AP 5TH CLASS TELUGU 2021 Best Notes for TET and DSC,

here we are giving short notes

1. ఏ దేశమేగినా

కవి పరిచయం:
రాయప్రోలు సుబ్బారావు (13-03-1892 – 30-06-1984)
రాయప్రోలు సుబ్బారావు అభినవ నన్నయ బిరుదాంకితుడిగా, నవ్య కవితా పితామహుడిగా పేరుపొందారు.
తృణకంకణం’, ‘స్నేహలత’, ‘స్వప్నకుమారం’, ‘కష్టకములు’, ‘ఆంధ్రావళి’, “జడకుచ్చులు’, ‘వనమాల’ మొదలైన కావ్యాలను రచించారు.
‘రమ్యాలోకం’, ‘మాధురీ దర్శనం అనే లక్షణ గ్రంథాలు రాశారు.
వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించింది.
 
అర్థాలు 
తెన్గు తెలుగు
కాలిడు అడుగు పెట్టు
సోకు = తగులు
 
ఆంధ్రభాష యమృత మాంధ్రాక్షరంబులు
మురువు లొలుకు గుండ్ర ముత్తియములు
ఆంధ్రదేశ మాయురారోగ్య వర్ధకం
బాంధ్రజాతి నీతి ననుసరించు.         – వేటూరి ప్రభాకర శాస్త్రి

 

My Class Notes

 

2. సాయం

రచయిత జాప్ కొప్
పాత్ర రవి , పిచ్చుక
అర్థాలు 
దృష్యం – చూడదగినవి
ఆత్రం తొందర
అవధులు హద్దులు
 
అనకు కనకు వినకు
రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి ,
రచనలు : ఉదయ శ్రీ,కరుణ శ్రీ,విజయ శ్రీ అరుణ కిరణాలు తెలుగు బాల శతకం
పాత్రలు గాంధీ,మహదేవ్ దేశాయ్

 

My Class Notes

 

3. కొండవాగు

రచయిత చెరుకుపల్లి జమదగ్ని శర్మ
రచనలు మహోదయం,చిలుకా గోరింక,అన్నదమ్ములు ధర్మధీక్ష .
పాత్రలు జావేద్ రామం,సూర్య
జావేద్ వెంకట్ కు లేఖ రాశాడు
 
అర్థాలు
మేట = ఇసుక ప్రదేశం
వాగు = చిన్న ఎరు
జాలువారు = జారుతున్న
పొద్దు = రోజు, దినం
దృశ్యం  = సన్నివేశం, చూడదగినది
బారులు = వరుసలు
లంక – నదిలో పైకి లేచి ఉన్న భూభాగం
కదంతొక్కు = ఉత్సాహంతో ముందుకు వెళ్ళు
 
జననీ జనకుల గొలుచుట
తనయునకును ముఖ్యమైన ధర్మము జననీ
జనకుల గొల్చుట కంటెను
దనయున కభృధికమైన ధర్మం గలదే.         –  శ్రీనాథుడు
 
 
వడగళ్ళు
కవి పరిచయం
ఏడిద కామేశ్వరరావు (12-09-1913 – 1984)
ఏడిద కామేశ్వరరావు ఆకాశవాణిలో పనిచేశారు. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు.
‘రామగీతం’, ‘జైలు రోజులు’, ‘ఇండోనేషియా చరిత్ర’ మొదలయిన రచనలు చేశారు.

 

My Class Notes

 

4. జయగీతం

కవి పరిచయం :
బోయి భీమన్న (19-09-1911 – 16-12-2005)
బోయి భీమన్న కవి, నాటకకర్త. ‘పాలేరు’, ‘కూలిరాజు’ వంటి నాటికలు, ‘గుడిసెలు
కాలిపోతున్నాయి’, ‘మధుగీత’ వంటి ఖండకావ్యాలు రచించారు. 
వీరు పద్యం, పాట,వచనం మూడింటిలోను సిద్ధహస్తులు. 
‘పాలేరు నుంచి పద్మశ్రీ వరకు’ అన్నది వీరి స్వీయ చరిత్ర. వీరు కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం పొందారు.
 
అర్థాలు
భాస్కరా! = సూర్యుడా
సంవిధానం = రాజ్యాంగం
తథాగతా! = బుద్ధుడా
వేదాంతము = ఉపనిషత్తులు
మథించి = చిలికి
మహితము = గొప్పతనము
ఉడిపి = తొలగించి
సౌభ్రాత్రం = సోదరభావం
పంకం  = బురద/మట్టి
మ్రోళ్ళు = ఆకులు రాలిన చెట్లు
నిష్కుల = కులం లేని.
 
ఎఱుక గలవారి చరితలు
గఱచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
బెఱుగుచు నెఱిగిన దానిని
మఱువ కనుష్ఠించునది సమంజస బుద్ధిని.      -.   నన్నయ

 

My Class Notes

 

5. తోలు బొమ్మలాట

రచయిత కే.వి రామకృష్ణ 
‘తొంభై ఆమదలైనా వెళ్ళి తోలు బొమ్మలాట చూడాలి’ అనే ప్రాచీన నానుడి వలన ఆనాటి గ్రామీణ జీవితాలలో తోలు బొమ్మలాట కెంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తున్నది.
తోలు బొమ్మలాట క్రీ.పూ. 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉంది తెలుస్తున్నది.
మన ఆంధ్రలో తూర్పు గోదావరి, వై.ఎస్.ఆర్. కడప, అనంతపురం, శ్రీకాకుకు శాఖపట్నం జిల్లాల్లో తోలు బొమ్మలాట కళాకారులు ఉన్నారు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆరె కులస్థుల నుండి ఈ తోలు బొమ్మలాట ఇతర కులస్థులు నేర్చుకున్నారు.
 
ప్రదర్శనకు ఆరు నుంచి ఎనిమిది మంది కళాకారులు ఉంటారు. కథలో స్త్రీ పాత్ర వచ్చినపుడు (స్త్రీలు, పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాట పాడుతారు. వంశలు హార్మోనియం, మద్దెల, తాళాలు వాయిస్తూ వంతపాడతారు.
తోలు బొమ్మలాటలో చెప్పే భాగవత కథల్లో ఎక్కువగా భక్త ప్రహ్లాద, సాహిత్రి, కృష్ణలీలలు మొదలైనవి మూడు రోజుల పాటు ప్రదర్శిస్తారు. రామాయణ, భారత, భాగవత కథా వస్తువులతో పాటు సమాజానికి అవసరమైన వేమన,
సుమతి, నీతి శతకాలలోని పద్యాలను, శ్లోకాలను, సూక్తులను, నీతి వాక్యాలను, సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తారు.
 
తప్పెటగుండ్లు : జానపద కళారూపాలలో ఒకటైన తప్పెటగుండ్లు ప్రత్యేకించి ఉత్తరాంధ్రాలో ఎక్కువగా కనిపిస్తుంది. గుండ్రంగా రేకుతో చేసిన తప్పెట్లను ఈ బృందం కళాకారులు మెడలో వేసుకుని పాడుతూ ఆ పాటకు అనుగుణంగా గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తారు.
పాటకు అనుగుణంగా తప్పెట్లను వాయిస్తుంటారు.
ఈ వాయిద్యాల్ని, గుండెమీద పెట్టుకుని వాయించడం కారణంగా దానికి తప్పెట ‘గుండు’ అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది.
 
కోలాటం : గ్రామీణ ప్రాంత ప్రజలు తాము చేసే నిత్యకృత్యాలలోని శ్రమను మరచిపోయేందుకు ఉపయోగించే కళారూపం కోలాటం. కోలాటం ఆటలో కళాకారులు రెండు చేతులలో లలు ధరించి వాటిని తాడిస్తూ కోలాటం ఆడుతారు.
ఇందులో ఏకకోలాటం, జంట కోలాటం, జడ కోలాటం కోలాటం, పురుషుల కోలాటం
లాంటివి ఎన్నో ఉన్నాయి.
కోలాటం నృత్యంలో సుమారు 16 మంది నుంచి 40 మంది వరకు పాల్గొనవచ్చు.
 
 
అర్థాలు
ప్రాచీన = పాత, పురాతన
ప్రాముఖ్యం = ప్రాధాన్యం
ఆమడ = ఎనిమిది మైళ్ళ దూరం
నానుడి = వాడుకగా అనే మాట, సామెత
తర్ఫీదు= శిక్షణ, అభ్యాసం
రక్తి కట్టడం = అలరించడం
శ్రుత పాండిత్యం = వినడం ద్వారా నేర్చుకోవడం
చమత్కారం =  నేర్పు
పారాయణం = శ్రద్ధగా చదవడం
 
 
 
సామెతలు
“తొంభై ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి”
అరునెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట
రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు
ఆవులిస్తే పేగులు లెక్కపెట్టినట్లు
కాకి పిల్ల కాకికి ముద్దు
మొక్కై వంగనిది మానైవంగునా
అదుగో పులి అంటే,ఇదిగోతోక అన్నట్లు
ఇంట్లో ఈగల మోత,బయట పల్లకి మోత
నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది
 
విద్య వలనను వినయంబు, వినయమునను
ఐదయు పాత్రత, పాత్రత వలన ధనము,
ధనము వలనను ధర్మంబు, దాని వలన
బహిళా ముష్కిడ సుఖంబు లందు నరుడు.         – భర్తృహరి
 
కూచిపూడి నృత్యం-ఒక సంప్రదాయ కళ
 
కూచిపూడి నృత్యం తెలుగువారి ప్రత్యేక నృత్యరీతి. ఇది ఆంధ్రరాష్ట్రంలో కృష్ణాజిల్లాలోని దివిసీమలో కూచిపూడి’ అనే గ్రామంలో కొన్ని శతాబ్దాల పూర్వం ఆవిర్భవించిన కళారూపం.
ఈ ఊరి పేరుతోనే ఇది ప్రసిద్ధమైంది.
సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యకళకు మూలపురుషుడు అంటారు. ఆయన నాడు ప్రచారంలో ఉన్న యక్షగాన కళారూపాలను స్వీకరించి కూచిపూడి నృత్య ప్రక్రియను అభివృద్ధి చేశాడు.
ఈయన రచించిన నాట్య నాటకం ‘భామా కలాపం’.
తెలుగు ఇది మొట్టమొదటి నృత్య నాటకం. కూచిపూడి నాట్యకళాకారులు విస్తృతంగా నాటకమిది.
 
నాట్యం అభినయ ప్రధానం. అభినయం నాలుగు రకాలు .   అవయవాల కదలికతో భావవ్యక్తీకరణ ఆంగికాభినయం. భాష వ్యక్తీకరణ వాచితాభినయం. వేషం ద్వారా భావవ్యక్తీకరణ ఆహార్యాన్ని శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావవ్యక్తీకరణ సాత్వికాభినయం.
 
కూచిపూడి కళాకారులు ‘నృత్య నాటకాలతో పాటు పగటి వేషాలు కూడా వేస్తారు. వాళ్లు వేసే  వేషాల్లో ప్రధానమైనది అర్ధనారీశ్వరవేషం. అర్ధనారీశ్వర వేషంలో కుడి వైపు పురుషుడు, ఎడమవైపు స్త్రీ ఉంటారు. ఈ రెండు వేషాలను పై నుండి క్రింది వరకు ఒక తెర ఉంటుంది.
మాట్లాడేటప్పుడు రెండోవైపును తెర కప్పుతుంది.
 
కూచిపూడి నాటక ప్రదర్శనలను భాగవత మేళా’ అని కూడా అంటారు. వీటిల్లో స్త్రీ పురుష పాత్రలు రెండూ ఉంటాయి. కాని ఇటీవలి వరకు స్త్రీ పాత్రను కూడా పురుషులే ధరించేవారు. ఇప్పుడు స్త్రీలు కూడా ధరిస్తున్నారు.
 
కీ.శే. భాగవతుల రామయ్య, హరిమాధవయ్య, చింతా వెంకట రామయ్య, తాడేపల్లి పేరయ్య, భాగవతుల విస్సయ్య, వెంపటి వెంకట నారాయణ, దర్భా వెంకటేశ్వర్లు, వేదాంతం పార్వతీశం, వేదాంతం వెంకటాచలపతి, వేదాంతం రామకృష్ణయ్య, వేదాంతం రాఘవయ్య, చింతా కృష్ణమూర్తి, వేణుగోపాలకృష్ణశర్మ, వేదాంతం రత్తయ్యశర్మ, వేదాంతం సీతారామశాస్త్రి మొదలయినవారు కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు.

 

My Class Notes

 

6. పెన్నేటి పాట 

కవి విద్వాన్ విశ్వం
రచనలు –  పెన్నిటిపాట,విలాసిని,రాతలు – గీతలు
అర్థాలు
హోరు = శబ్దం
నిధానించు నెమ్మదించు
జాలు = ప్రవాహం
విధారించు చీల్చుకుంటూ
బొక్కసం ధనాగారం
నాళ్ళు రోజులు ప్రాంతాలు
కంజర = ఒక రకమైన వాయిద్యం
 
సాధువులగు జంతువులకు
బాధలు గావించు అటుల భంజింపని రా
ఆధము నాయుస్స్వద
శ్రీధనములు వీగి బోవు సిద్ధము తల్లీ            – పోతన 
 

మూడు చేపలు

కవి పరిచయం
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
రచనలు రాజరాజు ( నాటిక)అత్మబలి,రక్షాబంధన్ (నవలలు)అనుభవాలు జ్ఞాపకాలు (ఆత్మకథ).
పాత్రలు: దీర్ఘదర్శి,దీర్ఘ సృతూడుప్రాప్తకాలజ్యూడు
సంభాషణ
 “ఈ మడుగు చాలా చిన్నది. వేసవిలో ఎండిపోతుంది. కనుక ఎప్పుడూ ఎండిపోని పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాం”    – దీర్ఘ దర్శి
 
 “వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం? ఒక వేళ ఎండిపోవడం నిజమైతే అప్పుడే ఏదో ఒక ఉపాయం తోచక పోతుందా? ఇప్పుడు ఈ మడుగు నిండుగా ఉంది. కష్టం వస్తుందని ఇప్పుడు ఈ మడుగు విడిచి వెళ్ళడం మంచిది కాదు”   – ప్రాప్తకాలజ్యూడు
 
 “మీ మాటలు చాలా తికమకగా ఉన్నాయి. ఈ మడుగల మహాసముద్రంవలె పెద్దది.
అనవసరంగా భయపడుతున్నారు. కాబట్టి మనం ఇక్కడ నుండి కదలడం మంచిది”.  -.   దీర్ఘ సృతూడు
 

My Class Notes

 

7. పద్య రత్నాలు

 
కవి పరిచయం
వేమన శతకం – వేమన
సుమతి శతకం – బద్దెన
మహా భారతం నన్నయ,తిక్కన, ఎర్రన
కాళికాంబ శతకం పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
సుభాషిత రత్నావళి – ఏనుగు లక్ష్మణ కవి
 
 
నిజము మీద భూమి నిలబడి యుండును
సత్యవాక్కు వలన జనత నడుచు
సత్యమొకటిపాప సంహారమును చేయు
కాళికాంబ హంస కాళికాంబి
                                   – పోతులూరి వీరబ్రహ్మం
ఒరులేయవి యొనరించిన
నరవర! యప్రియము తనమనంబునకగుఁ దా
వారులకు నవిసేయకునికి
ఐరాయణము పరమ ధర్మ పథములకెల్లన్
                                      – తిక్కన
 
నీతియె మూలము విద్యకు
నీతియె పురుషార్థ తత్త్వ నిర్ణాయకమున్
నీతియె భూత ప్రీతియు
నీతియుతుం చెప్పుకొందు నియత పదంబున్
 
                       – ఏటుకూరి వెంకట నరసయ్య
 
చదువని వాడజ్ఞుండగు,
చదివిన సదసద్వివేక ‘కలుగున్,
చదువగ వలయును జనులకు,
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ!
                              – పోతన
 
తరువులతిరసఫల భార గురుతఁ గాంచు
నింగి వ్రేలుచు నమృతమొసంగు మేఘు
డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత
జగతి నుపకర్తలకు నిది సహజగుణము
– భర్తృహరి సుభాషితం
 
అర్థాలు
ఎడతెగక =అడ్డు లేకుండా
ద్విజుడు = బ్రాహ్మణుడు
చొప్పడిన =ఉన్నట్టి
పోసగ తగినట్లు
పరిణతి =మార్పు
గురుత =గొప్పదనం,బరువు
వ్రేలుచు =వ్రేలాడుతూ
అమృతం =తియ్యని వాననీరు
కోవిదుడు =విద్వాంసుడు
పెన్నిధి గొప్పదైన నిధి
ఉపకర్త =ఉపకారం చేసే వారు
ఒరులు =ఇతరులు
అప్రియము =ఇష్టం లేని వారు
పరాయణము =అభీష్టం
కుచ్చితము కపటము
బుధులు = పండితులు
ఉద్ధతులుగారు =గర్వపడరు
నియత =నియమం గల
నిర్ణాయకమున్ =నిర్ణయించేది
 
ముక్తకం అంటే ఒక పద్యం. పూర్తి అర్థాన్ని తన ఇస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం సంపూర్ణంగా వినిపించేది.
తెలుగులో ముక్తక రచనను శతక, చాటు పద్యాలను ఉదాహరణగా చెప్పవచ్చు.
వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు మక్తక పద్య రచనలో చాలా ప్రసిద్ధులు. ముక్తకు ఒక పద్య ప్రక్రియ. శతకంలో కూడ ముక్తక లక్షణం ఉంటుంది
 
 
వాచకం
సాధారణంగా భాషలో పదజాలాన్ని పురుషులను సంబోధించే పదాలు, స్త్రీలను సంబోధించే పదాలు, ఇతరులను సంబోధించే పదాలు (పక్షులు, జంతువులు, విదాలు) అని విభాగం చేయవచ్చు. వీటినే పుంలింగం, స్త్రీ లింగం, నపుంసక లింగం అంటారు.
కొన్ని భాషల్లో అర్ధంతో సంబంధం లేకుండా పద స్వరూపాన్ని బట్టి లింగం ఉంటుంది. కొన్ని భాషల్లో అర్థాన్ని బట్టి లింగం ఉంటుంది.
తెలుగులో అర్థం ప్రమాణం. తెలుగు వ్యాకరణాలలో ఈ విభాగాన్ని లింగం అనకుండా వాచకం అంటారు. పురుషులను బోధించే పదాలు మహత్తులు, తక్కినవి అమహత్తులు, వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో అమహత్తుతోనూ, బహువచనంలో మహత్తుతోనూ చేరతాయి.
 
ఉదా. అతను వచ్చాడు
ఆది / ఆమె వచ్చింది
వాళ్లు (స్త్రీలు / పురుషులు / స్త్రీ పురుషులు) వచ్చారు
అవి వచ్చాయి.
అందువల్ల స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే మహతీ వాచకాలు అంటారు.
 
 
” మాటలచేత దేవతలు మన్నన జేసి వరంబు లిత్తు, రా
మాటలచేత భూపతులు మన్నన జేసి ధనంబు నిత్తు, రా
మాటలచేత మానినులు మన్నన చేసి మనంబు చిత్తు, రా
మాటలు నేర్వకున్న మరి మానము హూనము కాదె యేరికిన్ ||.    – భర్థుహరీ
 

My Class Notes

 

కలమళ్ల   – తొలి తెలుగు శాసనం

ఆంధ్ర దేశంలో క్రీస్తుపూర్వం నుండే శాసనాలు  లభిస్తున్నాయి. మొదటి శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి.
తర్వాత సంస్కృత ప్రాకృత మిశ్రంగాను, ఆ తర్వాత సంస్కృతంలోనూ శాసనాలు
ఈ శాసనాలలో ఊళ్ల పేర్లు, తెలుగులో కనిపిస్తాయి.
మొత్తం తెలుగులో మొదటిసారి శాసనాలు వేసినవారు రేనాటి చోటాలు, రేనాడు అంటే ఇప్పటి వై.ఎస్.ఆర్. కడప జిల్లా ప్రాంతం.
రేనాటి చోళరాజు ఎరికల్ ముతురాజు ధనుంజయుడు కలమళ్ల గ్రామంలో వేసిన శాసనం ఇది. శాసనంలోని పదాలన్నింటికీ మనకు ఇంకా స్పష్టమైన అర్థాలు తెలియవు.
ఇది దాన శాసనం. ఈ దానాన్ని పాడుచేసిన వారికి పంచమహాపాతకాలు కలుగుతాయని శాపవాక్యంతో శాసనం ముగిసింది.
 
 

8. ఇటీజ్  పండుగ 

కవి పరిచయం
గిడుగు వేంకట రామమూర్తి (29.8.1863- 22.1.1940)
ఆధునిక తెలుగు భాషా ప్రవక్త. ప్రజల జీవితానికి దూరంగా ఉన్న గ్రాంథిక భాష స్థానంలో
ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు.
తన జీవితకాలం వ్యావహారిక భాషా ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు.
సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు. సవర పాటలు, కథలు సేకరించి సవర వాచకాలు రూపొందించారు.
సవర-ఇంగ్లీషు నిఘంటువును రూపొందించడమే కాక సవర భాషలో మౌలికమైన పరిశోధన
చేశారు. సవరల కోసం సవర వ్యాకరణం రచించారు.
 ‘బాలకవి శరణ్యం’, ‘ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం’ మొదలైన గ్రంథాలు రచించారు.
 
పాత్రలు : క్రాంతి,అక్షయ,పెద్దనాన్న
విశాఖ, విజయనగరం జిల్లాలలోని మన్యం వాసులు  ఇటీజ్ పండుగ చేసుకుంటారు.
మార్చి లేదా ఏప్రిల్ నెలలో చేస్తారు. ఒడియా సాహచర్యం ఉన్నవారు చైత్ పొరొబ్ (చైత్రపర్వం) అని అంటారు. గిరిజనేతరులు ఇటుకల పండుగ అని అంటారు.
ఉగాది తరువాత నవమి మధ్యలో ఈ పండుగ చేస్తారు. మనలాగే పన్నెండు నెలలకు పేర్లు పెట్టుకున్నారు. అందులో ‘విటిజి. ఆ నెలలో జరిపే పండుగ ఇటీజ్ పండుగ,
 గ్రామస్థులు సమావేశం నిర్వింహించి తదుపరి  చాటింపు వేస్తారు. ఆ తరువాతి శుక్రవారం నుండి పండుగ ప్రారంభం అవుతుంది
 పండుగ రోజు మన రైతుల మాదిరి గానే నాగలి, మోకు, పలుపు తాళ్ళు, కొంకి మొదలయిన వ్యవసాయ పనిముట్లు కడిగి కుదురు’ (దేవుని మూల) దగ్గర పెట్టి పూజిస్తారు.
మామిడికాయలను ఇంటికి తెచ్చి వాటిని ముక్కలుగా కోస్తారు. బియ్యంతో ఆ ముక్కలను
దానిని ‘బోనం’ అంటారు. ఆ బోనం నైవేద్యంగా దేవునికి సమర్పిస్తారు.
 
రెండవరోజు ‘రొడ్డ కనుసు’ చేస్తారు. ‘రొడ్డ’ అంటే మామిడి, సీతాఫలం మొదలైన ఆకులు. ‘కనుసు’ అంటే ఊరేగింపు. రెండవరోజు ఆకులు కట్టుకుంటారు. తలకు పక్షి ఈకలు కట్టుకుంటారు. ముఖంపై నలుపు, తెలుపు రంగులు దారలుగా పూసుకుంటారు.
 రంగులు, బూడిద కలిపిన నీరు వెదురుగొట్టాల్లో నింపి ఒకరిపై ఒకరు జల్లుకుంటారు.
పనసకాయను జంతువుల ఆకారంగా చేస్తారు. దాని పైకి బాణాలు వేస్తూ, ఆడుతూ, పాడుతూ సంకుదేవుని దగ్గరకు వెళతారు.
 
సంకుదేవుని కొరకు ప్రతి ఇంటి నుండి గుప్పెడు చొప్పున విత్తనాలు, బియ్యం సేకరిస్తారు. గుడిదగ్గర
బియ్యం వండి నైవేద్యం పెడతారు. విత్తనాలు కొన్ని గుడి చుట్టూ చల్లుతారు. మిగిలిన విత్తనాలు వారం రోజులు తరువాత ఇటింటికి పంచుతారు. అవి వారి విత్తనాలలో కలుపుకుంటారు.
 
మూడు, ఆరు రోజుల్లో ఏదో ఒక రోజు గ్రామస్థులంతా వేటకు వెళతారు. వేటకు వెళ్ళని వారిని
వరసైన వారు ఎగతాళి చేస్తారు. వేట సాధించిన వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది.
 
 చివరి రోజును ‘మారు ఇటీజ్’ లేక ‘నూరు ఇటీజ్’ అంటారు. ఆరోజు దారికి అడ్డంగా వెదురు
బొంగు కడతారు. వెదురు గొట్టాలతో వచ్చేపోయే వారిపై నీళ్ళు చల్లుతారు. వెదురు కర్రకు తాళ్ళను కట్టి ఊయలగా చేసి ఊగుతారు.
 
 
అర్థాలు
తుడుం = గిరిజన వాయిద్య పరికరం
కొమ్ముబూర = కొమ్ముతో తయారు చేసే బూర
మొక్కుబడులు = భగవంతునికి చెల్లించే ముడుపులు
కుదురు =  కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక
థింసా, కోయ =  గిరిజన నృత్యాలు
అటక = చిన్నమిద్దె
గ్రామ ఊరేగింపు
రోడ్డ కనుసు = గ్రామ ఊరేగింపు
 

My Class Notes

 

9. తరిగొండ వెంగమాంబ

వేంగమాంబ బరుమాంబ రెండున్నర శతాబ్దాల కిందటి చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామంలో జన్మించింది. తండ్రి కానాల కృష్ణయార్యుడు. తల్లి పేరు మంగమాంబ.
పాల్యంలోనే ఆమెలో భక్తి భావనలు వేళ్లూనుకున్నాయి.
 
పాండిత్యంతో అలవోకగా ఎన్నో  వేంగమాంబ సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేసింది. ఆమె యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు. కవులందరిలో ఎక్కువ యక్షగానాలు రచించిన ఘనత వేంగమాంబదే. తాళ్ళపాక అన్నమయ్యలాగ రాగాలు చెప్పడమేకాక, తన కీర్తనలన్నింటికి ఏ తాళం వాడాలో కూడా చెప్పింది.
 “అష్టఘంటాలు’ అనే పేరుతో ఎనిమిది మంది రాతగాళ్ళను నియమించి, తన గ్రంధాలకు ప్రతులు రాయించి, అడిగిన వాళ్ళకు ఇచ్చేది. ఆ విధంగా వేంగమాంబ రచనలు దేశంలో అన్ని ప్రాంతాల వారికి పరిచయం అయ్యాయి.
తానేమి చదువుకోలేదని వినయంగా ‘రాజయోగసారము’, ‘భాగవతము’ ద్విపద కావ్యాల్లో ఆమె చెప్పుకుంది.
 
ద్విపద రచన వేంగమాంబకు ఇష్టం.
తరిగొండలో ఉన్న రోజుల్లోనే నారసింహ శతకం, నారసింహ విలాసకథ, శివనాటకం, రాజయోగసారం, కృష్ణనాటకం, పారిజాతాపహరణం, చెంచునాటకం, శ్రీ కృష్ణ మంజరి, శ్రీ రుక్మిణీ నాటకం, ద్విపద భాగవతం, వాసిష్ఠ రామాయణం, ముక్తికాంతా విలాసం, శ్రీ వేంకటాచల మాహాత్మ్యం, అష్టాంగ యోగసారం అనే గ్రంథాలు రచించింది.
వేంగమాంబ ప్రతిరోజు శ్రీనివాసుడికి ముత్యాలహారతి ఇచ్చేది. అందుకే ‘తాళ్ళపాక వారి లాలి, తరిగొండమ్మ హారతి’ అనే నానుడి ఏర్పడింది. ఆంధ్రదేశం గర్వించదగిన భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ.
అర్థాలు
అంతరాలు తేడాలు
అనఘత్ముమురాలా పుణ్యాత్మురాల

 

 

నన్నయ్య రాజమహేంద్రవరం రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. నన్నయ

11వ శతాబ్దానికి చెంది వాడు. ఆరాజు కోరికపై సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ తెలుగులో రాశాడు నన్నయ ఆది, సభా పర్వాలను, ఆరణ్యపర్వంలో కొంత భాగాన్ని రాశాడు.

నన్నయను ఆదికవి అంటారు. ఈయనకు ‘వాగనుశాసనుడు’ అనే బిరుదు కూడా ఉంది.

తిక్కన నెల్లూరును పాలించిన మనుమసిద్ధి వద్ద మంత్రిగా ఉండేవాడు. ఈయన తిక్కన 13 వ శతాబ్ధం కి చెందినవాడు. మహాభారతంలో విరాటపర్వం మొదలు పదిహేను పర్వాలు

రాశాడు. ఈయనకు ‘కవిబ్రహ్మ’, ‘ఉభయకవి మిత్రుడు’ అనే బిరుదులు ఉన్నాయి. 

తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం‘ అనే మరో కావ్యం కూడా రాశాడు.

ఎర్రన అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. 

ఎర్రన 14వ శతాబ్దం వాడు. 

భారతంలో అరణ్యపర్వంలో నన్నయ రాయగా మిగిలిన భాగాన్ని ఎర్రన పూర్తి చేశాడు. ఎర్రన ‘హరివంశం’ ‘నృసింహపురాణం’ కూడా రాశాడు. ఈయనకు ‘ప్రబంధ పరమేశ్వరుడు’, ‘శంభుదాసుడు’ అనే బిరుదులున్నాయి.

 
కేయూరాణి న భూషయంతి పురుషం
పోరా న చంద్రోజులా
న స్నానం న విలేపనం న కుసుమం
నాలంకృతా మూర్ధజాః
వాణ్యేతా సమలజ్కరోతి పురుషం
యా సంస్కృతాధార్యతే
క్షీయంతే ఖిల భూషణాని సతతం
వాగ్భూషణం భూషణం.  భర్తృహరి.

 

My Class Notes

 

9. మంచి బహుమతి

పాత్రలు వియాన్ మామయ్య
గాంధీ – ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ యు
భగత్ సింగ్ – లెనిన్ రచించిన రాజ్యం – విప్లవం
సరోజని నాయుడు – సరోవర వాణి
అంబేద్కర్ –  32 పుస్తకాలు రచించాడు, 23 డిగ్రీలు సాధించాడు. 
 
 
తనువు, రక్తంబు, జీవంబు ధారపోసి
ఋషి వతంసులు పెక్కు వేలేండ్లు తపము
సలిపి ఆర్జించినట్టి విజ్ఞాన ధనము
దాచి యుంచిన పేటి గ్రంథాలయమ్ము.      -. నాళం కృష్ణారావు 
 
 నవ్వుల తాతయ్య –   చిలకమర్తి 
చిలకమర్తి లక్ష్మీనరసింహం కవి, నాటకకర్త, నవలాకారుడు. 
‘గయోపాఖ్యానము’, ‘కీచకవధ’ వంటి నాటకాలు, ‘రామచంద్ర విజయము’, ‘గణపతి’  నవలలు, ‘భల్లట’, ‘కృపాంభోనిధి’ శతకాలు రాశారు. స్వీయచరిత్ర రాశారు.
కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి, నిర్వహించారు.