→ లోడ్ స్టోన్ ఒక సహజ అయస్కాంతం.

→ అయస్కాంతాలను వివిధ ఆకారాలలో తయారు చేస్తారు. దండాయస్కాంతం, గుర్రపునాడ అయస్కాంతం, వలయాకారపు అయస్కాంతం, బిళ్ల అయస్కాంతం మొదలయినవి.

→ అయస్కాంతం ఆకర్షించే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటాం. అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటాం.

→ అయస్కాంతానికి ఆకర్షించే గుణం కొనల వద్ద ఎక్కువగా ఉంటుంది. ఈ కొనలలో అయస్కాంతపు ధృవాలు ఉంటాయి.

→ ప్రతి అయస్కాంతానికి రెండు ధృవాలు ఉంటాయి. 1) ఉత్తర ధృవం 2) దక్షిణ ధృవం.

→ అయస్కాంతపు సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి. విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి.

→ స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండాయస్కాంతం ఉత్తర, దక్షిణ దిక్కులను సూచిస్తుంది.

     My Class Notes

→ అయస్కాంత దిక్సూచిని తయారు చేయడానికి అయస్కాంతాల దిశాధర్మము ఉపయోగించబడుతుంది.

→ అయస్కాంత దిక్సూచి అనేది దిశలను కనుగొనడానికి ఉపయోగించే ఒక పరికరం. దీనిని నావికులు సముద్ర ప్రయాణంలో వాడతారు.

→ అయస్కాంతానికి దగ్గరగా ఉండటం వల్ల ఒక అయస్కాంత పదార్థం అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దాన్ని అయస్కాంత ప్రేరణ అంటాం.

→ అయస్కాంతాలను వేడిచేసినప్పుడు, ఎత్తు నుంచి జార విడిచినప్పుడు మరియు సుత్తితో కొట్టినప్పుడు మొదలైన సందర్భాలలో తమ లక్షణాలను కోల్పోతాయి.

→ మేము రోజువారీ జీవితంలో స్పీకర్లు, ఎలక్ట్రిక్ మోటార్లు, డోర్ లాక్స్, పిన్ హెల్డర్స్, క్రేన్లు మొదలైన వివిధ రకాల పరికరాలలో అయస్కాంతాలు ఉపయోగిస్తాము.

→ విద్యుదయస్కాంత రైళ్లు విద్యుదయస్కాంత లెవిటేషన్ సూత్రంపై పనిచేస్తాయి.

→ అయస్కాంతం : ఇనుమును ఆకర్షించగల పదార్థం. ఇది తన చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటుంది.

→ అయస్కాంత పదార్థాలు : అయస్కాంతాలచే ఆకర్షించబడే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు.

→ అనయస్కాంత పదార్థాలు : అయస్కాంతాలచే ఆకర్షించబడని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు.

→ ఉత్తర ధృవం : స్వేచ్ఛగా వ్రేలాడదీసిన అయస్కాంతం యొక్క ఉత్తర దిశను ఉత్తర ధృవం అంటారు.

→ దక్షిణ ధృవం : స్వేచ్ఛగా వ్రేలాడదీసిన అయస్కాంతం యొక్క దక్షిణ దిశను దక్షిణ ధృవం అంటారు.

→ అయస్కాంత దిక్సూచి : దిక్కులను కనుగొనే పరికరం.

→ సజాతి ధృవాలు : రెండు అయస్కాంతాల యొక్క ఒకే ధృవాలు, N – N లేదా S – S లను జాతి ధృవాలు అంటారు. ఇవి ఒకదానికొకటి వికర్షించుకొంటాయి.

→ విజాతి ధృవాలు : రెండు అయస్కాంతాల యొక్క వేర్వేరు ధ్రువాలు, N – S లేదా S – N లను విజాతి ధృవాలు అంటారు. ఇవి ఒకదానికొకటి ఆకర్షించుకొంటాయి.

     My Class Notes

→ ఆకర్షణ : దగ్గరకు లాగబడే బలం.

→ వికర్షణ : వస్తువులు ఒకదానికొకటి దూరంగా నెట్టే బలాన్ని వికర్షణ అంటాము.

→ అయస్కాంత ప్రేరణ : అయస్కాంతానికి దగ్గరగా ఉండడం వల్ల ఒక అయస్కాంత పదార్థం అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు.

→ ధృవాలు : అయస్కాంతం యొక్క రెండు చివరలను ధృవాలు అంటారు. ఇక్కడ ఆకర్షక శక్తి బలంగా ఉంటుంది.

→ అయస్కాంతీకరణ : ఒక వస్తువును అయస్కాంతంగా మార్చే ప్రక్రియ.

→ అయస్కాంత లెవిటేషన్ : అయస్కాంత లెవిటేషన్ అనేది ఒక వస్తువును, అయస్కాంత క్షేత్రాల వికర్షణ బలంతో గాలిలో నిలుపుట.