“పూర్వ పర స్వరంబులకు బర స్వరంబేకాదేశంబగుట సంధియనంబడు” అనగా మొదటి అచ్చునకు తరువాతి అచ్చు పరముకాగా ఆ రెండు అచ్చులకు మారుగ రెండవ అచ్చే ఆదేశమగుటను “సంధి” అని అంటారు.
రెండు సమర్ధవంతమైన పదాలు ఒక అర్ధవంతమైన పదంగా కలిసి పోవడాన్నే “సంధి” అంటారు.
సంధిలోని రెండు పదములను విడదీయునపుడు ” గుర్తునకు ఎడమవైపు ఉన్న పదాన్ని పూర్వ పదమనియు, కుడివైపున గల పదాన్ని పరపదమనియు అంటారు..
* ఉచ్ఛారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసివచ్చినపుడు “సంధి పదం” ఏర్పడుతుంది.
* వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల కలయికను “సంధి” అని ఆ రెండు స్వరాల మధ్య జరిగే మార్పును “సంధికార్యం” అని అంటారు.
4. వృద్ధి సంధి : సూత్రం: ‘అ’ కారానికి ఏ, ఐ లు పరమైతే ‘ఐ’ కారము ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ కారము, ఋ ఋ లు పరమైతే ‘ఆర్’ వస్తుంది. (ఐ, ఔ అను వృద్ధులంటారు)
ఉదా: భువన + ఏక = భువనైక (అ ఏ ఐ)
రస + ఏక = రసైక
అఖండ + ఐశ్వర్యం = అఖండైశ్వర్య (అ ఐ ఐ)
దివ్య + ఐరావతం = దివ్మైరావతం
పాప + ఓఘం = పాపౌఘం (అ ఓ ఔ) *
పరమ + ఔషధం = పరమౌషధం (అఔఔ)
ఘన + ఓషధి = ఘనౌషధి =
ఋణ + ఋణం = ఋణార్ణం (అఋ ఆర్)
మరికొన్ని ఉదాహరణలు:
రస + ఔచిత్యం = రసౌచిత్యం
సుర + ఏక = సురైక
ఏక + ఏక = ఏకైక *
వన + ఓషది = వనౌషది
స్వరూప + ఔచిత్యం = స్వరూపౌచిత్యం
దేశ + ఔన్నత్యం = దేశాన్నత్యం
5. అనునాసిక సంధి:
సూత్రం:- క, చ, ట, త, ప లకు న, మ లు పరమైతే వాటి అనునాసికాక్షరములు)ఆదేశమగును.
ఉదా: వాక్ + మయము వాజ్మయము
జగత్ + నాటకము = జగన్నాటకము
6. విసర్గ సంధి :
జగత్ + నిలయము జగన్నిలయము
మరుత్ + నగము = మరున్నగము
1వ సూత్రం: హ్రస్వ అకారం మీది విసర్గకు ‘అవర్గం’ గాని, వర్గ తృతీయ, చతుర్ధ, పంచమాక్షరాలు గాని, హ, య, వ, ర, ల అనే అక్షరాలు గాని పరం అయితే విసర్గకు లోపం వచ్చి దానికి ముందున్న హ్రస్వ అకారానికి ఓకారం ఆదేశంగా వస్తుంది.
ఉదా: అయ:+ మయం= అయోమయం (అయస్ + మయం అసకు బదులుగా ఓ వస్తుంది)
ఇత: + అధికం = ఇతోధికం
పయః + ది = పయోధి
పయః + ధరం = పయోధరం
* పవనాంధః + లోకముల్ = పవనాంధోలోకముల్
యశః + వా = యశోవా
నమః + నమః = నమోనమః
మనః + హరం = మనోహరం
2 వ సూత్రం: విసర్గకు ముందు అకారేతర అచ్చు పరమగునపుడు విసర్గకు రేఫం అంటే ‘ర’ కారం
వస్తుంది.
ముహు: + ముహుః = ముహుర్ + ముహుః = ముహుర్ముహు:
అదే విధంగా : చతుః + ముఖుడు = చతుర్ముఖుడు
ధనుః + బాణములు = ధరురాణములు
ఉదా:
మృత్యుః + వా = మృత్యుర్వా
ఆశీ: + వాదం = ఆశీర్వాదం =
దుః + అభిమానం = దురభిమానం
అంతః + మధనం = అంతర్మధనం
3వ సూత్రం: అహస్, స్వస్, ప్రాతస్, పునస్ శబ్దాల ‘స’ కారానికి ‘ర’ కారం వస్తుంది.
ఉదా:
అహః + నిశలు = అహర్ + నిశలు, = అహర్నిశలు
అదే విధంగా : పునః + ముద్రించు = పునర్ముద్రించు
అంతః + జాతీయ = అంతర్జాతీయ =
పునః + ఉద్ధరణ = పునరుద్ధరణ
4 వ సూత్రం: విసర్గకు శ, ష, స లు పరమైతే శ, ష, స లే వస్తాయి.
ఉదా: సభ: + సుమం = సభస్సుమం, మనః + శాంతి = మనశ్శాంతి, చతు: + షష్టి = చతుషష్టి 6 వ సూత్రం: ఇస్, ఉస్ అంతంలో ఉన్న పదాలలో ‘స’ కారం ‘ష’ కారమవుతుంది. ఉదా: బహిస్ + కారం = బహిష్కారం
1వ సూత్రం: కర్మధారయ సమాసంలో పేదాది శబ్దాలకు ‘ఆలు’ శబ్దం పరమైతే ‘రు’ గాగమం వస్తుంది.
ఉదా: పేదరాలు = పేద + ఆలు
బీదరాలు = బీద + ఆలు
పేద మొదలైన పదాలకు ‘ఆలు’ పదం పరమైతే ‘రు’ ఆగమంగా వస్తుంది.
దీన్నే రుగాగమం అంట.
అపుడు…….
పేద + ర్ + ఆలు = పేదరాలు
బీద + ర్ + ఆలు = బీదరాలు
మరికొన్ని ఉదాహరణలు:
ముద్ద + ఆలు =ముద్దరాలు నందు
బాలెంత + ఆలు = బాలెంతరాలు
అయిదవ + ఆలు = అయిదవరాలు
2వ సూత్రం: కర్మధారయంబు సందత్సమంబులకాలు శబ్దము పరంబగునపుడు డత్వంబునకుత్వంబు రుగాగమంబును అగు. ధీర, గుణవంత, ధనవంత, సంపన్న గంభీర, ధైర్యవంత – ఇలాంటి పదాలు “తత్సమ పదాలు” అంటారు. తత్సమ పదాలకు ‘ఆలు’ పదం పరమైతే ఆ తత్సమ పదాలకు చివరన్న అకారం అవుతుంది. ఆర్” ఆగమంగా వస్తుంది.
ఉదా.
ధీర + ఆలు = ధీరు + ర్ + ఆలు = ధీరురాలు
గుణవంతు + ర్ + ఆలు = గుణవంతురాలు
నాయక + ఆలు = నాయకురాలు
10. నుగాగమ సంధి:-
1వ సూత్రం: ఉదంతమగు తద్ధర్మార్ధక విశేషణానికి అచ్చు పరమైతే నుగాగమం వస్తుంది.
(ఎగురు, పల్కు, ఉండు, చేయు, వచ్చు)
ఉదా. చేయి + అతడు = చేయునతడు
భక్త + ఆలు = భక్తురాలు
వచ్చు + ఒక = వచ్చునొక
2వ సూత్రం: షష్ఠీ తత్పురుష సమాసంలో ఉకార, ఋకారాలకు అచ్చుపరమైతే నుగాగమం!
వస్తుంది.
ఉదా. రాజు + ఆజ్ఞ = రాజునాష్ట్ర
3వ సూత్రం:
ఉదా: తళుకు + గజ్జెలు- తళుకుఁగజ్జెలు
విధాతృ + ఆనతి = విధాతృనానతి
తళుకునజ్జెలు = తళుకుంగజ్జెలు
1. ఉత్తు చివరగల స్త్రీ సమాలు అయినందు వలన నుగాగమం వచ్చింది.
ఆ) ఉన్నతంపు + గొడుగు- ఉన్నతంపు గొడుగు
ఉన్నంతపునొడుగు
ఉన్నంతపుంగొడుగు
2. పుంపులకు సరళాలు, పరుషాలు పరమైతే ‘ను’
ఇ) సరసము + తనము = సరసపున్దనము =
తెల్ల + తనము = : తెల్లన్దనము
కు లోపం కాని, సంశ్లేషగాని జరుగుతుంది.
3. ఉదంత స్త్రీసమాలకు, పుంపులకు అచ్చు అంతంగా ఉండే గుణవాచక (తెల్ల, పచ్చ మొదలగు) శబ్దాలకు ‘తనము’ పరమైతే నుగాగమం వస్తుంది.
11. దుగాగమ సంధి: –
సూత్రం: నీ, నా, తన శబ్దాలకు ఉత్తరపదం పరమైనప్పుడు దుగాగమం విభాషగా వస్తుంది.
ఉదా: నా + విభుడు = నాదు విభుడు
నీ + భవనం = నీదుభవనం
తన + ప్రాణేశుడు = తనదు ప్రాణేశుడు
గమనిక: పై ఉదాహరణల్లో ‘దు’ ఆగమంగా వచ్చింది కనుక దీనిని దుగాగమ సంధి అంటారు.
ఇలాంటి రూపాలు ఇప్పుడు మనం రాస్తున్న భాషలో లేవు. ఇవి కావ్యాలలో కన్పించే రూపాలు.
4వ సూత్రం: క్రిత్తాది శబ్దాల తొలి అచ్చుమీది వర్ణాలకు లోపమూ మీది హల్లుకు ద్విరుక్తా వస్తుంది.
ఉదా:
క్రొత్త + కారు = తొక్కారు
నిండు + వెఱ = నివ్వెలు
అన్ని నాళ్ళు = అన్నాళ్ళు
నెఱు + మది = నెమ్మది
క్రొత్త ,చేద శబ్దాలకు తొలి అచ్చుమీది వర్ణాలకు కొన్ని చోట్ల అనునాసికంఆదేశమవుతు .
ఉదా:
క్రొత్త + చాయ = క్రొంజాయ
చేద + తాడు = చేంతాడు
5వ సూత్రం: మూడు శబ్దం మీద హల్లు పరమైతే తొలి అచ్చుమీది వర్ణాలకు లోపమూ, తొలి అచ్చు
హ్రస్వం కావడమూ, తరువాత హల్లు ద్విరుక్తం కావడమూ జరుగుతుంది.
ఉదా: మూడు + మారు =ముమ్మారు
మూడు + పాతిక = ముప్పాతిక
మూడు + లోకాలు = ముల్లోకాలు
గమనిక: నాళ్ళు (నాడులు) పరమైనప్పుడు మూడు శబ్దంలో దీర్ఘం హ్రస్వం కాదు.
ఉదా: మూడు + నాళ్ళు మూన్నాళ్ళు,
మూణాళ్ళు
15. ఆమ్రేడిత సంధి:
1వ సూత్రం: అచ్చున కామ్రేడితం పరంబగునప్పుడు సంధియగు.
ఉదా: పగలు + పగలు = పట్టపగలు
కడ + కడ = కట్టకడ
ఎదురు + ఎదురు = ఎట్టయెదురు
బయలు + బయలు = బట్టబయలు
కొన + కొన = కొట్టకొన
చివర + చివర = చిట్టచివర
తుద + తుద = తుట్టతుద.
పిడుగు + పిడుగు = పిట్టపిడుగు
మంట ఒక్క + ఒక్క = ఒక్కొక్క
ఏమి + ఏమి = ఏమేమి +
ఓరి + ఓరి = ఓరోరి
ఎన్ని + ఎన్ని = ఎన్నెన్ని
2వ సూత్రం : ఆమ్రేడితం పరమగునప్పుడు కడాదుల తొలి అచ్చుమీది వర్ణాలకెల్లా అందంతమగు
ద్విరుక్తమగు ద్విరుక్తటకారం వస్తుంది.
లు, ల, నలసంథి : లు, ల, న లు పరమైనపుడు ఒక్కొక్కపుడు ‘ము’ వర్గానికి లోపమూ,
దాని పూర్వ స్వరానికి దీర్ఘమూ వస్తాయి.
ఉదా: పుస్తకము + లు = పుస్తకాలు
జీవితము + న = జీవితాన
దేశము + ల = దేశాల
వృక్షము + న = వృక్షాన
16. త్రిక సంథి : ఆ, ఈ, ఏ లను త్రికం అంటారు. అవి దీర్ఘాచ్చులు. ఆ, ఈ, ఏ లలో పూర్వ పదంగా ఉంటుంది. దాని మీద చేరే పదం హల్లుతో మొదలవుతుంది. సంధి జరిగినప్పుడు ఆ, ఈ, ఏ లు హ్రస్వాలు అవుతాయి. వాటి తరువాత వచ్చిన హల్లు ద్విరుక్తమవుతుంది.
1వ సూత్రం: ఆ, ఈ, ఏ అను సర్వనామాలు త్రికంబునాబడు
ఉదా: అమ్మేఘచయంబులు
ఇమ్మహోగ్ర సలిలంబు = ఈ + మహోగ్ర సలిలంబు = ఇ + మ్మహోగ్ర సలి లంబు = ఇమ్మహోగ్ర సలిలంబు ఆ + వారల అవ్వారల.