TS TELUGU 2ND CLASS 2021
తెలివైన రాణి :
పాత్రలు: రాణి , చిలుక
సంభాషణ (ఎవరు ఎవరితో అన్నారు ? )
‘నేను నీకు జామ పండ్లు ఇస్తాను,కానీ నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్తే నీకు జామ పండ్లు ఇస్తాను. ‘. – చిలుక రాణితో అన్నది .
‘ఇకనుంచి నీకు నాకు సోపతి, ఇదిగో జామ పండ్లు ‘ – చిలుక రాణితో అన్నది .
పొడుపుకథలు :
చాప చుట్టలెం , పైసలెంచలేం – ఆకాశం,నక్షత్రాలు
అందమైన చెరువులో ముధ్ధచ్చే పిట్ట,మూతి బంగారం,తోకతో నీరు తాగుతుంది – దీపం
తోకలేని పిట్ట తొంభై కోసులు పోతుంది –ఉత్తరం
పడగ విప్పిన బాటసారి పైలంగా పోతాడు.ఎండకు , వానకు లోగండు, గాలికి గడగడ వణుకుతాడు. – ఛత్రి
ముక్కు మీద నెక్కు,ముందర చెవులు నొక్కు,జారదంటేపుటుక్కు – కండ్లద్దాలు
కాళ్ళున్న కదలలేనిది – కుర్చీ
గుడ్డు పెట్టలేని కోడి – పకోడి
కన్ను ఉన్న తల లేనిది – సూది

పళ్ళు ఉన్న నోరు లేనిది – రంపం
తల ఉన్న కళ్ళు లేనిది –గుండుసూది
పొద్దున్నే నిద్రలేస్తాడు
పగలంతా ఉరుకుతాడు
రాత్రయితే నిద్రపోతాడు
ఎవరది? ఎవరది? – సూర్యుడు
ఆకాశంలో అంబు
అంబులో చెంబు
చెంబులో పాలు
ఏమిటది? ఏమిటది? – కొబ్బరికాయ
నేలను నాకుతుంది
మూలన కూర్చుంటుంది
ఏమిటది? ఏమిటది? – చీపురు
అమ్మ అంటే కలుస్తాయి
అయ్య అంటే కలువవు
ఏమిటవి? ఏమిటవి? – పెదవులు
కోడిపిల్ల
పాత్రలు :కోడి,కొడిపిల్లలు, కుక్క,పిల్లి
స్నేహితులు – కుక్క,కోడి , కోడిపిల్లలు
పిల్లి నుండి తప్పిపోయిన కొడిపిల్లని కాపాడింది – కుక్క
సామెతలు :
ఎంత చెట్టుకి అంత గాలి.
కుక్క కాటుకు చెప్పు దెబ్బ
కొనేది వంకాయ కోరేది గుమ్మడి కాయ
గోరంత దీపం కొండంత వెలుగు
దొంగకు తేలు కుట్టినట్లు ( తేలు కుట్టిన దొంగలా )
నాయనా ..పులి
పాత్రలు : రాజయ్య,లింగయ్య
రైతు – రామయ్య
రామయ్య కొడుకు అల్లరి పిల్లగాడు –లింగయ్య .
లింగయ్య ఎన్ని సార్లు పులి వచ్చింది అని అబద్దం అడాడు – మూడు సార్లు
సంధులు :
అయ్యనాటపట్టించే – అయ్యను + ఆటపట్టించే = ఉత్వ సంధి
తెలుగు నెలలు
పాత్రలు:లింగమ్మ,తాత,రాజు
తెలుగు నెలలు పన్నెండు! చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం,
కార్తికం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం.
పండుగలు – తెలుగు నెలలు
చైత్రం – ఉగాది
ఆషాఢం – తొలి ఏకాదశి
భాద్రపదం – వినాయక చవితి
ఆశ్వయుజం – దసరా
పాల్గుణం – హోళి
సంభాషణ ( ఎవరు ఎవరితో అన్నారు ? )
‘తాతా! రేపు మాపాఠశాలలో కథల పోటీఉన్నది. మంచి కథ చెప్పవా? ‘ – లింగమ్మ తాత తో
“చైత్రమాసం” అంటే ఏందితాతా!? వచ్చేది మార్చి నెల కదా! – లింగమ్మ తాత తో
పరమానందయ్య శిష్యులు
పాత్రలు : పరమానందయ్య, 12 మంది శిష్యులు
ఎద్దుల బండి నుండి వరసగా కింద పడ్డవి –రాగి చెంబు,శాలువా,పేడ
సంభాషణ ( ఎవరు ఎవరితో అన్నారు ? )
‘ మోధ్దుల్లారా , కింద పడ్డవి బండిలో వేయాలని తెలియదా ? ఈ సారి ఎది కింద పడ్డ బండిలో వేయండి ‘ – పరమానందయ్య
శ్రీ కృష్ణ శతకం
అర్ధాలు :
సఖుడు – స్నేహితుడు
యుదుకుల = యాదవ
కరి – ఏనుగు
పుండరీకం – తెల్ల తామర
సంధులు :
పరమేశ్వర = పరమ + ఈశ్వర : గుణ సంధి
క్షీరాబ్ది = క్షీర + అబ్ధి : సవర్ణదీర్ఘ సంధి
నన్నుఁబ్రోవు = నన్నుఁ +పోవు : సరళా దేశ సంధి.
అలంకారాలు :
హరియను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా! – యమకం
పద్యం :
నీవే తల్లివి తండ్రివి
నీవే నాతోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా!
నారాయణ, పరమేశ్వర
ధారాధర నీలదేహ! దానవ వైరీ!
క్షీరాబ్ధి శయన! యదుకుల
వీరా! ననుగావు కరుణ వెలయగ కృష్ణా!
హరియను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహత్వము
హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!
బలమెవ్వడు కరిఁబ్రోవను
బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్
బలమెవ్వడు సుగ్రీవుకు
బలమెవ్వడు నాకు నీవె బలమౌ కృష్ణా !
దండమయా విశ్వంభర!
దండమయా పుండరీక దళనేత్ర! హరీ!
దందమయా కరుణానిధి!
దండమయా నీకు నెపుడు, దండము కృష్ణా!
నారాయణ! లక్ష్మీపతి!
నారాయణ, వాసుదేవ! నందకుమారా!
నారాయణ! నిను నమ్మితి
నారాయణ! నన్నుఁ బ్రోవు నగధర! కృష్ణా!
దిక్కెవ్వరు ప్రహ్లాదుకు
దిక్కెవ్వరు పాండుసుతుల దీనుల కెపుడున్
దిక్కెవ్వరయ్యహల్యకు
దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా!