ఈ వాక్యములో సామాన్య, సంక్లిష్ట, సంయుక్త అని మూడు విధములు

వాక్యాలు – బేధాలు

1. సామాన్య వాక్యము (10th – 23) 

ఒక సమాపక క్రియతో సంపూర్ణ అర్ధమునిచ్చు వాక్యమును సామాన్య వాక్యము అంటారు. 

ఉదా, శకుంతల దుష్యంతుని చూచెను.

శ్రీశ్రీ మహా ప్రస్థానము రచించాడు. 

సామాన్య వాక్యం రెండు రకాలుగా ఉంది. 

అవి: 

క్రియా సహిత వాక్యం

క్రియా రహిత వాక్యం 

* క్రియా సహిత వాక్యం:

(అ). క్రియా సహిత వాక్యాన్ని రెండు భాగాలుగా చేస్తారు. అందులో ఉద్దేశ్యం(నామం), ఆఖ్యాతం అనేవి ఉంటాయి. దీనికి మరో పేరు క్రియాఖ్యానం.

కర్త స్థానంలో నామవాచకం / సర్వనామం ఉంటుంది. 

ఆ విభాగాన్ని నామం(ఉద్దేశం) అనవచ్చు. వాక్యంలో కర్మ ఉంటే క్రియతో పాటు కర్మ కూడా ఆఖ్యాతంలో భాగం అవుతుంది. 

ఉదా: ఉద్దేశం (నామం)+ ఆఖ్యాతం

రాము అన్నం తిన్నాడు. 

* చెట్టు పెరిగింది. 

ఈ వాక్యంలో ఆఖ్యాతం – పెరిగింది.

పై ఉదాహరణల్లో కర్త, స్థానంలో నామం, 

కర్మస్థానంలో ఆఖ్యాతం చెప్పబడింది.

(ఆ). వాక్యంలో పదాలు కర్త-కర్మ- క్రియ క్రమంలో ఉంటాయి. అయితే ‘కర్మ’ అనేది వాక్యంలో అది ముఖ్య కర్మ -అముఖ్యకర్మగా కూడా వాడటం జరుగుతుంది. వాక్యంలో ఆ ముఖ్య కర్మ ఉంటే ఆ కర్మ తరువాత ముఖ్య కర్మకు ముందు ఉంటుంది.

ఉదా: –

కర్త – అముఖ్య కర్మ-కర్మ – క్రియ 

కమల విమలకు పుస్తకం ఇచ్చింది. 

(@). వాక్యంలో కాలవాచకాలు, స్థలవాచకాలు, కర్తపదానికి ముందుగానే సర్వ సాధారణంగా వస్తాయి 

ఉదా. నిన్న విజయవాడలో రాజు రవికి నగలు ఇచ్చాడు.

 నిన్న కాలవాచకం

విజయవాడ స్థలవాచకం

రాజు.   – కర్త 

రవికి -అముఖ్య కర్మ ( ఎవరికి, దేనిని) 

నగలు – కర్మ

ఇచ్చాడు – క్రియ

* క్రియా సహిత వాక్యాలు క్రింది విధంగా కూడా ఉంటాయి 1. విధ్యర్థకం : 

ఆజ్ఞ మొదలైన అర్ధాలు వస్తాయి.

ఇది మధ్యమ పురుషలో మాత్రమే ఉంటుంది. 

ఉదా: మీరు పాఠం చదవండి. 

వెళ్ళు – వెళ్ళండి

 చేయి – చేయండి 

చదువు -చదవండి

2 అనుమత్యర్థం : ఒప్పుకోవటాన్ని సూచించే క్రియ.

 ఉదా: ఇక నీవు దయచేయవచ్చు. 

చేయవచ్చు వెళ్ళవచ్చు

తినవచ్చు చయనిచ్చు 

వెళ్ళవచ్చు తిననిచ్చు

3. సంభావనార్థకం :

ఊహను సూచించే క్రియ. ఒక పని జరిగితే జరగవచ్చనే ఊహను కూడా సూచిస్తాయి. ఉదా. రేపు పరీక్ష జరగవచ్చు. 4. నిశ్చయార్థకం : తప్పని సరి అని అర్థాన్నిచ్చే క్రియ.

ఉదా: నీవు ఫస్టుక్లాసులో పరీక్ష పాసవ్యాలి చేయాలి వినాలి

వెళ్ళాలి ,చదవాలి.

5. సామర్థార్థకం: ఒక పనిని చేసే శక్తి ఉందని చెప్పడం

ఉదా: ఆమె బాగా వంట చేయగలదు. 

ఆమె బాగా వంట చేయగలదు. 

వెళ్ళగలడు -రాయగలరు-నడవగలదు

చదవగలవు-తినగలవు-పాడగలము

6. సందేహార్ధకం : అనుమానాన్ని కలిగిస్తుంది.

 ఉదా:- ఆమె ఎందుకు నవ్వుతుందో

వాడు బడికి వస్తాడో రాడో, 

7. నిషేదార్థకం : వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది.

 (పనిని నిషేదిస్తుంది). 

ఉదా:- పంటలు పండలేదు.

రసాభాస చేయకండి..

 2.క్రియారహిత వాక్యాలు: 

* క్రియలేని వాక్యాన్ని క్రియారహిత వాక్యం అంటారు.

 * తెలుగు భాషకున్న ప్రత్యేక వాక్యం – క్రియారహిత వాక్యం.

 * క్రియారహిత వాక్యానికి గల మరియొకపేరు – నామాఖ్యానం.”

* క్రియారహిత వాక్యంలో ఒకే పదార్ధాన్ని బోధించే రెండు మాటలు ఉంటాయి. అందులో మొదటిది ఉద్దేశ్యం, రెండవది విధేయం.

* క్రియారహిత వాక్యంలో విధేయంలో ఉండే నామాలకు, లింగాలకు సంబంధించిన వచనాలకు, సంబంధించిన ప్రత్యయాలు చేరతాయి. విశేషణాలు కూడా విధేయంలోనే చేరతాయి.

ఉదా:

 ఉద్దేశ్యం         విధేయం

 ఆమె          టీచరు

 అది             చెట్టు 

వాళ్ళు.          మంచివాళ్ళు

  మేము          విద్యార్ధులం 

ఆయన            డాక్టరు 

 2. సంక్లిష్ట వాక్యము :-

* సంక్లిష్టం అంటే కూరుకొనిన అని అర్ధం.

. ప్రధాన వాక్యం ఉపవాక్యం కూడుకొని ఉంటాయి కనుక ఇది సంక్లిష్టవాక్యం.

* ఒక సమాపక క్రియ, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలు గల వాక్యాన్ని సంక్లిష్ట వాక్యం అంటారు.

* సంక్లిష్ట వాక్యంలో ఉపవాక్యాలు ఎనైనా ఉండవచ్చు.

* సంక్లిష్ట వాక్యంలో ఉపవాక్యంలోని క్రియలు ప్రధాన వాక్యంలోని సమాపక క్రియ సూచించే పని కంటే ముందు జరిగిన పనులను తెలియజేస్తాయి.

* అనేక అసమాపక క్రియలతో కూడి ఉండి ఒకే సమాపక క్రియకలిగిన వాక్యం సంక్లిష్ట వాక్యం 

సామాన్య వాక్యాలు.   — సంక్లిష్ట వాక్యాలు

i .తాత భారతం చదివాడు. తాత నిద్రపోయాడు.(సా.వా)

 తాత భారతం చదివి, నిద్రపోయాడు. (సం.వా)

ii. రాజు అన్నం తిన్నాడు.రాజు బడికి వెళ్ళాడు. రాజు చదువుకున్నాడు. రాజు ఇంటికి వచ్చాడు.

రాజు అన్నం తిని, బడికి వెళ్ళి, చదువుకొని ఇంటికి వచ్చాడు. 

ii. రైలు వచ్చింది.చుట్టాలు రాలేదు.

రైలు వచ్చినా చుట్టాలు రాలేదు.

 iv. రజియా నవ్వుతున్నది. రజియా మాట్లాడుతున్నది.

రజియా నవ్వుతూ, మాట్లాడుతున్నది.

v. రవి ఊరికి వెళ్ళాడు.రవి మామిడిపండ్లు తెచ్చాడు.

 రవి ఊరికి వెళ్ళి, మామిడిపండ్లు తెచ్చాడు. 

vi. విమల వంట చేస్తున్నది. విమల పాటలు వింటున్నది.

 విమల వంట చేస్తూ పాటలు వింటున్నది.

vi. పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు. పర్షియన్ భాషను చదివాడు. ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు.

పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరి పర్షియన్భాషను చదివి, పట్టభద్రుడయ్యాడు. 

vil) బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారుచేశాడు. బూర్గుల సామ్యవాద వ్యవస్థకు పునాది వేశాడు. అజరామర కీర్తిని పొందాడు. 

బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవాడిదే భూమి హక్కు నిచ్చి, కౌలుదారి చట్టాన్ని తయారు చేసి, సామ్యవాద వ్యవస్థ కు పునాది వేసి, అజరామర కీర్తిని పొందాడు.

ix. మామయ్య ఇంటికి వచ్చాడు, మామయ్య కాఫీ తాగాడు,

మామయ్య ఇంటికి వచ్చి కాఫీ తాగాడు. 

x. శత్రువులు భయపడ్డారు. శత్రువులు పారిపోయారు.

 శత్రువులు భయపడి పారిపోయారు.

గమనిక: సామాన్య వాక్యాలు సంక్లిష్ట వాక్యాలుగా మారేటప్పడు ఉపవాక్యాలలో సమాపక క్రియలు అసమాపక క్రియలుగా మారతాయి. సరూప నామం లోపం జరిగి ఒక నామ పదం మాత్రమే మిగులుతుంది.

సంక్లిష్ట వాక్యాలు – హేత్వర్ధక వాక్యాలుగా పని చేయుట.

సంక్లిష్ట వాక్యంలో ఉండే భూతకాల అసమాపకక్రియ ప్రధాన క్రియను సూచించే పనిని, కారణాన్ని సూచిస్తుంది. అలాంటి దాన్ని హేత్వర్ధకం అంటారు.

 హేతువు అంటే కారణం. 

ఉదా: అద్దం క్రింద పడి పగిలి పోయింది.

అద్దం పగిలి పోవడానికి హేతువు క్రింద పడటం

వానలు కురిసి పంటలు బాగా పండాయి.

తుఫాను వచ్చి పంటలు దెబ్బతిన్నాయి.

3. సంయుక్త వాక్యాలు:-

సమప్రాధాన్యం గల వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే ‘సంయుక్త’ వాక్యం అంటారు. సంయుక్త వాక్యంలో అన్నీ సమప్రాధాన్యం గల వాక్యాలే ఉంటాయి. సామాన్య వాక్యాలు సంయుక్త వాక్యాలు

1. విమల తెలివైనది. విమల అందమైనది. 

విమల అందమైనది, తెలివైనది.

 2. శాంత  అక్క, సీత చెల్లెలు. 

శాంతా, సీత అక్కా చెల్లెళ్ళు.

3. ఆయన ప్రొఫెసర్? ఆయన డాక్టరా? 

 ఆయన ప్రొఫెసరా? డాక్టరా? 

4. ఆయన పెద్దవాడు, ఈయన పెద్దవాడు 

ఆయనా ఈయనా పెద్దవారు.

5. రవి కవిత్వం రాస్తాడు. రవి కథలు రాస్తాడు 

 రవి కవిత్వమూ, కథలూ రాస్తాడు.

 6. రవి వచ్చాడు. గోపీ వచ్చాడు. రాజు వచ్చాడు 

  రవి, గోపి మరియు రాజులు వచ్చారు. 

7. కమల సంగీతం నేర్చుకుంది. కమల నృత్యం నేర్చుకుంది.

   కమల సంగీతం, నృత్యం నేర్చుకుంది.

8. సరళ ఇంటికి వెళ్ళింది ,సంపత్ బజారుకి వెళ్ళారు.

సరళ ఇంటికి, సంపత్ బజారుకి వెళ్ళాడు. 

9. కమల పొడుగు, విమల పొడుగు. 

కమల, విమల పొడుగు. 

10. వీరు పొమ్మనువారు కారు. వీరు పొగబెట్టి వారు.

వీరు పొమ్మను వారు కారు, పొగబెట్టువారు.

 11. వనజ చురుకైనది, వనజ అందమైనది. 

 వనజ చురుకైనది, అందమైనది

. 12. దివ్య అక్క, శైలజ చెల్లెలు. 

దివ్య, శైలజ అక్కాచెల్లెళ్ళు

 13. వారు గొప్పవారు. వారు తెలివైనవారు. 

వారు గొప్పవారు, తెలివైనవారు. 

14. సుధ మాట్లాడదు. సుధ చేసి చూసిస్తుంది. 

సుధ మాట్లాడదు కాని చేసి చూపిస్తుం 

15. మేము రాము. మేము చెప్పలేము. 

మేము రాము మరియు చెప్పలేము. 

16. రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు. ‘

రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. 

17. వర్షాలు కురిసాయి. పంటలు బాగా పండాయి

వర్షాలు కురిసాయి కావున పంటలు బాగా పండాయి. .

18.స్వప్న అన్నం తిన్నది. పద్మ పండ్లు తిన్నది –

స్వప్న అన్నం, పద్మ పండ్లు తిన్నారు. 

19. జయ ఇంటికి వెళ్ళింది. జయ ఇంటికి, విజయ బడికి వెళ్ళారు

20. ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా?

ఆజాద్ డేవిడ్ కంటే చిన్నవాడా? 

ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా? చిన్నవాడా

21. సీత నిశ్చితార్థం జరిగింది.నాగయ్య సంబరపడ్డాడు.

సీత నిశ్చితార్ధం జరిగింది కాబట్టి నాగయ్య సంబరపడ్డాడు.

గమనిక: కాని, మరియు, కాబట్టి వంటి అను సంధాన పదాలతో వాక్యాలను 

జోడించి సంయు వాక్యాలను నిర్మించవచ్చు.