ) కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా జవాబులు రాయండి.

ప్రశ్న1.
మీ పాఠశాలలో నిర్వహించే పద్యాల పోటీలో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటన రాయండి.
జవాబు:

ఆహ్వానం

విషయం: పద్యాల పోటీ
అర్హత : కోనసీమ జిల్లాలోని 6 నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు అందరూ.
వేదిక : శ్రీనంద్ టెక్నో స్కూల్, అమలాపురం.’
సమయం : ఉదయం 9 గం|| నుండి సాయంత్రం 5 గం॥ వరకు.
తేది : 29, 08. 2004 (తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా)
బహుమతులు :
ప్రథమ బహుమతి : 2,000/-
ద్వితీయ బహుమతి : 1,500/-
తృతీయ బహుమతి : 1,000/-
గమనిక : పాల్గొను వారందరికీ భోజన సదుపాయం కలదు. పోటీలో పాల్గొను విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్ తప్పని సరిగా తెచ్చుకోవాలి.

ప్రశ్న 2.
పాఠంలో మీకు నచ్చిన ఏదైనా పద్యభావానికి తగిన నీతి కథ / గేయం / కవిత రాయండి.
జవాబు:
పలుచని ………….. భాస్కరా ! (28వ పేజీలోని 1వ పద్యానికి కథ)
రామాపురం అనే గ్రామంలో భీమయ్య, సోమయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండేవారు. భీమయ్య అన్నగారు. సోమయ్య తమ్ముడు. ఊళ్లో ఎవరి ఇంట్లో అశుభం జరిగినా అన్నగారే వెళ్లేవాడు. వారిని ఓదార్చి, పలకరించి వచ్చేవాడు. శుభకార్యాలకైతే ఇద్దరూ వెళ్లేవారు. అందరూ భీమయ్యనే ఎక్కువగా పలకరించేవారు. ఇది సోమయ్యకు నచ్చలేదు.

ఇటుపైన ఎవరింట్లో అశుభం జరిగినా తనే వెడతానన్నాడు. ఒకసారి తనతో వచ్చి పలకరించే పద్ధతి తెలుసుకోమని భీమయ్య చెప్పాడు. ఇష్టం లేకపోయినా సోమయ్య ఒప్పుకొన్నాడు. వాళ్ల వీథిలో సుబ్బయ్య గారి తల్లి మరణించింది. అన్నదమ్ములిద్దరూ పలకరించడానికి వెళ్లారు. అన్నగారు. “అయ్యయ్యో ! ఎంత కష్టం వచ్చిందండీ సుబ్బయ్య గారూ !

ఆమె మీకే కాదండీ నాకూ అమ్మలాగే అనిపించేవారు. నాకేమిటి ఊరందరికీ ఆవిడ తల్లిలాగే అనిపించేది. మీరే కాదు ఊరంతా తల్లిని కోల్పోయినట్లే బాధపడుతున్నాం .” అని మాట్లాడి ఓదార్చాడు. ఇంటికి వచ్చేటపుడు పలకరించే పద్ధతి తెలిసిందా అని అడిగాడు. తానేం తెలివి తక్కువవాడిని కానని కటువుగా చెప్పాడు సోమయ్య.

ఒక నెల పోయాక సుబ్బయ్యగారి భార్య పోయింది. సోమయ్య పలకరించడానికి వెళ్లాడు. “అయ్యయ్యో ఎంత కష్టం వచ్చిందండీ సుబ్బయ్యగారూ ! ఆమె మీకే కాదండీ నాకూ భార్య లాగే అనిపించేవారు. నాకేమిటి ఊరందరికీ ఆవిడ భార్య లాగే అనిపించేది. మీరే కాదు ఊరంతా భార్యను కోల్పోయినట్లే బాధపడుతున్నాం…..” అని అన్నగారి మాటలనే కాపీ కొట్టాడు. ఎక్కడలేని కోపంతో సుబ్బయ్య గారు సోమయ్యను చితక్కొట్టారు. మళ్లీ పరామర్శల జోలికి వెళ్లలేదు పాపం సోమయ్య.

(లేదా)
గేయం

మాతృభాష ……. కుప్పుసామి. (29వ పేజీలోని 8వ పద్య భావానికి గేయం)
మాతృభాషకు జేజేలు – మాతృభూమికి జేజేలు.
అమ్మ పాలకంటే కమ్మనైన భాషరా !
అమ్మఒడి కంటే చల్లనైన భూమిరా ! ॥ మాతృభాషకు ॥
అమ్మ ప్రేమతోడ పాడు పాట మాతృభాషరా !
నాన్న రక్షలోని దన్ను ‘నిచ్చు శక్తి మాతృభూమిరా ! ॥ మాతృభాషకు ॥
చెలిమి తోడ మెలగు జనుల కలిమి మన భాషరా !
బలిమితో అరుల కురులు వేయు భూమిరా ! ॥ మాతృభాషకు ॥

(లేదా)
కవిత

నీతిప్రౌఢ …………… ధీరోత్తముల్ – 29వ పేజీలోని 5వ పద్యానికి కవిత.

తప్పకు తప్పకు నీతిని నీవు
చెప్పిన నెవ్వరు గొప్పలు వినకు
కుప్పలు తెప్పలుగా సంపద రానీ గుప్పెడు మిగలక డబ్బులు పోనీ
ఇప్పుడె చప్పున ప్రాణం పోనీ
తప్పకు తప్పకు న్యాయం నీవూ !

భాషాంశాలు

పదజాలం

అ) కింది వాక్యాలలో ఎరుపు రంగు ఉన్న పదాలకు అర్థాలు రాయండి.


జవాబు:
1. మంచి చెప్పినా దృప్తుడు వినడు.
దృప్తుడు = గర్విష్టి

2. పండితుని ఖ్యాతి ప్రపంచమంతటా విస్తరిస్తుంది.
ఖ్యాతి = కీర్తి

3. విష్ణువు తల్పం ఆదిశేషుడు.
తల్పం = పాన్పు

4. కానలలో క్రూరమృగాలు ఉంటాయి.
కాన = అడవి

5. పగటికి రాజు భాస్వంతుడు.
భాస్వంతుడు = సూర్యుడు

ఆ) కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.


జవాబు:
1. పండితుడు = బుధుడు, విద్వాంసుడు
2. భుజగం = పాము, ఫణి
3. కరి = ఏనుగు, గజము
4. పక్షి = ఖగము, పులుగు
5. హరి = విష్ణువు, శౌరి

ఇ) కింది పదాలకు నానార్థాలు రాయండి.


జవాబు:
1. ధర = భూమి, ఖరీదు
2. శ్రీ = లక్ష్మీదేవి, సంపద
3. వారి = నీరు, పంచదార
4. పదము = పాదం, శబ్దం
5. మిత్రుడు = స్నేహితుడు, సూర్యుడు

ఈ) కింది పదాలకు వ్యుత్పత్యర్థాలు రాయండి.


జవాబు:
1. భాస్కరుడు = కాంతిని కలుగుజేయువాడు – సూర్యుడు
2. భుజగము = కుటిలముగా ఓోవునది – సర్పము
3. ఈశ్వరుడు = స్వభావము చేతనే ఐశ్వర్యము కలవాడు – శవుడు
4. హస్తి = హస్తము (తొండము) కలది – ఏనుగు

ఉ) కింది ప్రకృతి వికృతులను జతపరచండి


జవాబు:
1. చంద్రుడు ( ఆ ) అ) సామి
2. నిత్యము ( ఉ ) ఆ) చందురుడు
3. స్వామి ( అ ) ఇ) అంచ
4. హంస ( ఇ ) ఈ) దమ్మము
5. ధర్మము ( ఈ ) ఉ) నిచ్చలు

వ్యాకరణాంశాలు

అ) కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

జవాబు:
1. నిష్ఠురోక్తులు : నిష్ఠుర + ఉక్తులు = గుణసంధి
2. జేంకటేశ : వేంకట + ఈశ = గుణసంధి
3. అవ్వారి : ఆ + వారి = త్రికసంధి
4. మనుజూడగునే : మనుజుడు + అగును +ఏ = ఉత్వసంధి
5. ధీరోత్తముడు : ధీర + ఉత్తముడు = గుణసంధి

ఆ) కింది పదాలను కలిపి, సంధి పేరు రాయండి.

అనునాసిక సంధి:

కింది పదాలను గమనించండి.

వాక్ + మయము = వాజ్మయము
రాట్ + మహేంద్రవరం = రాణ్మృహంద్రవరం
జగత్ + నాథుడు = జగన్నాథుడు
అప్ + మయము = అమ్మయము

పై వాటిలో మొదటి పదాల చివర క,చ,ట,త,ప లు (వర్గ(్రథమాక్షరాలు) ఉన్నాయి. రెండవ పదం మొదట ‘న’ గాని ‘మ’, గాని ఉన్నాయి. అలా ఉన్నపుడు సంధి జరిగి ఆయా వర్గ అనునాసికాక్షరాలు ఆదేశంగా వస్తాయి. దానిని అనునాసిక సంధి అంటారు.

ఇలా ఉన్నపుడు సంధి కలిసి ఆయా వర్గాల అనునాసికాలు అంటే

క వర్గ అనునాసికం – ఒ
చ వర్గ అనునాసికం – ఇ
ట వర్గ అనునాసికం – ణ
త వర్గ అనునాసికం – న
ప వర్గ అనునాసికం – మ

ఆదేశంగా వస్తాయి. అంటే వర్గ ప్రథమాక్షరాలకు బదులుగా ఆయా వర్గానునాసికాలు వస్తాయి. అందుకే దీనికి అనునాసిక సంధి అని పేరు పెట్టారు.

ఈ సంధికి సూత్రం : వర్గ ప్రథమాక్షరాలకు న,మ లు పరమైతే ఆయా వర్గానునాసికాలు ఆదేశంగా వస్తాయి.
అపుడు : వాజ్మయం (క కారానికి బదులు ‘జ’ అనే అనునాసికం)
రాణ్మహేంద్రవరం (ట కారానికి బదులు ‘ణ’ అనే అనునాసికం)
జగన్నాథుడు (త కారానికి బదులు ‘న’ అనే అనునాసికం)
అమ్మయము (ప కారానికి బదులు ‘మ’ అనే అనునాసికం)

ఇ) కింది పదాలను కలిపి రాయండి.


1. జగత్ + నివేశ : జగన్నివేశ (అనునాసిక సంధి)
2. దిక్ + మండలము : దిఙ్మండలము (అనునాసిక సంధి)
3. రాట్ + మణి : రాణ్మృణి (అనునాసిక సంధి)

ఈ) కింది సమాస పదాలకు విగ్రహవాక్యం రాసి, సమాసం పేరు రాయండి.

1. శౌర్యలక్ష్మి : శౌర్యమనెడు లక్ష్మి – (రూపక సమాసం)
2. ప్రతిదినము : దినము దినము – (అవ్యయాభావ సమాసం)
3. బ్రతుకుదెరువు : బ్రతుకు కొఱకు తెరువు – (చతుర్థీ తత్పురుష సమాసం)
4. సజ్జనన సంగతి : సజ్జనులతో సంగతి – (తృతీయా తత్పురుష సమాసం)
5. గురుతర బాధ్యత : గురుతరమైన బాధ్యత – (విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం)

అలంకారములు

వృత్తను(ప్రాసాలంకారం
వవరణ: ఒకటి గానీ అంతకంటే ఎక్కువ గానీ హల్లులు పలుమార్లు వాక్యంలో గానీ పద్యపాదాలలో గానీ వచ్చి శబ్ద చమత్కారం కలిగిస్తే దానిని వృత్త్ననుప్రాసాలంకారం అంటారు.
ఉదా : భేరికా దాండదడాండదాండ నినదంబులజాండము నిండ
పై పద్యాన్ని గమనించినపుడు ‘డ’ అనే హల్లు పలుమార్లు ఆవృత్తి కావటం వలన ఇది వృత్త్నుప్రాసాలంకారం అవుతుంది.

ఉ) కింది పద్యపాదం/వాక్యాలలోని అలంకారాలను గుర్తించండి.

ప్రశ్న 1.
అక్షరజ్ఞానం లేని నిరక్షరకుక్షి ఈక్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును.
జవాబు:
ఈ వాక్యములో వృత్తనుప్రాసాలంకారం ఉంది.
సమన్వయం : పై వాక్యమును గమనిస్తే “క్ష” కారం అనే హల్లు పలుమార్లు ఆవృత్తి కావటం వల్ల వృత్తను(ప్రాసాలంకారమైంది.

ప్రశ్న 2.
ఇదికాదదియనునదికా
దిదియను నిది నదియు వదిలి యెదియో వదరన్
వదలని ముదములఁ బొదలగ
నదవదపడి చెదరి యెడఁద హరిరనాథా
జవాబు:
ఈ పద్యంలో వృత్తనుప్రాసాలంకారముంది.
సమన్వయం : పై పద్యంలో “ద” కారమనే హల్లు పలుమార్లు ఆవృత్తి కావటం వల్ల వృత్యనుస్రాసాలంకారమైంది.

ప్రశ్న 3.
లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా?
జవాబు:
ఈ వాక్యంలో వృత్యనుప్రాసాలంకారముంది.
సమన్వయం : పై వాక్యంలో “క్ష” కారం అనే హల్లు పలుమార్లు ఆవృత్తి కావటం వల్ల వృత్యనుుర్రాసాలంకారమైంది.

దృష్టాంతాలంకారము:

కింది వాక్యమును పరిశీలించండి.
పెరుగును యింత చిలికినా వెన్ననే ఇస్తుంది. అలాగే మంచివారిని యింత బాధించినా మంచే చేస్తారు. ఇందులో మంచివారిని పెరుగుతో పోల్చారు. ఇక్కడ రెండు వాక్యముల యందు వేరువేరు ధర్మాలు చెప్పబడ్డాయి. ఇలా ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాలను బింబప్రతిబింబ భావంతో చెప్తే అది దృష్టాంతాలంకారము.
జవాబు:
కొన్ని దృష్టాంతాలంకార ఉడాహరణలను గుర్తించి రాయండి.
పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది.
అలాగే మంచివారిని ఎంత బాధించిసా మంచే చేస్తారు.
ఈ రెండు వాక్యాలలో వేరు వేరు ధర్మాలు చెప్పారు.
మంచివారిని పెరుగుతో పోల్చారు.
మంచితనాన్ని వెన్నతో హోల్చారు.

కాని, రెండింటి ధర్మాలూ వేరు, అయినా ఒకదానికి దృష్టాంతంగా మరొక విషయం చెప్పారు. ఆ ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెప్పారు. కనుక దీనిని దృష్టాంతాలంకారం అంటారు.

లక్షణం : ఉపమాన ఉపమేయాల వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెబితే డానిని దృష్టాంతాలంకారం అంటారు.

కొన్ని దృష్షాంతాలంకార ఉడాహరణలను గుర్తించి రాయండి.

ప్రశ్న 1.
పలుచని నీచమానపుడు ……………. భాస్క్రు!
జవాబు:
అనే పద్యంలో దృష్టాంతాలంకారం ఉంది….
లక్షణం : ఉపమాన ఉపమేయాల వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెబితే దానిని దృష్టాంతాలంకారం అంటారు.

సమన్వయం : నీచ మానవుని వెలితి కుండతో పోల్చారు. గుణవంతుని నిండుకుండతో పోల్చరు. కాని, ఉపమాన, ఉపమేయాల ధర్మాలు వేరు. అయినా ఒకదానికి ఒకది బింబ ప్రతిబింబ భావంతో చెప్పారు. కనుక ఇచ్చిన పద్యంలో ద్షాంతాలంకారం ఉంది.

ఛందన్సు

కింది ఉదాహరణ ద్వారా తేటగీతి పద్య లక్షణాలను తెలుసుకుందాం.

A close up of text

AI-generated content may be incorrect.
ఈ పద్యపాదంలో ఒక సూర్యగణం (గల), రెండు ఇంద్ర (సల, సల) గణాలు, రెండు సూర్య (గల, న) గణాలు ఉన్నాయి. మొత్తం 5 గణాలున్నాయి. 5వ గణం మొదటి అక్షర(స-సా)మునకు యతి చెల్లింది.

ఋ) తేటగీతి పద్య లక్షణాలు

1. తేటగీతి ఉపజాతికి చెందిన పద్యం.
2. ఇందులో నాలుగు పాడాలుంటాయి.
3. ప్రతిపాదంలో వరుసగా ఒక సూర్య గణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్య గణాలు ఉంటాయి.
4. ప్రతి పాదంలో నాలుగవ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది.
5. యతిలేని చోట ప్రాసయతి చెల్లుతుంది.
6. ప్రాసనియమము లేదు.

బూ) పాఠంలో ఐదు, ఆరు, పది పద్యాల పాదాలకు గురులఘువులు గుర్తించి గణవిభజన చేసి లక్షణాలు రాయండి.

ఇది ఈర్దూల పద్య పాదము.
యత : 1 – 13వ అక్షరము.
1వ పాదం : నీ – నిం ; 2వ పాదం : ఖ్లా – గా ; 3వ పాదం : ఘూ – గా ; 4వ పాదం : నీ – ని
ప్రాస : రెండవ అక్షరము “తి – తిం – తం – తి”

లక్షణము :
1. శార్దూల పద్యమునందు నాల్గు పాదాలుంటాయి.
2. ప్రతి పాదమునందు మ,స,జ,స,త,త,గ అనే గణాలు వరుసగా ఉంటాయి.
3. పాదాది అక్షరానికి అ పాదంలోని 13వ అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది.
4. ప్రాస నియమము కలదు. ప్రాసయతి చెల్లదు.
5. శార్దూల పద్యపాదంలో మొదటి గురువును రెండు లఘువులను చేసినచో అది మత్తేధ పద్యపాదమవుతుంది.

ఇది చంపకమాల పద్యపాదము.
యతి : 1 – 11వ అక్షరము.
1వ పాదం : తె – దృ ; 2వ పాదం : దె – తిన్ ; 3వ పాదం : జ్ట్ర – స ; 4వ పాదం : తె – తిం
ప్రాస : రెండవ అక్షరము “లి-లి-ల-లి”

లక్షణము :
1. చంపకమాల పద్యము నందు నాలుగు పాదాలుంటాయి.
2. ప్రతి పాదమునందు న, జ, ఫ, జ, జ, జ, ర అనే గణాలు వరుసగా ఉంటాయి.
3. పాడాది అక్షరానికి ఆ పాదంలోని 11వ అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది.
4. ప్రాస నియమము కలదు. ప్రాసయతి చెల్లదు.
5. చంపకమాల పద్యప్చోదము నందు మొదటి రెండు లఘువులను ఒక గురువు చేసినచో అది ఉత్పలమాల పద్య పాదమవుతుంది.

ఇది మత్తేభ పద్యపాదము.
యతి : 1 – 14వ అక్షరము.
1వ పాదం : ధ-త్+సం ; 2వ పాదం : బ-స్+వం ; 3వ పాదం : త-ద్రం ; 4వ పాదం : ప-ల్+పా
ప్రాస : రెండవ అక్షరము “ర-ర-ర-ర”

లక్షణము :
1. మత్తేభ పద్యము నందు నాలుగు పాదాలుంటాయి.
2. ప్రతి పాదమునందు స,థ,ర,న,మ,య,వ అనే గణాలు వరుసగా ఉంటాయి.
3. పాదాది అక్షరానికి ఆ పాదంలోని 14వ అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది.
4. ప్రాస నియమము కలదు. ప్రాసయతి చెల్లదు.
5. మత్తేభ పద్యపాదము నందు మొదటి రెండు లఘువులను ఒక గురువు చేస్తే అది శార్దూల పద్యపాదమవుతుంది.

shataka maduryam class 10 minutes a dayz map,shataka maduryam class 10 minutes a day shift,10th class telugu shataka madhurima project work,shataka maduryam class 10 minutes pdf,shataka madhurima 10th class telugu lesson,shataka madhurima padyalu 10th class,10th class shataka madhurima lesson,10th class shataka madhurima project,10th class shataka madhurima patam,10th class shataka madhurima padyalu,shataka maduryam class 10fastfingers pdf download,shataka maduryam class 10fastfingers answers,shataka maduryam class 10fastfingers solutions

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles