కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము 

 

* కర్త ప్రధానంగా కలిగే వాక్యాలు కర్తరీ వాక్యాలు.

కర్తరీ వాక్యం : కర్త ప్రధానంగా ఉంటుంది.

1. రాముడు విభీషణుని రక్షించాడు.

2. రాముడు రాక్షసులను సంహరించాడు.

* అంటే కర్తరీ వాక్యంలో కర్తకు ప్రధమా విభక్తి వస్తుంది. కర్మకు ద్వితీయా విభక్తి వస్తుంది. కర్మణి వాక్యం : దీనిలో కర్మ ప్రధానంగా ఉంటుంది.

* కర్మణీ వాక్యంలో కర్తకు తృతీయా విభక్తి, కర్మకు ప్రధమా విభక్తి వస్తుంది. ఆ

* కర్మ ప్రధానంగా కలిగే వాక్యాలు కర్మణీ వాక్యాలు.

* కర్మణీ వాక్యంలో కర్మ ప్రధానంగా ఉంటుంది. చేసే పనిని తెలియజేసే పదం కర్మ అయితే, పనిని చేసేవాడు కర్త, కర్మణీ వాక్యంలో ‘బడు, బడి’ అనేవి క్రియను అనుసరించి ఉంటాయి. ప్రయోగం తెలుగులో లేదు. అది ఇతర భాషల నుండి వచ్చింది. ‘బడు, బడి’కి అసలు రూపం పడు, పడి అనునవి.

1. రామునిచే విభీషణుడు రక్షింపబడెను. 

2. రామునిచే రాక్షులు సంహరింపబడిరి.

* మొదటి వాక్యంలో ఏకవచనం,

 రెండవ వాక్యంలో బహువచనం ఉన్నందున

 క్రియ మొదటి దాంట్లో ఏక వచనంగానూ, రెండవ వాక్యంలో బహువచనంగానూ ఉంది.

 * పై రెండు వాక్యాలను కర్తరీ వాక్యంలోకి మార్చగా,

కొన్ని ఉదాహరణలు

1. రామకృష్ణారామ్లు ఆమోదముద్ర వేశారు. (కర్తరీ)

రామకృష్ణారావు గారిచే ఆమోదముద్ర వేయబడింది. (కర్మణీ వాక్యం) 

2 దున్నేవానికి భూమినిచ్చే హక్కు తయారయ్యింది. (కర్తరీ)

దున్నేవానికి భూమినిచ్చే హక్కు తయారు చేయబడింది. (కర్మణీ) 

3. బూర్గులవారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు. (కర్తరీ)

బూర్గుల వారి చేత మంచి నిర్ణయాలు తీసుకోబడ్డాయి. (కర్మణీ)

 4. రేఖా మాత్రంగా నా భావాలు ఇక్కడ పొందుపరిచారు. (కర్తరీ)

రేఖా మాత్రంగా నా భావాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. (కర్మణీ)

 5, ఆయన కన్నుమూసిన విషయం పత్రికలో రాశారు. (కర్తరీ)

ఆయన కన్నుమూసిన విషయం పత్రికలో రాయబడింది. (కర్మణీ)

 6.  పర్షియన్ ట్యూటర్‌గా ఆయన కొంతకాలం పనిచేశారు. (కర్తరీ)

పర్షియన్ ట్యూటర్ గా ఆయన కొంతకాలం పనిచేయబడ్డారు. (కర్మణీ) 

7. వాల్మీకి రామాయణాన్ని రాశారు. (కర్తరీ)

రామాయణము వాల్మీకి చేత రాయబడింది(కర్మణీ)

 8. వాల్మీకి రామాయణం రచించెను. ( కర్తరీ)

రామాయణం వాల్మీకిచే రచింపబడింది. (కర్మణీ) 

9. శివాజీ రోషనారను తిరస్కరించెను.(కర్తరీ)

రోషనార శివాజీ చేత తిరస్కరించబడింది. (కర్మణీ) 

10.డీప్ ఫ్రిజ్ నుండి అప్పుడే బయటకు తెచ్చిన ఆహారం సేవిస్తాడు.(కర్తరీ)

డీప్ ఫ్రిజ్ నుండి అప్పుడే బయటకు తేబడిన ఆహారాన్ని సేవిస్తాడు. (కర్మణీ)

 1 1.ఇవి రచించి ఇంచుమించు పదునైదు వర్షములు గడిచినవి.(కర్తరీ)

ఇవి రచింపబడి ఇంచుమించు పదునైదు వర్షములు గడచినవి. (కర్మణీ) 

12 చాసో బొండు మల్లెలు రచించినాడు. (కర్తరీ

బొండు మల్లెలు చాసో చేత రచింపబడింది. (కర్మణీ) 

13.విప్లవ భావాలు నాలో వర్ధిల్లాయి. (కర్తరీ)

నాలో విప్లవ భావాలు వర్ధిల్లబడ్డాయి. (కర్మణీ) 

14.ఆ పద్యం పూర్తి కాకముందే పై కప్పీలో ఇరుక్కున్న తీగను సవరించారు. (కర్తరీ)

ఆ పద్యం పూర్తి కాకముందే పై కప్పీలో ఇరుక్కున్న తీగ సవరించబడింది. (కర్మణీ)

 15.చంద్రమతి పాత్రను స్థానం నరసింహారావు ధరించారు. (కర్తరీ)

చంద్రమతి పాత్రను స్థానం నరసింహారావు చే ధరించబడింది. (కర్మణీ) 

16, రాముడు సీతను పెండ్లాడాడు. (కర్తరీ)

సీత రామునిచే పెండ్లాడబడింది. (కర్మణీ)

 17.అని నవీన పద్ధతుల పై నిర్మించిన అత్యంత నవీన పరికరాలతో అమర్చిన ఆదర్శ గృహమది. (కర్తరీ)

అతి నవీన పద్ధతులపై నిర్మించి, అత్యంత పరికరాలతో అమర్చబడిన ఆదర్శ గృహమది. (కర్మణీ) 

18.బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు (కర్తరీ),

బాలుచే ఇసుకతో ఇల్లు కట్టబడింది. (కర్మణీ) 

19.ఆళ్వారు స్వామి “చిన్నప్పుడే” అనే కథను రాశాడు. (కర్తరీ)

చిన్నప్పుడే అనే కథ ఆళ్వారు స్వామిచే వ్రాయబడింది. (కర్మణీ)