1. తెలుగు తల్లి

 

పాఠ్యాంశం :  

ఇతివృత్తం – దేశభక్తి, 

ప్రక్రియ – గేయం , 

కవి – శ్రీ రంగం శ్రీనివాసరావు.   

కాలం –  (14.04.1901 – 15.06.1983)

రచనలు –  ప్రస్థానం , మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి.

ఆత్మకథ – అనంతం  

అర్థాలు :

తెనుంగు = తెలుగు

అనుంగు = ప్రియమైన

చనవొయ్ = వెళ్లవొయ్

రేడు = రాజు

 

తల్లి భారతీ వందనం

 ప్రక్రియ – పాట

కవి –  దాశరథి కృష్ణమాచార్య 

రచనలు – అగ్నిధార, రుధ్రవిణ , మహాంద్రోదయం, తిమీరం తో సమరం

ఆత్మకథ – యాత్రా స్మృతి

 ప్రత్యేకత –  ఆంధ్ర ప్రదేశ్ ఆస్థాన కవిగా సేవలందించారు.

నిజాం వ్యతరేక ఉద్యమం లో పాల్గొన్నాడు.

ఐకమత్యం

ప్రక్రియ –  కథ

రచయిత –   లియోటాల్ స్థాయి రష్యన్ కథ ఆధారం . 

రచనలు : సమరం – శాంతి, అనాకెరనీనా,

 

2. మర్యాద చేద్దాం

కథ

పాత్రలు – పరమాందయ్య, పేరయ్య, 12 మంది శిష్యులు , దొంగలు 

సంభాషణ : 

“ఓయ్ పరమానందం! ఒరేయ్ పరమా!” – పేరయ్య

“సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారుగా, పరమా!” – పేరయ్య

పాపం వీళ్ళకేమీ తెలియదు. ఒట్టి అమాయకులు. వారిని క్షమించు”. – పరమానందయ్య

 

ఈసప్ కథలు గ్రీకు పురాతన కథలు. 2500 సం .క్రితం రాయబడ్డాయి.

 

3. మంచి బాలుడు

గేయం

కవిపరిచయం :

కవి – ఆలూరి బైరాగి 

కాలం – 5.11. 1925 – 9.9.1978

20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. మానవుడి ఆస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు.

రచనలు – ‘చీకటి మొదలు’, ‘నూతిలో గొంతుకలు’, ‘ఆగమగీతి’, ‘దివ్యభవనం! ఆయన ప్రసిద్ధ రచనలు.

కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం పొందారు.

 

అర్థాలు

వీధులు -బజారులు

జడిసి = భయపడి

త్రోవ = దారి

వడి = వేగం 

 

కలపండి చేయి చేయి

గేయం

కవిపరిచయం

దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి (1.11.1897 – 24.2.1980)

ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగుకవి.

అక్షర రమ్మత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు.

అందుకనే వీరి కవిత్వాన్ని శ్రీశ్రీ  ఇక్షూ సముద్రంతో పోల్చారు.

‘కృష్ణపక్షం, ‘ఊర్వశి”, ప్రవాసము’ వీరి ప్రసిద్ధ రచనలు. పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.

 

భావిలో నీళ్ళు

కథ

పాత్రలు : రైతు, జమీందారు, అక్బర్, బీర్బల్

 

సంభాషణ : 

 “నేను నీకు బావిని అమ్మాను కానీ, అందులోని నీకు అమ్మలేదు. అవి నావి. ఆ నీళ్ళు కావాలంటే తగిన ధనం ఇచ్చి తోడుకో!”      – జమీందారు

 

“సరే, రైతు బావిలో నీ నీళ్లు ఉన్నాయి. వెంటనే బానిలో కీళ్ళన్నీ తోడుకొని వెళ్ళిపో లేదా నీళ్ళు

పెట్టుకున్నందుకు రైతుకు అద్దె చెల్లించు”    – బీర్బల్

 

4. నా బాల్యం

కథ

కవి పరిచయం

షేన్ నాజర్ నిరు పేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెనలు గ్రామంలో

1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బీనాబీ.

ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు.

పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం. అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతి వృత్తాలలో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు.

నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

నాజర్ 1997 ఫిబ్రవరి 21వ తేదీన మరణించారు.

షేక్ నాజర్ తన జీవితకథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి

చరిత్రాత్మకమైన ఈ కథకు ‘పింజరి’ అని పేరు పెట్టాడు.

నాజరు / అబ్దుల్ అజీజ్ (తాతగారు పెట్టిన పేరు)

పాఠశాలలో వేసిన నాటకం – ద్రోణాచార్య

సంగీతం నేర్పింది – హార్మోనిస్ట్ ఖాదర్

 

అర్థాలు

గుంజ – రాట

పామరులు   = చదువుకోనివారు

ఆశ = కోరిక

ఆరుగాలం = ఏడాది అంతా

 

పర్యాయ పదాలు

గుంజ – రాట , నిట్టాడు ,స్తంభం

బాబాయి : చిన్నన్న, పినతండ్రి, చిన్నాబ్బ

బువ్వ : అన్నం, కూడు ,మెతుకులు

 

 

 

5. పొడుపు–విడుపు

 ప్రక్రియ – సంభాషణ 

కవి పరిచయం :

చింతా దీక్షితులు (26, 8, 1891 – 25, 8. 1960)

కవి, కథకులు, విద్యావేత్త, తెలుగులో బాలసాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు, గిరిజనుల గురించి సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత.

‘ఏకాదశి’, ‘శబరి’, ‘వటీరావు కథలు’, ‘లక్కపిడతలు ఆయన రచనలు.

పాత్రలు : సూరి, సీతి, వెంకీ

పొడుపు కథలు

తీస్ కొద్ది పెరిగేది – గొయ్యి

వెండి గొలుసులు వెయ్యడమే కానీ తియలేము – ముగ్గు

నూరు చిలుకలకు ఒకటే ముక్కు – పళ్ళ గుత్తి

పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకుని నూతిలో పడ్డాడు.  – అరటి పండు

ఇంట్లో కలి – రోకలి

ఒంట్లో కలి – ఆకలి

 

చందమామ

గేయం

కవి – నండూరి  రామమోహనరావు

హరివిల్లు ఆయన రచించిన బాలగేయాల సంపుటం.

నరావతారం’, ‘విశ్వరూపం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభశైలిలో పాఠకులకు పరిచయం చేశారు. 

విశ్వదర్శనం’, ‘అక్షరయాత్ర’ వంటి రచనలతో పాటు మార్కన్వయిన్ రచించిన ‘టామ్ సాయర్’, ‘హకల్ బేరిఫిన్’ లకు అనువాదాలు కూడా చేశారు.

 

 

వికటకవి

నాయనా! ఇవిగో రెండు పాత్రలు. ఒక దానిలో పాలున్నాయి. మరొకదానిలో పెరుగు పాలు తాగితే గొప్ప పండితుడివవుతావు. పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడివవుతావు. నీకేం కావాలో కోరుకో

నీవు వికటకవివి అవుతావు ఫో”.        -.    కాళికా మాత తెనాలి రామకృష్ణుడు తో

 

6. మే మే మేకపిల్ల

కథ

1949 లో బాపట్ల కు చెందిన అర్ . శకుంతల దేవి రచించిన చందమామ కథలు

పాత్రలు : మే మే మేకపిల్ల , మేక తల్లి, ఏరు, నిప్పు, వంటవాడు, గాలి

సంభాషణలు

‘ఢిల్లీ వెళదాం – రాజును చూద్దాం’    మే మే

 ‘సరే వెళ్ళు, కాని ముందు ఈ కొమ్మ నాకు బరువుగా ఉంది. ఆకులన్నీ తినేసెయ్యవా?”   ఏరు

“ఓహో అలాగా, నేను రాజు దగ్గరే ఉంటా. నాతోరా చూపిస్తా’  వంటవాడు

 

“చూశావా మరి. నీవు ఎవరికీ సాయం చేయలేదు. మరి నీకెవరు సాయం చేస్తారు?”.  గాలి

 

‘ఢిల్లీ వద్దు

రాజు వద్దు

అమ్మ మాటే వింటా

ఉండదు. నాడే తంటా.   మే మే

 

అర్థాలు

కాగు = పెద్ద బిందె

వాలకం = తీరు

 

తెలుగు తోట

గేయం 

కవి పరిచయం

 కవి – కందుకూరి రామభద్రు కవి.

 రచనలు – లేమొగ్గ, తరంగిణి, గేయ మంజరి

 

7. పద్య రత్నాలు

కవిపరిచయాలు

కవి : వేమన

జననం : 17-18 శతాబ్దాల మధ్య కాలం

జన్మస్థలం : కడప జిల్లాకు చెందిన వారని చరిత్రకారులు భావిస్తున్నారు.

వేమన సమాధి : అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లె.

శతకం : వేమన శతకం

 

కవి : బద్దెన

కాలం : 13వ శతాబ్దం

శతకం : సుమతీ శతకం

 

కవి : గువ్వల చెన్నడు

కాలం : క్రీ.శ. 17-18 శతాబ్దాల

స్వస్థలం: కడప జిల్లా రాయచోటి 

శతకం : గువ్వల చెన్న శతకం

మకుటం : గువ్వల చెన్న

 

కవి : పాపయ్య శాస్త్రి

జననం : 12-06-1992

స్వస్థలం : గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మం|| కొమ్మూరు. గ్రామంలో జన్మించారు.

ఇతర రచనలు : విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైన కావ్యాలు రచించారు.

 

కవి : దువ్వూరి రామిరెడ్డి (9వ పద్యం)

కాలం : 9-11-1895 – 11-09-1947

స్వస్థలం: నెల్లూరు

రచనలు : కృషీవలుడు, జలదాంగన, గులాబితోట, పానశాల మొదలైనవి.

అర్థాలు

ధర = భూమి , నేల

పరికించు = పరిశీలించు

అబ్బు = అలవాటు ఆగు

శబ్ద చయము = పదాల సమూహం

మర్మము = సారం, భావం, రహస్యం

సరసుడు = మంచిని గ్రహించ కలిగిన వాడు

ఎప్డు = ఎల్లప్పుడూ

బలమి = బలం

కమళాప్తుడు = సూర్యుడు

రష్మి = కిరణం, వేడి,

సోకి = తాకి ,తగిలి

గ్రావం = కొండ

లావు = బలం , శక్తి

మహి = భూమి

కలిమి = సంపద;

లోభి – పిసినారి;

 విలసితముగ = చక్కగా;

పేద = బీదవాడు;

వితరణి = దాత;

చలిచెలమ – మంచినీటిగుంట;

కులనిధి = ఎక్కువ నీరు కలిగినది;

అంభోధి = సముద్రం.

అర్చన – పూజ, సేవ;

ఇచ్చకములు – ప్రియమైన మాటలు;

ఆప్తవరులు – హితులు,

కాంచు = చూచు;

చెలిమికాండ్రు = స్నేహితులు,

 

తెలుగు లో తొలి కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, – రచన సుభద్రా కళ్యాణం

 

అందమైన పాట

జీ.వీ సుబ్రమణ్యం – నవ్య సంప్రదాయ దృష్ఠిలో సాహితీ విమర్శ చేశారు.

 రచనలు –   వీరరసం, రసోళ్ళాసం, సాహితీ చరిత్రలో చర్చనీయాంశాలు

 

దిలీపునీ కథ

పాత్రలు : దిలీపుడు, నందిని అనే ఆవు, సింహం, భార్య సుధక్షిణాదేవి

“ఓ మహారాజా! నేను ఆకులు, గడ్డి తిని బతకలేను. నా అజంతువులే కదా! దేశాన్ని

ఏలే రాజువు. నీకు తెలియదా! మరి నన్ను ఏం తిని బతకమంటావు?   – సింహం దిలీపుడు తో

 

 “ఈ గోమాతను  కన్నబిడ్డలా చూసుకుంటానని మా గురువుగారికి మాటిచ్చాను. దయ ఉంచి గోమాతను విడిచి పెట్టు. బదులు నన్ను నీ ఆహారంగా స్వీకరించు”.     – దిలీపుడు సింహం తో

 

 “ఒక గోమాతను కాపాడలేని, ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను.”.  – దిలీపుడు సింహం తో

 దిలీపుడుకి పుట్టిన కుమారుడు – రఘు మహారాణి.   ( శ్రీ రాముడు వంశం ) 

 

 

8. మా ఊరిఏరు

గేయం

మధురాంతకం రాజారాం.  – రాయలసీమ సంస్కృతి లై 400 పైగా కథలు రాశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నరు .

 

పంట చెలు –

పాలగుమ్మి విశ్వనాథం  

 

9. తొలి పండుగ

పాత్రలు – రవి , లత , ఆనంద్, శ్యాముల్, , రంగయ్య తాత  

“అబ్బా! పూర్ణంబూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇచ్చేమో!”    – ఆనంద్.

“ఈరోజు ఉగాది పండుగ కదా? మా అమ్మ చేసింది. వీటన్నింటికంటే ముందు ఉగాది పచ్చడి తినాలి”.  – రవి

“తాతా! చేతులు కదుక్కో నీకు ఉగాది పచ్చడి పెడతాను. తరువాత పూర్ణాలు,బ్గారెలు కూడా పెడతాను”   –  లత రంగయ్య తో

 

అర్థాలు

నైవేద్యం – దేవుడికి పెట్టేది / నివేదన చేసేది

పంచాంగం – అయిదు అంగాలు కలది .

తెలుగు సంవత్సరాలు – 60

మొదటిది – ప్రభవ, చివరిది – అక్షయ

2020 – వికారి, 2021 – శార్వరి, 2022 – ప్లవ

మన తెలుగు వారికి ప్రత్యేకమైన  నెలలు

చైత్రం

2 వైశాఖం

జ్యేష్టం

ఆషాఢం

శ్రావణం

భాద్రపదం

ఆశ్వయుజం

కార్తికం

9.మార్గశిరం

పుష్యం

మాఘం

ఫాల్గుణం

 

అందాల తోటలో

కస్తూరి నరసింహా మూర్తి రచించిన పాపాయి సిరులు గేయ సంపుటి నుండి 

నక్క యుక్తి

జంధ్యాల సుబ్రమణ్య శాస్త్రి

గద్వాల్ సంస్థానంలో సహస్రవదాని.

ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్న లక్ష్మీ శతపత్రం, కేనోపనిషత్తు

  “ ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు ఇది, ఎవరు ఎక్కువ అయితే వచ్చే లాభం ఏముంది” – నక్క మొసలి తో