1. అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే పదార్థం?

ఎ. పోటాషియం 

బి. కాల్షియం

సి. కార్బోహైడ్రేట్స్‌ 

డి. ఏవీ కావు

2. సుగంధ ద్రవ్యాలు ..

1. యాలకులు, లవంగాలు

2. దాల్చిన చెక్క, నల్ల మిరియాలు

3. బిర్యానీ ఆకు

4. జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర

ఎ. 1, 4.         బి. 2, 3, 4

సి. 1, 3, 4.     డి. 1, 2, 3

3. కింది వాటిలో డ్రై ఫ్రూట్స్‌ ..

ఎ. జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌

బి. అరటి, మామిడి

సి. జామ, యాపిల్‌ డి. డ్రాగన్‌ ఫ్రూట్‌

4. టమాటాలో అధికంగా ఉండే విటమిన్‌

ఎ. థయామిన్‌      బి. విటమిన్‌ K

సి. విటమిన్‌ C      డి. విటమిన్‌ B3

5. కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు,

 డిజైన్లతో అందంగా అలంకరించడాన్ని ఏమంటారు?

ఎ. కూరగాయల ఆకారం

బి. సాలటా

సి. డిజైన్లు రూపం

డి. వెజిటబుల్‌ కార్వింగ్‌

6. ‘సాలడ్‌’ అనే పదం ఏ లాటిన్‌ పదం నుంచి వచ్చింది?

ఎ. కజానస్‌ బి. సాలటా

సి. సెటైవం డి. పైవన్నీ

7. ‘సాలటా’ అంటే అర్థం?

ఎ. ఉప్పు      బి. తీపి

సి. కారం       డి. చేదు

8. కెరోటినాయిడ్‌ అధికంగా ఉండే ఆహార పదార్థ్ధాలు 

తినడం ద్వారా ఏ వ్యాధికి గురయ్యే ప్రమాదం తగ్గుతుంది?

ఎ. బెరిబెరి        బి. క్షయ

సి. క్యాన్సర్‌      డి. మధుమేహం

9. రాజస్థాన్‌లో ‘వరి’ కంటే అధికంగా పండే పంటలు?

ఎ. మొక్కజొన్నలు బి. సజ్జలు

సి. గోధుమలు డి. మినుములు

ఎ. 1, 3, 4       బి. 1, 2, 3

సి. 2, 3, 4       డి. 1, 3, 4

10. వాన చినుకు గంటకు ఎన్ని మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది?

ఎ. 6 నుంచి 5 మైళ్లు

బి. 7 నుంచి 9 మైళ్లు

సి. 7 నుంచి 14 మైళ్లు

డి. 7 నుంచి 18 మైళ్లు

11. వాన చినుకు వ్యాసార్ధం?

ఎ. 0.01 నుంచి 0.02 అంగుళాలు

బి. 0.02 నుంచి 0.31 అంగుళాలు

సి. 0.02 నుంచి 0.03 అంగుళాలు

డి. ఏదీకాదు

12. తొలి పర్యాయం ఈజిప్టులు గొడుగును దేనికోసం తయారు చేశారు?

ఎ. వాన నుంచి రక్షణకు

బి. తుపాను నుంచి రక్షణకు

సి. ఎండ నుంచి రక్షణకు     డి. పైవన్నీ

13. రెక్కలు ఉండి ఎగరలేని పక్షులు?

ఎ. పెంగ్విన్‌, ఆస్ట్రిచ్‌      బి. ఈమూ, రేహ

సి. గద్ద, పిచ్చుక         డి. కోడి, బాతు

1. ఎ, సి, డి     2. ఎ, సి, బి

3. ఎ, బి       4. బి, సి, డి

14. ప్రస్తుతం భూమి మీద ఉన్న క్షీరద జాతుల సంఖ్య?

ఎ. 5,380     బి. 5,410

సి. 4,584     డి. 5,400

15. జంతువుల్లో అతిపెద్దది నీలి తిమింగలం. దీని పొడవు మీటర్లలో?

ఎ. 20 నుంచి 25 మీటర్లు

బి. 20 నుంచి 30 మీటర్లు

సి. 10 నుంచి 15 మీటర్లు

డి. 30 నుంచి 45 మీటర్లు

16. జీవితంలో ఎక్కువ కాలం ఒకే ప్రదేశంలో ఉండేవి ఏవి?

ఎ. స్పంజికలు       బి. హైడ్రా

సి. బద్దెపురుగు    డి. పైవన్నీ

17. పక్షులు సకశేరుకాలు. కారణం ఏమిటి?

ఎ. వెన్నెముక లేకపోవడం

బి. వెన్నెముక ఉండటం

సి. ఉరోస్థి ఉండటం

డి. రెక్కలు కలిగి ఉండటం

18. షార్క్‌ చేప నోటిలో ఉండే దంతాల సంఖ్య?

ఎ. 3,000       బి. 2,500

సి. 4,000       డి. వందల సంఖ్యలో

19. సముద్రగర్భంలో మైళ్ళ పరిణామంలో ఉండే ‘కోరల్‌రీఫ్‌’ అనేది?

ఎ. ఆవాసం              బి. నీటిలోని పొర

సి. చీకటి ప్రాంతం     డి. పైవన్నీ

20. వర్షానికి తడవని బట్టలు తయారు చేసినది?

ఎ. డాక్టర్‌ మియోషివో కమోటో

బి. చార్లెస్‌ మెకింతోష్‌

సి. వోల్డో ఎల్‌. సీమన్‌

డి. చార్లెస్‌ డార్విన్‌

21. ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పాలీవినైల్‌ క్లోరైడ్‌ను కనుగొన్నది?

ఎ. ఐన్‌స్టీన్‌

బి. వోల్డో ఎల్‌. సీమన్‌

సి. థామన్‌ అల్వా ఎడిసన్‌

డి. గ్రెగర్‌ మెండల్‌

22. కర్రగుజ్జుకు రసాయనాలు కలిపి తయారు చేసే దారాలు?

ఎ. సిల్క్‌           బి. పట్టు

సి. రేయాన్‌      డి. నూలు

23. ఒక పత్తి కాయ నుంచి తీసేదారం మీటర్లలో?

ఎ. 500 మీటరు        బి. 235 మీటర్లు

సి. 2,000 మీటర్లు     డి. 750 మీటర్లు

24. యాపిల్‌, దోస బరువులో ఉండే నీటి శాతం?

ఎ. 30, 40 శాతం     బి. 84, 96 శాతం

సి. 65, 55 శాతం    డి. ఏదీకాదు

25. ‘బనానా ఆయిల్‌’ను దేని నుంచి తయారు చేస్తారు?

ఎ. అరటి పండు    బి. కిణ్వనం

సి. పెట్రోలియం    డి. కిరోసిన్‌

26. పుష్పంలో లైంగిక భాగాలు?

ఎ. కీలం      బి. పరాగకోశాలు

సి. కీలాగ్రం    డి. పైవన్నీ

27. పుష్పాలు రంగులు కలిగివుండి పరాగ సంపర్కం

 కోసం వేటిని ఆకర్షిస్తాయి?

ఎ. పరాగ రేణులు     బి. పక్షులు

సి. కీటకాలు           డి. మిడతలు

28. కాండం పీఠభాగం నుంచి ఉద్భవించే వేర్లు?

ఎ. తల్లివేరు         బి. పార్శవేర్లు

సి. పీఠ వృంత వేర్లు      డి. పీచువేర్లు

29. మిరపకాయలో కారం కలిగించే పదార్థం?

ఎ. కాప్సిపిన్‌     బి. కెరోటిన్‌

సి. టయలిన్‌     డి. ఏదీకాదు

30. పత్రంలో ఉండే ముఖ్య భాగాలు?

ఎ. పత్రపీఠం      బి. పత్రవృంతం

సి. పత్రదళం      డి. శాఖలు

1. ఎ, సి, డి     2. ఎ, బి. సి

3. ఎ. సి, డి    4. బి, సి, డి

31. పత్రంలో రేఖల వంటి నిర్మాణాలు?

ఎ. ఈనెలు     బి. పత్రదళం

సి. పత్రపుచ్చం    డి. హరితరేణువులు

32. కిరణజన్య సంయోగక్రియలో ఆహారం తయారుచేసే భాగం?

ఎ. పత్రాలు    బి. కాండం

సి. పండు     డి. మొగ్గలు

33. తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలలో ఏ ఈనెల వ్యాపనం ఉంటుంది?

ఎ. సమాంతర ఈనెల వ్యాపనం

బి. జాలాకార ఈనెల వ్యాపనం

సి. జాలకార, హస్తాకార ఈనెల వ్యాపనం

డి. ఈనెల వ్యాపనం ఉండదు

34. పీచువేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాల్లో ఏ ఈనెల వ్యాపనం ఉంటుంది?

ఎ. సమాంతర ఈనెల వ్యాపనం

బి. జాలాకార ఈనెల వ్యాపనం

సి. వేరువ్యవస్ధ ఉండదు

డి. పత్రాల చివరిలో మొగ్గ ఉంటుంది

35. కాండంపై పత్రం ఎక్కడ అతికి ఉంటుంది?

ఎ. పత్రదళం        బి. పత్రపీఠం

సి. పత్రవృంతం    డి. పైవన్నీ

36. పత్రదళాన్ని కాండంతో కలిపే భాగం?

ఎ. పత్రవృతం     బి. పీఠభాగం

సి. ఈనెలు         డి. వేరు

37. వెడల్పుగా విప్పారి ఉన్న పత్రభాగంలో ఉన్న

 సన్నని రేఖల వంటి నిర్మాణాలు?

ఎ. పత్రదళం       బి. ఈనెలు

సి. మధ్య ఈనె    డి. పత్రం అంచు

38. పత్రంలో చిక్కుడుగింజ ఆకారంలో ఉండే భాగం?

ఎ. ఆకర్షణ పత్రాలు    బి. రక్షక కణాలు

సి. పత్ర రంధ్రాలు     డి. మధ్య ఈనె

39. రక్షక కణాల మధ్యలో ఉన్న రంధ్రాన్ని ఏమంటారు?

ఎ. పత్రదళం        బి. పత్ర రంధ్రం

సి. పత్రవృంతం     డి. ఏదీకాదు

40. ఎండిన ఆకులపై వివిధ రకాల సాంప్రదాయక, పౌరాణిక 

చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు. అది ఏ జిల్లాలో?

ఎ. హనుమకొండ    బి. నిర్మల్‌

సి. వరంగల్‌    డి. ఆదిలాబాద్‌

41. మొక్కల్లో నీరు ఆవిరిరూపంలో విడదల

   కావడాన్ని ఏమంటారు?

ఎ. కోరకీభవనం    బి. భాష్పోత్సేకం

సి. నీటి ఆవిరి      డి. బోన్సాయ్‌

42. ద్రాక్ష వంటి ఎగబాకే మొక్కల్లో కాండం బలహీనంగా ఉంటుంది.

 అలాంటి మొక్కల్లో మొక్క కింద పడిపోకుండా ఆపే నిర్మాణలు?

ఎ. తీగలు, కొక్కేలు

బి. పార్శవేర్లు

సి. పీచువేర్లు

డి. మృదువైన కాండం

43. ‘బోన్సాయ్‌’ అంటే?

ఎ. పొడవైన వృక్షాలు

బి. పొట్టి వృక్షాలు

సి. మరుగుజ్జు వృక్షం

డి. అతిపొడవైన వృక్షం

44. చిరుతపులి గంటకు ఎంత వేగంతో పరుగెత్త గలదు?

ఎ. 97 కి.మీ     బి. 45 కి.మీ

సి. 100 కి.మీ     డి. 90 కి.మీ

45. నత్త ఒక సెకనుకు ఎంత వేగంతో చలిస్తుంది?

ఎ. 0.02 మీటర్లు

బి. 0.013 నుంచి 0.028 మీటర్లు

సి. 0.001 నుంచి 0.003 మీటర్లు

డి. అసలు చలనం ఉండదు

46. కండరాలకు గుండ్రంగా, తెల్లగా ఉండే దారాల్లాంటి

 నిర్మాణ తంతువులు?

ఎ. టెండాన్‌లు

బి. కండర తంతువులు

సి. ఎగ్జాన్‌     డి. పైవన్నీ

47. పక్షుల్లో అతి చిన్న పక్షి ‘హమ్మింగ్‌ బర్డ్‌’. 

 దీని పొడవు సెంటీ మీటర్లలో?

ఎ. 5.2 సెం.మీ        బి. 3.0 సెం.మీ

సి. 5.7 సెం.మీ        డి. 6.0 సెం.మీ

48. పక్షుల్లో మగ ఆస్ట్రిచ్‌ పక్షి బరువు ఎన్ని కిలోలు?

ఎ. 150     బి. 125    సి. 345     డి. 156

49. ఆస్ట్రిచ్‌ పక్షి బరువు పౌండ్లలో?

ఎ. 345     బి. 340    సి. 346     డి. 450

50. బోన్సాయ్‌ అంటే మరుగుజ్జు వృక్షం అని అర్థం. 

అయితే ఇది ఏ దేశపు సంప్రదాయ కళ?

ఎ. భారతదేశం       బి. ఇంగ్ల్లండ్‌

సి. జపాన్‌             డి. రష్యా

51. భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాల్లో ఎంత నీరు ఉంటుంది?

ఎ. 240 మిలియన్‌ క్యూబిక్‌ మైళ్లు

బి. 300 మిలియన్‌ క్యూబిక్‌ మైళ్లు

సి. 150 మిలియన్‌ క్యూబిక్‌ మైళ్లు

డి. ఏదీకాదు

52. డెయిరీ పరిశ్రమలో భారీ ఎత్తున పాలనుంచి పెరుగు

 తయారు చేసే విధానాన్ని ఏమంటారు?

ఎ. కిణ్వనం          బి. ద్రవ్యనిత్యత్వం

సి. కోయాగ్యులేషన్‌        డి. సరళీకరణం

53. బంగారం, వజ్రాల నాణ్యతను దేనిలో కొలుస్తారు?

ఎ. కేజీల్లో                   బి. గ్రాముల్లో

సి. మిల్లీగ్రాముల్లో       డి. క్యారెట్స్‌లో

54. ఆరోగ్యవంతుడైన మానవుని గుండె జీవిత కాలంలో

  ఎన్ని సార్లు కొట్టుకుంటుంది?

ఎ. 2.5 బిలియన్లు

బి. 72

సి. 250

డి. 3.5 బిలియన్లు

55. మానవుని హృదయం నిమిషానికి ఎంత రక్తాన్ని పంపుచేస్తుంది?

ఎ. 4 నుంచి 5 లీటర్లు

బి. 5నుంచి 30 లీటర్లు

సి. 6నుంచి 23 లీటర్లు

డి. మూడు లీటర్లు మాత్రమే

56. మానవ శరీరంలో అతి పొడవైన ఎముక?

ఎ. జత్రుక        బి. వెన్నుపూస

సి. దవడ ఎముక       డి. ఫీమర్‌

57. చెవి, ముక్కు భాగాల్లో ఉండే ఎముకలు?

ఎ. కటి ఎముక      బి. మృదులాస్థి

సి. బంతిగిన్నె      డి. ఏదీకాదు

58. మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవం

 ఊపిరితిత్తులు అని పేర్కొన్నది?

1. అమెరికా

2. మిన్నెసోటా సైన్స్‌ మ్యూజియం

3. సీసీఎంబీ

4. బ్రిటిష్‌ సైన్స్‌ మ్యూజియం

ఎ. 1, 3, 4       బి. 1, 2

సి. 2, 3          డి. 1, 4, 3

59. మనవుని మెడలో ఉండే కీలు?

ఎ. బంతిగిన్నె కీలు

బి. బొంగరపు కీలు

సి. జారెడు కీలు

డి. మడతబందు కీలు

 *సమాధానాలు* 

1. ఎ 2. డి 3. ఎ 4.సి 5. డి 6. బి 7. ఎ 8.సి 9. బి 10.డి 11.బి 12.సి

13.సి 14.డి 15.బి 16.ఎ 17.బి 18.సి 19.ఎ 20.బి 21.బి 22.సి 23.ఎ 24.బి

25.సి 26.డి 27.సి 28.డి 29.ఎ 30.బి 31.ఎ 32.ఎ 33.బి 34.ఎ 35.బి 36.ఎ

37.బి 38.బి 39.బి 40.సి 41.బి 42.ఎ 43.సి 44.బి 45.బి 46.ఎ 47.సి

48.డి 49.ఎ 50.సి 51.బి 52.సి 53.డి 54.ఎ 55.బి 56.డి 57.బి 58.బి 59.బి