1. అమ్మ ఒడి
కవి : బి.వి నరసింహారావు
బాడిగ వెంకట నరసింహారావు కవి (15.8.1913 – 6.1.1994)
కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు.
‘బాలరసాలు’, ‘పాలబడి పాటలు, “ఆవు-హరిశ్చంద్ర’, ‘బాల తనం’, ‘చిన్నారి లోకం’, ‘పూలబాలలు ఋతువాణి’ వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు.
‘బాలబంధు’గా ప్రసిద్ధులు,
బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బి.వి.నరసింహారావుపెట్టుకున్నారు.
వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన ‘అనార్కలి’ నాటకంలో అనార్కలి పాత్ర ధరించి, ‘అనార్కలి నరసింహారావు గా ఖ్యాతి గడించారు.
ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బి.వి. నరసింహారావు సంపూర్ణ రచనలు రెండవ సంకలనం లోనిది
2. తృప్తి
కవి :
సత్యం శంకరమంచి (3.3.1937 – 21.5.1987)
గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు.
‘అమరావతి కథలు’, ‘కార్తీక దీపాలు’ కథా సంపుటాలు, ‘రేపటి దారి’, ‘సీత స్వగతాలు’, ‘ఆఖరి ప్రేమలేఖ’, ‘ఎడారిలో కలువపూలు’ మొదలైన నవలలు, హరహర మహాదేవ నాటకం, దిన, వార పత్రికలలో అనేక వ్యాసాలు రాశారు.
1979లో “అమరావతి కథల’కు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.
ఈ పాఠం సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలు లోనిది.
పాత్ర : పూర్ణయ్య / బావగాడు
“లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోంది”
“సుబ్బయ్యన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం? రెండు ఆకులు కలిపి వేయించు” – పూర్ణయ్య
అక్షరాలు
వజ్రము= వ్ + ఆ+జ్ + ర్ + అ +మ్ + ఉ
కార్యము = క్ + ఆ + ర్ + య్ + అ + మ్ + ఉ
కుచెలోపాఖ్యానం
కుచేలుడు శ్రీ కృష్ణదగ్గరకి తీస్కొని వెళ్ళింది – అటుకులు
3. మాకోధ్ధితెల్లదొర తనము
కవి : గరిమెళ్ళ సత్యనారాయణ
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధులు, 1921లో ‘స్వరాజ్య గీతములు’, 1923లో హరిజనుల పాటలు’, 1926లో ఖండ కావ్యాలు, భక్తి గీతాలు, బాల గీతాలు రాశారు.
‘దండాలు దండాలు భారతమాత’, ‘మాకొద్దీ తెల్లదొరతనము’ అనే గేయాలతో సామాన్య ప్రజల్లో
సైతం స్వాతంత్ర్య ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి.
దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ల,
వర్ణమాల
అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఇ, (లు, లు) ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ = (16) అచ్చులు.
క, ఖ, గ, ఘ, జ, చ, చ, ఛ, జ, జ, ఝ,ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప,
ఫ, బ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ = (37) హల్లులు.
0 (సున్న), c (అరసున్న), A (విసర్గ) = (3) ఉభయాక్షరాలు
అచ్చులు – విభాగం
ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు – అ, ఇ, ఉ, ఋ, (లు), ఎ, ఒ – హ్రస్వాలు.
రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు – ఆ, ఈ, ఊ, ఋ,(లూ), ఏ, ఐ, ఓ, – దీర్ఘాలు.
హల్లులు – విభాగం
‘క’ నుండి ‘మ’ వరకు గల అక్షరాలను అయిదు వర్గాలుగా విభజించవచ్చు
క -ఖ – గ – ఘ – జ్ఞ. – ‘క’ వర్గం
చ – ఛ – జ – ఝ – ఇ‌్. – చ వర్గం
ట – ఠ- డ-ఢ-ణ. – ట వర్గం
త – థ – ద – ధ – న – త వర్గం
ప – ఫ – బ – భ – మ. – ప వర్గం
కఠినంగా పలికే అక్షరాలు – క, చ, ట, త, ప – పరుషాలు
తేలికగా పలికే అక్షరాలు – గ, జ, డ, ద, బ – సరళాలు
వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు ఖ,ఘ ఛ ఝ ఠ, ఢ, ధ, ఫ, భ – వర్గయుక్కులు,
ముక్కు సాయంతో పలికే అక్షరాలు – జ్ఞ ఇ్ ణ, న, మ – అనునాసికాలు.
అంగిలి సాయంతో పలికే అక్షరాలు య, ర, ఱ్ఱ, ల, ళ, వ – అంతస్థాలు,
గాలిని బయటికి ఊదుతూ, అక్షరాలు – శ, ష, స, హ – ఊష్మాలు.
పరుష, సరళాలు కాకు మిగిలిన హల్లులు – స్థిరాలు,
‘క’ నుండి ‘మ’ గల హల్లులు – స్పర్శాలు.
వర్ణోత్పత్తి
కంఠం నుండి పుట్టే అక్షరాలు – అ, ఆ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ, : – – కంఠ్యాలు.
తాలువు (దౌడ) భాగంలో పుట్టే అక్షరాలు – ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, ఇ్, య, శ – తాలవ్యాలు.
నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు – ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ ర, ష – మూర్ధన్యాలు.
దంతాల సాయంతో పలికే అక్షరాలు – (చ, జ), త, థ, ద, ధ, న, ల, స – దంత్యాలు.
పెదవి సాయంతో పలికే అక్షరాలు – ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ – – ఓష్ట్యాలు.
ఎ, ఏ, ఐ – కంఠతాలవ్యాలు
ఒ, ఓ, ఔ – కంఠోష్ట్యాలు
వ- దంతోష్ణ్యం
4. సమయస్ఫూర్తి
రచయిత : కందుకూరి వీరేశలింగం
రాజమండ్రిలో జన్మించారు.
రాజశేఖర చరిత్రము’, ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’, ‘హాస్య సంజీవని’, ‘సతీహిత బోధిని’, ‘ఆంధ్రకవుల చరిత్ర’, మొదలైనవి వీరి రచనలు.
వీరు సంఘసంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త, ‘గద్య తిక్కన ఆయన బిరుదు.
ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలోని కథ,
పాత్రలు : రోమశుడు అనే పిల్లి,పలితుడు అనే ఎలుక , చంద్రకుడు అనే గుడ్లగూబ ,
“మిత్రమా! నమస్కారం జాతి వైరమున్నా శత్రు మిత్రులము. చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బ్రతుకుతున్నాము ఒకరికొకరు అపకారం చేసుకోలేదు. ప్రస్తుతం కష్టకాలం వచ్చింది. కావున శత్రువులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయటపడదాం.” – పలీతుడు
“తెలియనిదాని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చేకన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరమూ స్నేహంగా ఉందామని, కాదంటే నీకాహారం అయిపోదామని తెగించి వచ్చాను. ప్రాణభీతితో కకాదు ప్రాణ స్నేహం కోసంతహతహలాడుతూ…”. పలీతుడు
“మిత్రమా! జీవితం చివరిదశలో ఉన్నాను. నీవు చెప్పినట్లే నడుచుకుందాము. నీవుత్యాగబుద్ధి తో నన్ను రక్షించదలచావు, నీకు కృతజ్ఞతలు. ”. – రోమషుడు
“నిజానికి జాతి లక్షణం కాదనలేని వైరలక్షణం. బయటకు వచ్చాననుకో నాకు ప్రాణగండం తప్పదని తెలుసు”పలితుడు.
“మిత్రమా! పలితుడా!! రాతుడు కాలయమునిలా వస్తున్నాడు. నన్ను తొందరగా రక్షించు”. -. రోమశుడూ
పకృతి – వికృతి
ఆహారం – ఓగీరం
ధర్మము – ధమ్మం
ప్రాణం. – పానం
కథ – కత
సంతోషం – సంతసం
సంధులు
1.వాడెక్కడ. = వాడు + ఎక్కడ
మనమందరం = మనము + అందరం
ఎవరిక్కడ = ఎవరు + ఇక్కడ
వారందరూ = వారు + అందరూ
మహనీయులెందరో = మహనీయులు + ఎందరో
ముసలివాళ్లు + అందరు = ముసలివాళ్ళందరు
ఇల్లు + ఉంది. = ఇల్లుంది
ప్రజలు + అందరూ = ప్రజలందరూ
డోక్కలు + ఎండిపోయిన = డోక్కలెండిన
ముసలివారు + అంటే = ముసలివారంటే
6. సుభాషితాలు
కవి పరిచయం :
నార్ల చిరంజీవి – తెలుగుపూలు శతకం – 20శతాబ్దం
కరుణశ్రీ – తెలుగుబాల శతకం – 20శతాబ్దం
పక్కి అప్పల నరసింహం – కుమారా, కుమారీ శతకాలు – 17శతాబ్దం
పోతులూరి వీరబ్రహ్మం – కాళికాంబా సప్తశతి – 17శతాబ్దం
మారద వెంకయ్య – భాస్కర శతకం – 16శతాబ్దం
కంచర్ల గోపన్న – దాశరథీ శతకం – 17శతాబ్దం
శతకం:
శతకం అంటే సూరు పద్యాల రచన. శతక పద్యాల చివర ‘మకుటం’ ఉంటుంది. ఇందులో పద్యాలు ‘ముక్తకాలు’గా ఉంటాయి. అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రభావం కలిగి ఉంటుంది. మకుటం ఉండటం వలన శతకకవి ఏ పద్య ఛందస్సును ఎన్నుకుంటాడో అదే ఛందస్సులో అన్ని పద్యాలు రాయవలసి ఉంటుంది.
ప్రకృతి – వికృతి
శ్రీ – సిరి
రోషం – రోసం
దీపం – దివ్వె
నానార్ధలు
హరి : కోతి,సూర్యుడు,చంద్రుడు,సింహం
సంధులు
మాయమ్మ = మా + య్ + అమ్మ
మీయిల్లు. = మీ + య్ + ఇల్లు
మేనయత్త = మేన + య్ + అత్త
ఉన్నయూరు = ఉన్న + య్ + ఊరు
సరియైన = సరి + య్ + ఐన
నాదియన్న = నాది + య్ + ఉన్న
పై పదాల మధ్య ‘య్’ అదనంగా వచ్చి చేరింది. అలా చేరడాన్ని ‘యడాగమం’ అంటారు.
ఏమంటివి – ఏమి + అంటివి (మ్ + ఇ +అ) సంధి జరిగితే,
ఏమియంటివి = ఏమి + య్ + అంటివి (య్ + అ) సంధి జరగకపోతే,
ఇత్వంపై సంధి తప్పక జరగాలనే నియమం లేదు. జరగవచ్చు. జరగకపోవచ్చు. వ్యాకరణం పరిస్థితిని ‘వైకల్పికం’ అంటారు.
నాదన్న = నాది + ఉన్న
నాదియన్న = నాది + ఉన్న
అదొకటి = అది + ఒకటి
అదియొకటి = అది + ఒకటి
లేకున్న = లేక + ఉన్న
మణి + ఏమి = మణియేమి
ఇది + అంత = ఇదంతా
రానిది + అని = రానిదని
అది + ఎట్లు = అదెట్లు
కాలమూరక = కాలము + ఊరక
దీపమున్న = దీపము + ఉన్న
నేరములెన్నడు = నరములు + ఎన్నడు
సమాసాలు
సమాసం: అర్థవంతమైన రెండు పదాలు కలిసి, ఒకే పదంగా ఏర్పడటాన్నే సమాసం అంటారు.
సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తరపదమని అంటారు.
ఉదా : సరస్వతీమందిరం – సరస్వతి యొక్క మందిరం
సరస్వతి పూర్వపదం, మందిరం ఉత్తరపదం ఇలా సమాసాలు ఏర్పడతాయి.
ద్వంద్వసమాసం : సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది
ద్వంద్వసమాసం.
ఉదా: సూర్యచంద్రులు : సూర్యుడును, చంద్రుడును
తల్లిదండ్రులు : తల్లియు, తండ్రియు
రామలక్ష్మణులు : రాముడును, లక్ష్మణుడును
“ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు” అని సూత్రం
7. మమకారం
రచయిత: చిలుకూరి దెవపుత్ర
అనంతపురం జిల్లా కాల్వపల్లెలో జన్మించారు.
‘ఏకాకి నౌక చప్పుడు’, ‘చివరి మనుషులు’, ‘బందీ’, ‘వంకర టింకర’, ‘ఆరు గ్లాసులు’ మొదలైన కథా సంపుటాలు వెలువరించారు.
‘అద్దంలో చందమామ’, ‘పంచమం’ ఆయన రాసిన నవలలు.
1996లో ‘పంచమం’ నవలకు ఆటా (అమెరికా తెలుగు అసోషియేషన్) వారి నవలల పోటీలో తృతీయ బహుమతి, 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం, 2001లో చా.సో. స్ఫూర్తి సాహితీ సత్కారం, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది.
ఈ పాఠం చిలుకూరి దేవపుత్ర రచించిన ‘ఆరుగ్లాసులు’ అనే కథాసంపుటిలోనిది.
పాత్రలు: సీత , రాధ,సుగుణ,పిల్లలు , సత్యం,రాజు
అర్థాలు :
ఉబలాటం = కోరిక
ఒద్దిక = పద్ధతిగా
వాత్సల్యం = ప్రేమ
తేటతెల్లం = స్పష్టమవడం
వ్యతిరేఖ పదాలు
పండితులు –పామరుడు
సరసం – విరసం
ప్రకృతి – వికృతి
స్త్రీ – ఇంతి
భయం – బయం
ఆశ్చర్యం – అచ్చెరువు
8. మేలు కొలుపు
కవి : కుసుమ దర్మన్న
రాజమహేంద్రవరంలోని లక్ష్మివారపు పేటలో కుసుమ నాగమ్మ, వీరస్వామి దంపతులకు జన్మించారు.
‘నిమ్నజాతి ముక్తి తరంగిణి’, ‘నల్లదొరతనం’, ‘హరిజన శతకం’, ‘మాకొద్దీ నల్లదొరతనం’ వంటి రచనలు చేశారు.
దళిత వర్గం నుంచి అతికష్టం మీద చదువుకుని పైకొచ్చి, తిరిగి ఆ చదువును తన జాతి మేలుకోసం వెచ్చించిన అతికొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఒకరు.
భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తపించిన తొలితరం తొలి దళిత కవి.
కుసుమ ధర్మన్న రచించిన హరిజన శతకం అనుబంధం నుండి గ్రహింపబడినది.
అర్థాలు
వెలది = స్త్రీ
రణం – యుద్ధం .
సన్నుతం = పొగడ్త
దుర్భరం = కష్టం