AP 6th Class Science Notes 8th Lesson దుస్తులు ఎలా తయారవుతాయి

→ వస్త్రాలలోని చిన్న తంతువుల వంటి నిర్మాణాలను దారాలు అంటారు.

→ దారాలు వస్త్రాలుగా మార్చబడతాయి. దుస్తులు తయారు చేయడానికి దారం నేస్తారు.

→ మొక్కలు మరియు జంతువుల నుండి పొందిన దారాలను సహజ దారాలు అంటారు.

ఉదా : పత్తి, ఉన్ని, జనపనార, పట్టు.

→ రసాయనాల నుండి పొందిన దారాలను కృత్రిమ దారాలు అంటారు.

ఉదా: పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, రేయాన్.

→ పత్తి కాయ నుండి విత్తనాలను తొలగించే ప్రక్రియను జిన్నింగ్ లేదా వేరు చేయటం అంటారు.

→ పోగుల నుండి దారం తయారు చేయడాన్ని స్పిన్నింగ్ లేదా వడకటం అంటారు.

     My Class Notes

→ దారాల నుండి దుస్తులు అల్లే ప్రక్రియను నేతనేయటం అంటారు.

→ నేయడం “మగ్గం” వంటి ప్రత్యేక పరికరాలపై జరుగుతుంది.

→ మగ్గాలు చేనేత మరియు పవర్‌లూమ్ అనే రెండు రకాలు కలవు.

→ జనపనారను గోనె సంచుల తయారీకి ఉపయోగించవచ్చు కాని బట్టలు తయారు చేయడానికి కాదు.

→ మనం కృత్రిమదారాల్ని కాల్చినట్లయితే అవి తీవ్రమైన వాసనను ఇస్తాయి.

→ కృత్రిమ దారాలైన పాలిస్టర్, పెట్రోలియం నుండి తయారు చేయబడుతుంది.

→ పాలిథీన్ సంచులు మట్టిలో కుళ్ళిపోవడానికి లక్షల సంవత్సరాల సమయం పడుతుంది.

→ మనం వేర్వేరు వాతావరణ పరిస్థితుల నుండి మనలను రక్షించుకోవడానికి విభిన్న దుస్తులు ఉపయోగిస్తాము.

→ బట్టలు అందం మరియు హెూదా యొక్క చిహ్నంగా కూడా ఉంటాయి.

→ జనుము మొక్క యొక్క కాండం నుండి జనపనార లభిస్తుంది.

→ కాలికో అనేవి బుక్ బైండింగ్ మరియు బ్యానర్ల తయారీకి వాడే ఒక రకమైన దుస్తులు.

→ పురాతన రోజుల్లో మానవులు జంతువుల చర్మాలను, చెట్ల ఆకులు మరియు బెరడులను బట్టలుగా ఉపయోగించారు.

→ యుద్ధ సైనికుల బట్టలు లోహంతో తయారవుతాయి.

     My Class Notes

→ ఒక్క పశ్చిమ బెంగాల్ మాత్రమే 50% పైగా ముడి జనపనారను ఉత్పత్తి చేస్తుంది.

→ 80% మహిళలు కొబ్బరి నార పరిశ్రమలలో పనిచేస్తున్నారు.

→ గోధుమ రంగు కొబ్బరి పీచును బ్రు, డోర్ మాట్, దుప్పట్లు మరియు బస్తాల తయారీకి ఉపయోగిస్తారు.

→ మన పర్యావరణాన్ని పరిరక్షించడానికి, పాలిథీన్ బ్యాగ్ కు బదులుగా బట్టల సంచులను ఉపయోగించాలి.

→ వస్త్రాలు : మానవులు ధరించే దుస్తులు.

→ దారపు పోగు : బట్టలోని సన్నని దారాలు.

→ దారాలు : జీవులు లేదా కృత్రిమ పదార్థం నుండి ఏర్పడిన సన్నని నిర్మాణాలు. ఇవి బట్టల తయారీకి తోడ్పడతాయి.

→ సహజ దారాలు : మొక్కలు లేదా జంతువుల నుండి పొందిన దారాలు.

→ కృత్రిమ దారాలు : రసాయనాలతో చేసిన దారాలు.

→ ఏరివేయటం (జిన్నింగ్) : పత్తి బంతి నుండి విత్తనాలను వేరు చేయడం.

→ వడకటం (స్పిన్నింగ్) : పోగులను మెలితిప్పి దారాలు తయారు చేయటం.

→ నేత నేయడం : పడుగు, పేక అనే రెండు వరుసల దారాలను కలిపి వస్త్రాలు తయారు చేయడాన్ని ‘నేత నేయడం’ అంటారు.

→ మగ్గం : దారాలతో దుస్తులను నేసే పరికరం.

→ పడుగు : నేతలో నిలువు వరుస దారాలను పడుగు అంటారు.

→ పేక : నేతలో అడ్డు వరుస దారాలను పేక అంటారు.

→ ముతక : నునుపు లేకపోవటం.

→ నానబెట్టటం : పదార్థాన్ని కొన్ని రోజులు నీటిలో ఉంచటం.

→ కొబ్బరి పీచు : కొబ్బరి పండ్ల నుండి వచ్చే దారాలు.

→ మెరుగుపర్చటం : వొక పదార్థాన్ని జోడించడం ద్వారా నాణ్యతను పెంచటం.

     My Class Notes

→ కాలికో : బుక్ బైండింగ్ లో ఉపయోగించే ఒక రకమైన వస్త్రం.

→ చేనేత : చేతితో నేత వేసే వస్త్ర పరిశ్రమ.

→ దువ్వటం : దారాలు నిడివిగా తీసే ప్రక్రియ.

→ రంగులు వేయటం : నేతకు ముందు దారాలకు రంగులు వేసే ప్రక్రియ.

→ ఆర్మస్ : రాజులు మరియు సైన్యం ఉపయోగించే లోహపు జాకెట్.

Scroll to Top