1). అవగాహన – ప్రతిస్పందన ప
అ). కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, రాయండి.

  1. శాలువా కప్పినప్పుడు కవికి ఎవరెవరు గుర్తుకు వచ్చారు? చెప్పండి.
    జ). శాలువా కప్పినప్పుడు కవికి ఒంటినిండా బట్ట లేని వాళ్ళ జేజమ్మ మసకరూపం గుర్తుకువచ్చింది. ఆమె
    రూపం గుర్తుకు వచ్చినప్పుడల్లా తన గుండెల్ని కోస్తున్నట్లుగా కవిగారికి ఎంతో బాధగా అనిపిస్తుంటుంది.
  2. సన్మానం పొందుతున్నప్పుడు కవికి తన తాత రూపం ఎలా కనిపించింది?
    జ). సన్మానం పొందుతున్నప్పుడు కవికి తన తాత రూపం ఊరి పొలిమేర దగ్గరే నిలబడ్డట్లుగా కనిపించింది.
  3. ఆత్మకథ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
    జ). ఆత్మకథ పాఠ్యభాగ రచయిత డా!!.ఎండ్లూరి సుధాకర్‌. ఈయన 1959వ సంవత్సరంలో ప్రకాశం జిల్లా
    రావికుంటపల్లెలో పుట్టారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో
    ఆచార్యునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. వర్తమానం, మల్లమొగ్గల గొడుగు, కొత్త గబ్బిలం, వర్గీకరణీయం,
    నల్లద్రాక్షపందిరి, ఆటాజనిగాంచె, జాషువా సాహిత్యం పై విశ్లేషణ వీరి రచనలు. కవిరత్న, నవయుగ వచన కవితా
    చక్రవర్తి అనేవి వీరి బిరుదులు.
    ఆ). కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
    అమెరికాలోని శ్వేత జాతీయులు నల్లవారిపై చూపే జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు
    మార్టిన్‌ లూథర్‌ కింగ్‌. = 35 ఏళ్ళకే నోబెల్‌ శాంతి బహుమానం పొందాడు.
    (ర్రప్రశ్నలు :
  4. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ భవిష్యత్తును గురించి ఏం కలకన్నాడు?
    జ). అన్యాయం, అణచివేతలతో ఎడారి అయిన మిసిసిపి రాష్ట్రం స్వేచ్చ, న్యాయాల ఒయాసిస్సులను పొందే రోజు
    వస్తుందని మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ భవిష్యత్తును గురించి కలకన్నాడు.
  5. ఉద్యమాల ద్వారా అతను సాధించిన విజయాలేమిటి?
    జ). పౌర హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడిగా ప్రపంచం చేత గుర్తించబడ్డాడు. నల్ల జాతి ప్రజలను నడిపించిన
    శక్తిగా కీర్తి పొంది, 35 ఏళ్లకే నోబెల్‌ శాంతి బహుమానం పొందాడు.
  6. పై పేరాలో ‘కల’ అని అర్థాన్నిచ్చే పదం ఏది?
    జ). పై పేరాలో స స్వప్నం అనే* పదం కల అనే అర్ధాన్ని ఇస్తుంది.
  7. ఆకలింపు చేసుకోవడం అంటే? (ఆ)
    అ). ఆవలించడం అ). అర్ధం చేసుకోవడం ఇ). పోరాడడం
  8. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
    జ). మార్చిన్‌ లూథర్‌ కింగ్‌ ఎప్పుడు, ఎక్కడ జన్మించాడు?
    ఇ). కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

20వ శతాబ్దం సే స్వేచ్చా స్వాతంత్ర్య ఉద్యమాలకు ఆలవాలం..4444444444444** నాగప్పగారి సుందర్రాజు,
కొలకలూరి స్వరూపరాణి, చల్లపల్లి స్వరూహహీణే, జాజుల గౌరి, వినోదిని మొదలైన వారు దళిత కథా సాహిత్యాన్ని
పరిపుష్టం చేశారు.
(ర్రప్రశ్నలు :

  1. ప్రజల హక్కుల కోసం కవులు ఏమి చేస్తారు?

జ). ప్రజల హక్కుల కోసం కవులు వ్యథార్థ జీవుల గాథలకు పట్టం కడుతూ రచనలు చేయడం మొదలెట్టారు.

  1. రాయలసీమ ప్రాంతంలో దళిత జీవితాన్ని చిత్రించిన కథకులు ఎవరు?
    జ). శాంతి నారాయణ, చిలుకూరి దేవపుత్ర
  2. ప్రాత స్మరణీయుడు అంటే అర్ధం ఏమిటి?
    జ). వేకువజామునే తలుచుకోదగిన మహనీయుడు అని అర్థం.
  3. పై పేరా చదివి రచయిత్రుల పేర్లు రాయండి.
    జ). కొలకలూరి స్వరూపరాణి, చల్లపల్లి స్వరూపరాణి, జాజుల గౌరి, వినోదిని
  4. పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
    జ). “ఊరబావి” కథను ఎవరు రాశారు?

11). వ్యక్తీకరణ – సృజనాత్మకత :
అ). కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానం రాయండి.

  1. కాలం నా పాదాలకు నమస్కరిస్తుంది అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
    జ). కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులను బట్టి అది తన రూపురేఖలను మార్చుకుంటూ ఉంటుంది.
    గడిచిన కాలంలో కవి గారి పూర్వీకులంతా కుల పరంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. అదే కులంలో పుట్టి
    బాగా చదువుకుని, ఆచార్యునిగా, గొప్ప కవిగా, మేధావిగా ఎదిగిన కవిగారిని అదే సమాజం గౌరవిస్తూ, సత్కారాలు
    చేస్తుంది. అంటే సమాజం కులాన్ని బట్టి విలువ ఇచ్చే స్థా స్తాయి నుండి చదువును, గుణాన్ని బట్టి విలువ ఇచ్చే
    స్లాయికి అభివృద్ధి చెందిందని కవిగారి ఉద్దేశం అయి ఉండవచ్చు.
    చ. కవి నేడు సమాజంతో సత్కారం పొందడానికి తో, ‘డృడిన అంశాలేమిటి?
    జ). కవి గారు ఎన్నో కష్టాలకో ర్చి, స్వయంకృషితో చదివి, వీధిబడి నుండి విశ్వవిద్యాలయంలో ఆచార్యుని
    స్థాయికి చేరుకున్నారు. ఎందరో విద్యార్థులకు విద్యాదానం చేశారు. తన ప్రతిభ, పాండిత్యాలు, వాక్చాతుర్యంతో
    సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యక్తిగా, మానవతా శక్తిగా తనను తాను నిరూపించుకున్నారు. కవిగా
    తన రచనలతో సమాజాన్ని సంస్కరించే ప్రయత్నం చేశారు. ఈ అంశాలే కవి నేడు సమాజంతో సత్కారం పొందడానికి
    తో డృడ్డాయి.
  2. కవి తన పూర్వీకులు ఎదుర్కొన్న సవాళ్ళ గురించి ఏమి ఆలోచిస్తాడో(ఆలోచించాదో) రాయండి.
    జ). కవి గారికి సన్మానం జరుగుతున్న సమయంలో ఆయనకు తన పూర్వీకులు ఎదుర్కొన్న సవాళ్లు
    గుర్తుకు వచ్చాయి. తనను వేదికపై కూర్చోబెట్టినప్పుడు ఊరి చివర నిలబడ్డ తన తాత మొహం గుర్తుకొచ్చింది.
    తనకు శాలువా కప్పుతున్నప్పుడు ఒంటినిండా బట్టలు లేని తన జేజమ్మ రూపం గుర్తుకొచ్చింది. తనకు పట్టు
    బట్టలు బహుకరిస్తున్నప్పుడు చిరిగిపోయిన ముతక పంచెలు కట్టుకున్న తన తాత రూపం గుర్తుకొచ్చింది. అందరూ
    తనకు నమస్కరిస్తుంటే చెప్పులు కూడా లేని తన తాతల కాళ్లు గుర్తుకొచ్చాయి.
  3. ‘ఆత్మకథ’ పాఠ్యభాగ నేపథ్యం రాయండి.
    జ). వ్యక్తి తన స్వతంత్వానికి భంగం కలిగితే సహించడు. తన హక్కులను అణచివేయాలని ప్రయత్నిస్తే
    తిరగబడతాడు. తనకు సాటి మనుషుల మధ్య గుర్తింపును కోరుకుంటాడు. సమాజంలో ఉన్న కొన్ని నిరంకుశ
    భావాలు, కట్టుబాట్లు మనిషి స్వేచ్చకు సంకెళ్లు వేస్తాయి. అతడు వాటిని తెంచుకొని తనలో ఉన్న సృజనాత్మక శక్తిని
    ప్రపంచానికి చాటుకుంటాడు. జీవితంలో ఎదురైన సమస్యలకు కృంగిపోక ఎదురు నిలిచి ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా
    జ్ఞాన శిఖరాలు అధిరోహించిన ఒకానొక కవి జీవితమే ఆత్మకథ పాఠ్యభాగ నేపథ్యం.
    రి. ఆత్మకథ పాఠం ఆధారంగా ‘వచన కవిత’ ప్రక్రియను గురించి రాయండి.
    జ). పద్యాల్లో , గేయాల్లో ఉండే ఛందో నియమాలతో సంబంధం లేకుండా, వ్యావహారిక భాషలో లయాత్మకంగా
    సాగే కవితను వచన కవిత అంటారు. సరళమైన పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవిత వచన కవిత.
    రచయిత తాను చెప్పదలుచుకున్న భావాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడం వచన కవిత ప్రత్యేకత. శ్రీశ్రీ నుండి నేటి
    వరకు ఎందరో కవులు వచన కవితకు పట్టం కట్టారు.
    ఆ). కింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
  4. ఆత్మకథ పాఠ్యభాగంలో కవి వెలువరించిన బాధామయ జీవితాన్ని మీ మాటల్లో రాయండి.
    జ). కవిగారి ‘ఆత్మకథ’ గ్రంథం ఆవిష్కరించిన తరువాత ఆయనకు సన్మానం చేస్తున్నారు. ఈ సందర్భంలో
    ఆయనకు గతంలో తాను, తన పూర్వీకులు ఎదుర్కొన్న అవమానాలు గుర్తుకొస్తున్నాయి. తన తాతను
    అంటరానివాడిగా చూస్తూ, ఊరిలోనికి రానిచ్చేవారు కాదు. మంచినీళ్లు తాగాలంటే మోకాళ్ళపై వంగి, దోసిల్లతో
    తాగాల్సి వచ్చేది. తన జేజమ్మకు ఒంటి నిండా కట్టుకోవడానికి బట్టలు కూడా ఉండేవి కాదు.

తన తాత బట్టల్లేక చిరిగిన ముతక పంచెలే కట్టుకునేవాడు. తన తాతల కాళ్ళకు చెప్పులు ఉండేవి కాదు.
చిన్నప్పుడు తాను పశువుల పాకలో అన్నం తిన్నాడు. తన పూర్వీకులు చేయని తప్పులకు కూడా ఎన్నో కొరడా
దెబ్బలు తిన్నారు. వేదాలు వినకూడదని చెవుల్లో సీసం పోసేవారు. నిందలు మోపి శరీరంలోని అవయవాలు
కోసియడం వంటి భయంకర శిక్షలు విధించేవారు. ఈ విధంగా కవి తన, తన పూర్వీకుల బాధామయ జీవితాన్ని
గురించి చెప్పారు.

  1. కాలం నా ఆత్మకథను పాఠ్యగ్రంథంగా చదువుతుందని అనడంలో కవి ఆలోచనల గురించి రాయండి.
    జ). కవిగారి ‘ఆత్మకథ’ గ్రంథం ఆవిష్కరణ సందర్భంగా ఆయనకు సన్మానం జరుగుతుంది. ఆ సందర్భంలో
    ఆయనకు గతంలో తన తాతముత్తాతలు కులపరంగా ఎదుర్కొన్న అవమానాలు గుర్తుకొచ్చాయి. ఆ నాటి
    సమాజంలో కొన్ని కులాల వారిని ఎంతో హీనంగా చూస్తూ అవమానాలకు గురిచేసేవారు. అలా అవమానాలు

మౌనంగా భరించిన వారి కులంలో తరువాతి తరాలవారు కష్టపడి చదువుకుని నలుగురికీ ఆదర్శవంతంగా
నిలిచారు. అందరిచేత సన్మానం చేయించుకునే స్థాయికి ఎదిగారు. విద్య వారిలోని అంటరానితనాన్ని పోగొట్టింది.
ఒకప్పుడు కులపరంగా అవమానించిన సమాజం నేడు వారిని విద్యావంతులుగా ఎంతో గౌరవిస్తుంది.
ఇది కాలానుగుణంగా అభివృద్ధి చెందుతున్న సమాజంలో వచ్చిన మార్పుగా కవిగారు భావించారు. ఇదంతా విద్య
ద్వారానే సాధ్యమయ్యిందని నమ్మారు. అవమానాలను ధైర్యంగా ఎదురొ, ంని ఉన్నత స్థి స్థితికి చేరుకున్న తన జీవితమే
అందరికీ ఆదర్శవంతం కావాలని కవిగారు భావించారు. అందుకే ‘కాలం నా ఆత్మకథను పాఠ్యగ్రంథంగా
చదువుతుంద’ని కవిగారు అని ఉంటారు.

  1. తమ గురించి తాము చెప్పుకోవడమే ఆత్మకథ. ఏదైనా ఒక వస్తువు/ పక్షి/ జంతువును ఎంపిక చేసుకుని అవి
    తమ గురించి తాము ఏమేమి చెప్పుకుంటాయో ఊహించి ఆత్మకథలా రాయండి.
    జ). “నల్లబల్ల ఆత్మఘోష”
    హాయ్‌ పిల్లలూ..! నన్ను గుర్తుపట్టారా! నేను..నల్లబల్లను. నన్ను ఎక్కడో చూసినట్లు గుర్తుకొస్తుంది కదూ!
    గతంలో నేను పాఠశాలల్లోని ప్రతి తరగతి గదిలోనూ ఉండేదాన్ని. నన్ను ఆంగ్లంలో బ్లాక్‌ బోర్డ్‌ అంటారు. ఒకప్పుడు
    మీ తాతలకు, తండ్రులకు విద్యాబుద్ధులు నేర్పింది నేనే. మీకు చదువుచెప్పే ఉపాధ్యాయులకు చదువు నేర్పింది
    కూడా నేనే. నాపైన సుద్దముక్కలతో వ్రాసి ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించేవారు. నాపై వ్రాసిన
    వ్రాతను నేర్చుకుని ఎంతోమంది వారి తలరాతను ఉన్నతంగా మలచుకున్నారు. ఇదంతా గతం.
    ప్రస్తుతకాలంలో సాంకేతిక పరిజ్ఞానం పేరుతో వస్తున్న పెను మార్పుల ప్రభావం వల్ల నా ఉనికే
    ప్రశ్నార్ధకమయ్యింది. గత కొంతకాలంగా గ్రీన్‌ బోర్డులు, ఐ.ఎఫ్‌.పి ప్యానల్లు నా స్థానాన్ని ఆక్రమించాయి. కొత్తదనాన్ని
    స్వాగతించడం మంచిదే కానీ ఆ వంకతో పాతను. పూర్తిగా పాతిపెట్టడం మంచిదీ కాదు కదా! ఇక్కడ అందరూ ఒక్కటి
    గమనించాలి నేను మన్నినంత కాలం ఇవేవీ మన్నలేవు. ఇది మాత్రం వాస్తవం. నా చరిత్ర రాబోయే తరాలవారికి ఒక
    కథగానైనా చెప్పుకుంటారని ఆశపడుతున్నాను. నన్ను ఇంతకాలం ఆదరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు
    తెలుపుకుంటూ హృదయవేదనతో నిష్కమిస్తున్నాను. ఇక సెలవు.
  2. ‘మనుషులందరూ సమానమే’ అనే అంశంపై ఐదు నినాదాలు రాయండి.
    జ). మనమంతా మనుషులం – లేదు మన మధ్య అంతరం
    కులం వద్దు, మతం వద్దు న మానవత్వమే మనకు ముద్దు
    ఐకమత్యమే మన బలం – అదే మన ఆయుధం
    వైషమ్యాలు వదిలేద్దాం – సొదరుల్లా కలిసి జీవిద్దాం
    సంపదలు ఉన్నా, లేకున్నా – కలిసిమెలిసి జీవిద్దాం
    మమతను అందరికీ పంచుదాం – మనుషులమని చాటుదాం
    మనమధ్య ఎలాంటి స్పర్థలూ వద్దు = సమానత్వమే దానికి హద్దు
    111).భాషాంశాలు :
    1). పదజాలం :
    అ). కింద ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్ధం తెలుసుకొని సొంతమాటల్లో రాయండి.
  3. నాలుగు రోడ్ల చౌరస్తాలో జాతీయ జెండా ఎగురవేశారు.
    జ). చౌరస్తా = కూడలి
    *అమలాపురం గడియారస్తంభం కూడలిలో గాంధీ విగ్రహం ఉంది.
  4. ఊరి గుడిసె అగ్నికి అర్పణం అయ్యింది.
    జ). అర్పణం = సమర్పించడం/ఇవ్వడం
    *వేంకటేశ్వరస్వామికి భక్తులు విలువైన కానుకలు సమర్పించుకుంటారు.
  5. ఆ పిల్లలు తెలివితేటల్లో చురకత్తుల్లా ఉన్నారు.
    జ). చురకత్తులు = పదునైన కత్తులు
    *రాజులు యుద్ధాలు చేసేటప్పుడు పదునైన కత్తులు ఉపయోగించేవారు.
    ఆ). కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.
    1. స్వర్ణం = బంగారం, కనకం, పుత్తడి
    2 సూర్యుడు = రవి, భాస్కరుడు, భానుడు
  6. కళ్ళు = నయనాలు, నేత్రాలు
    4 దేహం = కాయం, మేను, శరీరం

ఇ). కింది పదాలకు నానార్దాలు రాయండి.
1.తల = శిరస్సు, చోటు

  1. కాలం = సమయం, మరణం
  2. క్రియ =పని, చర్య
    4.రామ =రాముడు,స్త్రీ
    ఈ). కింది ప్రకృతి పదాలకు వికృతులను జతపరచండి.
    1భోజనం ( సి) ఎ).కత
    2.బ్రద్న ( డి) బి).పువ్వు
  3. కథ (ఎ) సి). బోనము
    4.పుష్పం ( బి) డి). ప్రొద్దు
    11). వ్యాకరణాంశాలు :
  4. సంధులు :
  5. ఆమ్రేడిత సంధి :
    శ్రూఈ కింది ఉదాహరణలను పరిశీలించండి.
    బొరార = బర + బర
    ఓహోహో = ఓహో + ఓహో
    ఏమేమి = ఏమి + ఏమి
    శాసూత్రం – 1 : ఈ పదాలను విడదీసినప్పుడు పూర్వపదం, పరపదం రెండింటిలోనూ ఒకే పదం వస్తుంది. ఇలా
    రెండు ఒక విధమైన పదాలు వస్తే అందులో రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు.
    శూసూత్రం – 2 : ఆమ్రేడితం పరమైనప్పుడు విభక్తి లోపం బహుళంగా వస్తుంది.
    ఉదా : అప్పటికిన్‌ ఈఓ అప్పటికిన్‌ = అప్పటప్పటికిన్‌
    అక్కడన్‌ శ అక్కడన్‌ డె అక్కడక్కడన్‌
    అ). కింది పదాలు విడదీసి, సంధి పేరు తెలపండి.
  6. పావనమైనది = పావనము + ఐనది = ఉత్వసంధి
  7. ధర్మమొకటి = ధర్మము + ఒకటి = ఉత్వసంధి
    3౩. చిన్నప్పుడు = చిన్న + అప్పుడు = అత్వసంధి
  8. గుర్తుకొస్తుంది = ఈ పదం తప్పుగా ఇవ్వబడింది.
    సోోసమాసాలు :
    శూతత్పురుష సమాసం : ఉత్తర పద అర్ధం ప్రధానంగా కలది తత్పురుష సమాసం.
    ‘శూప్రధమా తత్పురుష సమాసం : ప్రథమా విభక్తి చివర కలిగిన పూర్వపదం, ఉత్తర పద అర్ధ ప్రాధాన్యత కలిగినది
    ప్రథమా తత్పురుష సమాసం. ప్రథమా విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (డు, ము, వు, లు)
    ఉదా: మధ్యాహ్నము ఆ అహ్నము మధ్య భాగము
    నడిరేయి – రేయి నడిమి భాగము
    శద్వితీయా తత్పురుష సమాసం : ద్వితీయా విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (నిన్‌, నున్‌, లన్‌, కూర్చి,
    గురించి)
    ఉదా: కృష్ణాశ్రితుడు – కృష్ణుని ఆశ్రయించినవాడు
    నెలతాల్పు – నెలను తాల్చినవాడు
    శతృతీయా తత్పురుష సమాసం : తృతీయా విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (చేతన్‌, చేన్‌, తోడన్‌, తోన్‌)
    ఉదా : వాక్కలహము – వాక్కు చేత కలహము
    విద్యాహీనుడు – విద్య చేత హీనుడు
    శూచతుర్ధీ తత్పురుష సమాసం : చతుర్ధీ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (కొరకున్‌, క్రై
    ఉదా : ధనాశ – ధనము కొరకు ఆశ
    పొట్టకూడు – పొట్ట కొరకు కూడు
    శూపంచమీ తత్పురుష సమాసం : పంచమీ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (వలనన్‌, కంటెన్‌, పట్టి)
    ఉదా : దొంగభయం – దొంగ వలన భయం
    పాప విముక్తుడు – పాపము వలన విముక్తుడు

షష్టీ తత్పురుష సమాసం : షష్టీ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (కిన్‌, కున్‌, యొక్క, లోన్‌, లోపలన్‌)
ఉదా : రాజపుత్రుడు – రాజు యొక్క పుత్రుడు
యజ్ఞపలం – యజ్ఞము యొక్క ఫలం
శాసప్తమీ తత్పురుష సమాసం : సప్తమీ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (అందున్‌, నన్‌)
ఉదా : నీతి పారగుడు – నీతి యందు పారగుడు
మాటనేర్పరి – మాట యందు నేర్పరి
ఆ). కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసాలను గుర్తించండి.

  1. మేలు వస్తాలు – మేలైన వస్తాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
    *వస్తాలు (నామవాచకం), మేలు (విశేషణం)
    ముతక పంచెలు – ముతకవైన పంచెలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
    కొత్త దేవుళ్ళు – కొత్తవారైన దేవుళ్ళు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
    వక్రధ్వనులు – వక్రమైన ధ్వనులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
    నాలుగు పంక్తులు – నాలుగు సంఖ్యగల పంక్తులు – ద్విగు సమాసం
    ష్ష్లఅలంకారాలు :
    అ). రూపకాలంకారం :
    (1)”మా అమ్మ చేతి వంట అమృతం”.
    పై వాక్యంలో అమ్మ చేతి వంట ఉపమేయం, అమృతం – ఉపమానం. అమ్మ చేతి వంటకు – అమృతానికి
    భేదం లేదని (అభేదం) చెప్పడం కనిపిస్తుంది.
    “నిర్వచనం : ఉపమేయ ఉపమానములకు భేదం లేదని చెప్పడాన్ని రూపకాలంకారం అని అంటారు.
    ఉదా : ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే!
    “సమన్వయం : ఇక్కడ మహారాజు ఉపమేయం, ఈశ్వరుడు ఉపమానం. ‘సాక్షాత్తు’ అనే పదం రాజుకు, ఈశ్వరునికి
    భేదం లేదు అని వర్ణించబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.
    (1)”నా కడుపులో అవమానాల చురకత్తులు గుచ్చుకుంటాయి”.
    అవమానాల చురకత్తులు – అవమానాలనెడి చురకత్తులు
    “సమన్వయం : అవమానం – ఉపమేయం, చురకత్తులు – ఉపమానం
    అవమానాలు – చురకత్తులకు భేదం లేదని వర్ణించబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.
    స్తోధందస్సు
    శ్రూకింది పద్య పాదాలకు గురు – లఘువులను గుర్తించండి. శార్దూల పద్య లక్షణాలను సమన్వయం చేయండి.
    ఉదా:౮ోలోీఆల |! 160 1౮0! !1అ0అఆ6౪6| ౪౦౪6! 6౪
    ఆనందం। బుననా! ర్థరాత్ర। ముల జం! ద్రాలోక| ముల్‌ కాయ! గా
    మ స జ స త త గ
  • ఈ పద్యపాదము శార్దూలము పద్యానికి చెందినది.
    శశార్దూలము పద్య లక్షణాలు :
    1.ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి
  1. ప్రతి పాదంలోనూ వరుసగా మ ,స,జ,స,త,త, గ అనే గణాలు వస్తాయి.
  2. ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి.
  3. ప్రతి పాదంలోను 1 – 13 అక్షరాలకు యతి కుదురుతుంది.
  4. ప్రాసనియమం ఉంటుంది.
    *సమన్వయం: పైన ఇచ్చిన పద్యపాదంలో……..
    1మ,స,జ,స,త, త, గ అనే గణాలు వరుసగా వచ్చాయి.
  5. పద్యపాదంలో 19 అక్షరాలు ఉన్నాయి.
  6. 1 – 13 అక్షరాలకు (ఆ – ద్రా) యతిస్థానము చెల్లింది. కాబట్టి ఈ పద్య పాదము శార్దూల వృత్తానికి
    చెందినదని చెప్పవచ్చు.

రాసిలుగు

౮౦౪౮౮౪౮ |16016! 1160 6ఆ౮౪| ౪౪|| ౮

  1. మాయామే [య జగం! బె నిత్య] మని సం] భావించి! మోహంబు]! నన్‌
    మ స జె స త త గ

*ఈ పద్యపాదము శార్దూలము పద్యానికి చెందినది.

*సమన్వయం: పైన ఇచ్చిన పద్యపాదంలో……..
1మ,స,జ,స,త, త, గ అనే గణాలు వరుసగా వచ్చాయి.

  1. పద్యపాదంలో 19 అక్షరాలు ఉన్నాయి.
  2. 1 – 13 అక్షరాలకు (మా – భా) యతిస్థానము చెల్లింది. కాబట్టి ఈ పద్య పాదము శార్దూల వృత్తానికి
    చెందినదని చెప్పవచ్చు.

౮౪౮౪ |!|!1ఆ౪౮ 1౪! 1!16ఆఅఆ౪ఆ|! ౪౮౦౪6! ౮౪

  1. బావా యె! ప్పుడు వ| చ్చితివు! సుఖులే| బ్రాతల్సు] తుల్‌ చుట్ట! ముల్‌
    మ స జ స త త గ

*ఈ పద్యపాదము శార్దూలము పద్యానికి చెందినది.
*సమన్వయం : పైన ఇచ్చిన పద్యపాదంలో……..
1మ,స,జ,స,త, త, గ అనే గణాలు వరుసగా వచ్చాయి.

  1. పద్యపాదంలో 19 అక్షరాలు ఉన్నాయి.
  2. 1 – 13 అక్షరాలకు (బా – బ్రా) యతిస్థానము చెల్లింది. కాబట్టి పైన ఇచ్చిన పద్య పాదము శార్దూల
    వృత్తానికి చెందినదని చెప్పవచ్చు.

అ౮౮౪౮ |! 10161 11౪06౪66౪6! ౪6౪6! ౦౪

  1. ప్రాకారం] బు గదా! ప్రహార| ముల ను] త్పాటించి] యంత్రంబు] లున్‌
    మ స జ స త త గ

*ఈ పద్యపాదము శార్దూలము పద్యానికి చెందినది.
*సమన్వయం : పైన ఇచ్చిన పద్యపాదంలో……..
1మ,స,జ,స,త, త, గ అనే గణాలు వరుసగా వచ్చాయి.

  1. పద్యపాదంలో 19 అక్షరాలు ఉన్నాయి.
  2. 1 – 13 అక్షరాలకు (ప్రా – తా) యతిస్థానము చెల్లింది. కాబట్టి ఈ పద్య పాదము శార్దూల వృత్తానికి
    చెందినదని చెప్పవచ్చు.

౮౪ 1౮1౮! [11060 అ6౪|౪౪| ౦౪

  1. కంటిన్‌ జా] నకి బూ] ర్లచంద్ర| వదనన్‌! గల్యాణి! నాలంక| లో
    మ స జ స త తగ

*ఈ పద్యపాదము శార్దూలము పద్యానికి చెందినది.
*సమన్వయం : పైన ఇచ్చిన పద్యపాదంలో……..
1మ,స,జ,స,త, త, గ అనే గణాలు వరుసగా వచ్చాయి.

  1. పద్యపాదంలో 19 అక్షరాలు ఉన్నాయి.
  2. 1 – 13 అక్షరాలకు (క – గ) యతిస్థానము చెల్లింది. కాబట్టి ఈ పద్య పాదము శార్దూల వృత్తానికి
    చెందినదని చెప్పవచ్చు.
    శాల