→ నేడు మనం బల్బ్ లలో వాడుతున్న ఫిలమెంట్ టంగ్ స్టన్.
→ విద్యుత్ : ఇది ఒక శక్తి స్వరూపం. దీని ద్వారా మనకు బల్బులు, ఫ్యాన్లు పనిచేస్తాయి.
→ ఘటం : విద్యుత్తును ఉత్పత్తి చేసే పరికరం. ఇది రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది.
→ బల్బు : కాంతిని ఉత్పత్తి చేసే విద్యుత్ పరికరం.
→ ధ్రువాలు : ఘటము మరియు బల్బులు వంటి విద్యుత్ పరికరాల్లోని రెండు చివరలను ధ్రువాలు అంటాము.
→ ఫిలమెంట్ : విద్యుత్ బల్బులలో కాంతి మరియు ఉష్ణాన్ని ఇచ్చే విద్యుత్ తీగను ఫిలమెంట్ అంటారు. బల్బ్ లోపల ఉన్న రెండు తీగల మీదుగా ఒక సన్నని తీగ ఉంటుంది. ఇదే బల్బ్ లో వెలిగే భాగం. దీన్నే ఫిలమెంట్ అంటారు.
→ స్విచ్ : విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించటానికి ఉపయోగించే పరికరం.
My Class Notes
→ వలయం : విద్యుత్ పరికరాలు పనిచేయటానికి ఘటం నుంచి బయలుదేరిన విద్యుత్తు తిరిగి ఘటాన్ని చేరుతుంది. దీనిని విద్యుత్ వలయము అంటారు.
→ విద్యుత్ వాహకం : విద్యుతను తమగుండా ప్రవహింప చేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. ఉదాహరణ రాగి, వెండి, ఇనుము.
→ విద్యుత్ బంధకం : విద్యుత్ ను తమగుండా ప్రవహింపచేయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు.
→ టంగ్స్టన్ : విద్యుత్ బల్బులలో ఫిలమెంట్ గా ఉపయోగించే పదార్థం. దీనికి నిరోధకత ఎక్కువ.