AP TET DSC 7TH CLASS TELUGU PART-2

8)నిజంనిజం

రచన: ప్రక్రియ –కథ,ఇతివృత్తం – పిల్లల ప్రవర్తన,మానవ సంబంధాలు , రచయిత – ముణి మాణిక్యం నరసింహ రావు .  మూలం – తెలుగు హాస్యం కథల సంపుటి

కవిపరిచయం

మునిమాణిక్యంనరసింహారావు. (15-3-1898 – 1972.)

సంగంజాగర్లమూడి (గ్రామం), తెనాలితాలూకా, గుంటూరుజిల్లా.

దాంపత్యజీవితాన్నిఆహ్లాదకరంగా, చమత్కారసంపన్నంగాచిత్రించినరచయిత, తెలుగు

కథాసాహిత్యంలోజీవవంతమైనపాత్రకాంతం’ వీరిసృష్టి.

చమత్కారజనకమైనసులభశైలి, ఆకర్షణీయమైనశీర్షికలువీరిరచనలకువన్నెతెచ్చాయి.

వీరికథకుప్రధానాంశాలుసజీవమైనవాడుకభాష, అచ్చమైనతెలుగునుడికారం.

వీరుకాంతంకథలు, కాంతంకైఫీయత్, కాంతంకాపురం, మేరీకహానీమొదలైన 24 కథలపుస్తకాలు, దాంపత్యోపనిషత్తు, వినోదవ్యాసములుమొదలయినవ్యాససంపుటాలు, మనహాస్యం, (హాస్యాన్నిగూర్చినసిద్ధాంతగ్రంథం)ప్రచురించారు.

పాత్రలు

శీను , మామయ్య,రంగయ్య,సీతయ్య,

శీను సృష్టించిన కల్పిత పాత్ర – సీతయ్య

సంభాషణలు

“ కుర్రాడిని బాగుచేసేబాధ్యత నీధీరా అబ్బాయి.మరి నీ ఇంట్లో ఉంచింది ఎందుకు!కాస్త మంచించెడ్డా చూస్తానని కదా!   – రంగయ్య

నీకు ఒక ఉత్తరం ఇస్తాను,అదిమీ నాన్న కినిచ్చి , దానికి జవాబు రాయించుకొని రా , తెలిసిందా?  – శీను మామయ్య

“ నేను వచ్చే రోజు అనుకొంటున్నారు,మా ఆవు ఆ రోజో, మరునాడోఈనుతుందని ” – శీను

అర్థాలు

తెల్లమొహం వేయడం

బుజ్జగించడం

బిక్కముఖం వేయడం

ఎగగొట్టడం

చివాట్లు వెయ్యడం

 

   

సంధులు              

వసుధైక  =వసుధ + ఏక

రసైక =రస + ఏక

 

సురైక=సుర + ఏక

ఏకైక =ఏక + ఏక

సమైక్య =సమ + ఐక్య

అష్టైశ్వర్యాలు =అష్ట + ఐశర్యం

దేవైశ్వర్యం =దేవ + ఐశ్వర్యం

పౌపౌఘము =పాప + ఓఘము

దివౌకసులు =దివ + ఓకసులు

వనౌషిధి =వన + ఓషది

రసౌచిత్యం =రస + ఔచిత్యం

దివ్యౌషధం=దివ్య + ఔషధం

అభ్యుదయం =అభి + ఉదయం

సూర్యోదయం =సూర్య + ఉదయం

మహౌషధం=మహా + ఔషధం

భాశౌన్నత్యం =భాష + ఔన్నత్యం

లోకైక =లోక + ఏక

లఘూత్తరం =లఘు + ఉత్తరం

మాతౄణం =మాతృ + ఋణం

అణ్వస్రం=అణు + అస్త్రం

9)కూచిపూడి నృత్యం

నాట్యసంప్రదాయాల్లోఒకగ్రామంపేరుతోనేప్రసిద్ధమయినబహుఅరుదైనకళాసంప్రదాయమిది. కూచిపూడినాట్యంఆంధ్రరాష్ట్రంలోకృష్ణాజిల్లాలోనిదివిసీమలో ‘కూచిపూడి’ అనేగ్రామంలోనేకొన్నివందలసంవత్సరాలపూర్వంఆవిర్భవించినకళారూపం.

క్రీ.పూ. 3వశతాబ్దానికిచెందిన’భరతుడు’అనేమహర్షిరచించిన’నాట్యశాస్త్రం’కూచిపూడినాట్యానికిమూలగ్రంథము. ఇదేభారతీయులతొలిలక్షణగ్రంథము.

దీన్నిఅనుసరించినందికేశుని ‘అభినయదర్పణం’, జాయపసేనాని ‘నృత్తరత్నావళి’, శార్థదేవుని ‘సంగీతరత్నాకరం’ వంటిఎన్నోగ్రంథాలువెలువడ్డాయి.

నాట్యశాస్త్రంలోప్రధానంగానాట్యానికిపదకొండుఅంగాలనుపేర్కొన్నారు. అవిరసాలు, భావాలు,అభినయాలు, ధర్ములు, వృత్తులు, ప్రవృత్తులు, సిద్ధులు, స్వరాలు, ఆతోద్యాలు, గానాలు, రంగాలు.

ఇందులోముఖ్యంగా ‘అభినయం’ గురించివివరంగాతెలిపినగ్రంథం “అభినయదర్పణం”,

భాగవతం, రామాయణం, మహాభారతం, దేవీభాగవతంలోనిఇరవైమందివరకుబృందంగాఏర్పడిపొరుగుప్రాంతాలలోప్రదర్శనలుఇచ్చేవారు. ఆయాగ్రామాలకూడళ్ళలోవీరిభాగవతప్రదర్శనలుజరిగేవి. వీథుల్లోజరిగేభాగవతప్రదర్శనలుకాబట్టివీటకివీథిభాగవతాలనేపేరువచ్చింది. వీరినివీధిభాగవతులనిఅంటారు. బయలాటగాండ్రనీఅంటారు.

అంటేఅంతఃపురాలలోమాత్రమేకాకప్రజాబాహుళ్యంముందుబయటిప్రాంతాలలోచేసేప్రదర్శనకాబట్టిఈపేర్లువచ్చాయి.

భాగవతులబృందాలనువారివారివంశస్థులపేరుతోనేపిలిచేవారు. ఈబృందాలను ‘మేళం’

అనికూడాఅంటారు. మేళంఅంటేకలయిక. కొంతమందికలసిబృందంగాఏర్పడడంవల్లవచ్చింది.

భాగవతులవారిమేళం, వేదాంతంవారిమేళం, చింతావారిమేళం, వారివంశాలపేర్లతోనేభాగవతులుమేళాలుగాపేరుపొందారు.

ప్రధానంగాఈమేళాలునాట్యమేళం, నట్టువమేళంరెండువిధాలు, నాట్యమేళంఅంటేప్రజలకు, పాలకులకుఅందరికీచేరువచెందింది.నట్టువమేళంకేవలంరాజుఅంతపురాలలో, దేవాలయాలలోదైవకైంకర్యంకొరకుఉద్దేశించినది.

నాట్య మేళంభాగవతులుఅంతాఅనాడుపురుషులే, స్త్రీలకుస్థానంతక్కువ.

13వశతాబ్దికిచెందినసిద్దేంద్రుడనేయోగికూచిపూడినాట్యకళకుమూలపురుషుడుఅంటారు.

ఈయనరచించిననాట్యగ్రంథం’భామాకలాపం’. ఇదిమొట్టమొదటిస్వతంత్రతెలుగురచన. దీన్నిప్రదర్శించనినాట్యకళాకారుడుండడు.

సిద్దేంద్రునితరవాతబాగాగణుతిపొందినవారిలో’భాగవతులరామయ్య’ గారొకరు. వీరు’గొల్లకలాపంఅనేగొప్పవేదాంతగ్రంథంరచించారు. మనుషులందరూఒక్కటేనని, మనుషులవలెనేజంతువులూప్రాణులేనని, వాటినియజ్ఞాలపేరుతోబలివ్వడంఅపచారమనినాట్యంద్వారాప్రజలకుతెలియచెప్పేగొప్పగ్రంథం.

భామాకలాపంతరవాతవెలుగుచూసినప్రక్రియకేళిక’. ఇదిసమకాలీనచరిత్రలను, సమస్యలనువాటిపరిష్కారాలనుప్రతిబింబించేప్రక్రియ.

‘నృత్యనాటకము’ అనేప్రక్రియఅనేకపాత్రలతోవిస్తారంగాసాగుతుంది.

తరవాతకూచిపూడినాట్యకళలోవెలువడినవి “యక్షగానాలు”.

రూపకం, కలాపం, కేళిక, నృత్యనాటకం, యక్షగానం, నృత్యరూపకం, నృత్యనాటిక, ఏకపాత్రకేళికబృందనృత్యాంశములనేప్రక్రియలుకూచిపూడినాట్యంలోస్వతంత్రంగాచోటుచేసుకొనిపెరిగినప్రక్రియలు,

ఇవికూచిపూడినాట్యపుసొబగులనుపెంచేవిగాగుర్తింపుపొందాయి.

కలాపప్రక్రియనుసిద్ధేంద్రుడుసృష్టించగా, యక్షగానరచనలకుఆద్యుడుకందుకూరిరుద్రకవి.

నృత్యనాటకాలనుతిరువళిక్కేణిరామానుజయ్యసూరి, వేదాలతిరునారాయణాచార్యులురూపొందించారు.

నృత్యరూపక, నృత్యనాటికలనుపద్మభూషణ్డా॥వెంపటిచినసత్యం,కేళికాప్రక్రియనుడా॥వేదాంతంరామలింగశాస్త్రివెలువరించారు.

కీ.శేవెంపటివెంకటనారాయణగారు, కీ.శే. చింతావెంకట్రామయ్యగారు, కీ.శే. వేదాంతంలక్ష్మీనారాయణశాస్త్రిగారుముగ్గురినికూచిపూడి ‘మూర్తిత్రయం’ అంటారు.

ఒకప్పుడుకూచిపూడినాట్యంకేవలంఆగ్రామంలోనిబ్రాహ్మణులకుపరిమితం. అయితేవేదాంతంలక్ష్మీనారాయణశాస్త్రిగారుఇలాంటికట్టుబాట్లనుతెంచివేసికూచిపూడినాట్యాన్నిఅందరికీఅందుబాటులోకితెచ్చారు.

కీ.శే. వేదాంతంపార్వతీశం, వేదాంతంవెంకటాచలపతి, వేదాంతంరామకృష్ణులు , వేదాంతంరాఘవయ్య, చింతాకృష్ణమూర్తి, వెంపటిపెదసత్యం, వేదాంతసత్యనారాయణశర్మ, వెంపటిచినసత్యం, పసుమర్తికృష్ణమూర్తి, పసుమర్తివేణుగోపాలకృష్ణశర్మ, వేదాంతంరత్తయ్యశర్మ, వేదాంతంసీతారామశాస్త్రీమొదలయినవారుకూచిపూడినాట్యాన్నివిశ్వవ్యాప్తంచేశారు.

కూచిపూడినాట్యానికిచరిత్రలోఒకప్రత్యేకస్థానాన్నితెచ్చినమహనీయుల్లోవేదాంతంపార్వతీశం, వేదాంతంసత్యనారాయణశర్మలుముఖ్యులు.

పార్వతీశంగారుకూచిపూడినాట్యానికిఒకపాఠశాలవ్యవస్థఉండాలని’లలితకళాక్షేత్రము’అనేపేరుతోనాట్యవిద్యాలయాన్నిస్థాపించారు. అదేఈనాటికూచిపూడిలోని “శ్రీసిద్ధేంద్రయోగికూచిపూడికళాపీఠం”.

ఇకవేదాంతంసత్యనారాయణశర్మగారుస్త్రీపాత్రపోషణలోప్రముఖులు. కూచిపూడికళాకారుల్లోమొదటి ‘పద్మశ్రీ’ పురస్కారాన్నిపొందినవారుగాకూడాఆయనగుర్తింపుపొందారు.

కూచిపూడినాట్యమంటేమనపురాతనగ్రంథాలలోనిభగవంతునికథలనునాటకాలుగామలచుకొని;దానికినర్తనాన్నిసంధానంచేసినృత్యాన్నితనలోఇముడ్చుకొనికథలలోనినీతిసారాన్నిఅందించడానికిజరిగేనాటకమనిఅర్థం.

నృత్త, నృత్యములునాట్యమునకుసోపానములవంటివి. నృత్త, నృత్యనాట్యములులాస్య,తాండవంరెండువిధాలుగాఉంటాయి.

లాస్యమంటేసుకుమారమైనది. తాండవమంటేఉద్వతంగాచేసేది. భరతుడుతననాట్యశాస్త్రగ్రంథంలోనాట్యం10 రకాలుగాఉంటుందనితెలిపాడు.

నాట్యశాస్త్రంప్రకారంకూచిపూడినాట్యంమూడువిధాలు. నృత్తం, నృత్యం, నాట్యం.

నృత్తంఅంటేఏవిధమైనరసాలకు, భావాలకుసంబంధించకుండాకేవలంకరచరణాది

అవిశరీరావయవచలనాలతోతాళలయాత్మకంగాసాగేవిన్యాసము.

నృత్యమంటేరసభావములువీటికితోడుగాఅందాలనుసమకూర్చేవిన్యాసాలుజతకలిసిఅభినయించడానికిఅనువుగావుండేతాళలయాన్వితమైననర్తనము.

ఇకనాట్యమంటేనృత్తానికిఅభినయంజతచేయడం.

అంటేనాట్యప్రదర్శనంచేసేకళాకారులుతమఅవయవాలద్వారా, ప్రేక్షకులకుతాముప్రదర్శించేవిషయాలనుఅర్థమయేలాచూపడం

అభినయంనాలుగువిధాలుగాఉంటుంది. అవిఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం.

‘ఆంగికాభినయం’ అంటేకళాకారులుతమశరీరఅంగాలద్వారాప్రేక్షకులకుప్రదర్శనలోనిసారాంశాలుఅందించడం ,భాషద్వారావ్యక్తపరచేదాన్నివాచకాభినయంఅని,వేషంద్వారావ్యక్తపరచడానికిఆహార్యాభినయంఅనిఅంటారు. అలాగేమనసులోకలిగేభావాలనుముఖంద్వారావ్యక్తపరచడాన్నిసాత్వికాభినయంఅనిఅంటారు.

నాట్యకారులుప్రదర్శనలనుచేసేటప్పుడుప్రధానంగాఎక్కడహస్తములతోముద్రలనుపడతారుఅక్కడదృష్టినినిలుపుతారు. ఇదికూచిపూడినాట్యకళాకారులకుప్రధానసూత్రము.

ఆంగికాభినయంలోహస్తాలతోపట్టేముద్రలు, చూసేచూపులలోనిభేదాలు, శిరస్సునుఅటూఇటుతిప్పేవిధానాలు, పాదాలకదలికలలోనిభేదాలుముఖ్యమైనవి. ఈముద్రలకుప్రత్యేకించిప్రతిదానికిలక్ష్యలక్షణాలుంటాయి.

అయితేనృత్తహస్తాలనేముద్రలకుమాత్రంఅర్థంతోసంబంధముండదు. కేవలంనర్తించేటప్పుడుఅందంకొరకుమాత్రమేవీటినివాడతారు.ఇవికాకబాంధవ్య, నవగ్రహ, దశావతానిహస్తాలనేవికూడాఉంటాయి.

కూచిపూడికళాకారులకుఆహార్యాభినయంలోనూప్రత్యేకతవుంది. ఏవేషానికిఏవిధమైనవస్త్రాలనిధరించాలి? ఏవిధమైనఆభరణాలనువాడుకోవాలి, ఎలాంటిరంగులనుదిద్దుకోవాలిఅనేవిషయాలుచెప్పేదేఆహార్యాభినయం.

నాట్యప్రదర్శనాలద్వారాప్రజలకుఅందిప్రేక్షకులకుఆనందం, జ్ఞానబోధనలనుఅందించిచైతన్యవంతులనుగాచేయడం, ధర్మసూక్ష్మాలనువ్పద్ధతిలోఅందరికీతెలియజెప్పడంకూచిపూడినాట్యకళముఖ్యోద్దేశ్యం.

10)ప్రకటన

రచన : ప్రక్రియ – వచన కవిత,ఇతివృత్తం–శాంతి,రచయిత -;దేవరకొండ బాలగంగాధర తిలక్. మూలం – అమృతం కురిసిన రాత్రి

కవిపరిచయం :

పేరు : దేవరకొండబాలగంగాధరతిలక్

కాలం: 1921-1966

జన్మస్థానం : మండపాక (గ్రామం), తణుకు (తాలూకా), ప. గో (జి)

రచనలు: అమృతంకురిసినరాత్రి, గోరువంకలు (కవితాసంపుటాలు) తిలక్కథలు

పురస్కారాలు: ‘అమృతంకురిసినరాత్రి’ కవితాగ్రంథానికి 1971లోకేంద్రసాహిత్యఅకాడమీపురస్కారంపొందారు.

పర్యాయ పదాలు

గుడి – దేవాలయం , కోవెల

కన్ను – నయనం , నేత్రం,

గుంపు – సమూహం , దళం,బృందం

కూపీలాగడం – ఆరాతీయడం

నానార్ధాలూ

= గుంపు , ఆకు

        = గుర్తు , ప్రభావం

వ్యతిరేఖ పదాలు

జాగ్రత్త ×  అజాగ్రత్త

నీతి × అవినీతి

సుఖం × దుఃఖం

నిగర్వి × గర్వి

అంగీకారం × అనంగీకారం

నిర్భయం × భయం

శాంతి × అశాంతి

ప్రకృతి – వికృతి

దేవళం – దేవాలయం

దరి –

సంద్రం – సముద్రం

గారవం – గౌరవం

నిచ్చలు –

సంధులు

ఔరౌర = ఔర + ఔర

అరెరె = అరె + అరె

అహహా = ఆహా + ఆహా

ఏమేమి = ఏమి + ఏమి

ఎట్లేట్లు= ఎట్లు + ఎట్లు

ఎమిటేమిటి = ఎమిటి + ఎమిటి

ఓహోహో = ఓహో + ఓహో

ఎంతెంత = ఎంత + ఎంత

అడిగడిగి= అడిగి + అడిగి

ఊరూరూ = ఊరూ + ఊరూ

అంతంత =అంత + అంత

ఓరోరి =ఓరి + ఓరి

11)సీత ఇష్టాలు

రచన: ప్రక్రియ – బుర్రకథ,ఇతివృత్తం–బాలికల విద్య,

పాత్రలు: రమాదేవి,కృష్ణవేణి,రాజు,రోజా , శ్రావణి టీచర్, సీత,గౌరమ్మ,

Content

జానపదకళల్లోఎంతోప్రాచుర్యంపొందినదిబుర్రకథ. తరతరాలుగాప్రజాచైతన్యంలోఈకళారూపంకీలకపాత్రపోషించింది. ఇందులోఒకరుకథచెబుతూంటేవారికిచెరోపక్కాఇద్దరువంతపాడుతూఉంటారు.

కథబ్చెప్పేవారిని “కథకుడు’ అనీఆయనకురెండుపక్కలానిలబడిగొంతుకలిపేవాళ్ళను “వంతలు” అనిఅంటారు.

కథకుడుతంబూరావాయిస్తాడుకాబట్టికథకుబుర్రకథఅనిపేరువచ్చింది.

అనగనగారామాపురంఅనేఒకపల్లెటూరు. ఆపల్లెలోశివయ్య, గౌరమ్మఅనేదంపతులకుకలిగినతొలిసంతానంసీత. ఆసీతచదువుకునేందుకుచేసినప్రయత్నమేఈనాటిబుర్రకథకునేపథ్యం.

కథకురాలు – కృష్ణవేణి

వంతలు

1.రాజు

2.రోజా

ప్రముఖ బుర్ర కథలు – నలమహారాజు కథ,పాండవులు కౌరవులు కథ,మారాఠీల కథ,రామకథ,లవకుశులు కథ , సీతమ్మ కష్టాలు

బుర్రకథ లో పాత్ర సీత,తల్లి గౌరమ్మ , తండ్రి శివయ్య,టీచర్ శ్రావణి , ఊరు రామాపురం

వాక్యాలు – రకాలు

‘ఆహా! ఎంతబాగుందో!’ ఇదిఆశ్చర్యానికిసంబంధించినఅర్థాన్నిసూచిస్తుంది. కనుకఈ

వాక్యంఆశ్చర్యార్థకవాక్యం.

 ‘చేతులుకడుక్కో’ ఇదివిధిగాచేయాలిఅనేఅర్థాన్నిసూచిస్తున్నది

అంటేచేయాల్సినపనినివిధిగాచెయ్యాలిఅనేఅర్థాన్నిసూచించేవాక్యాన్నివిధ్యర్ధకవాక్యంఅంటాం

‘చాలాసేపుటీ.వీ. చూడొద్దు.”

ఈవాక్యంటీ.వీ. చూడటంవద్దనిచెబుతున్నది. టీ.వీ. చూడటాన్నినిషేధిస్తున్నదికదూ! అది

నిషేధార్థకవాక్యం. ఒకపనినిచేయవద్దనినిషేధించేఅర్ధాన్నిసూచించేవాక్యంనిషేధకవాక్యం.

“లోపలికిరావచ్చు”

ఈవాక్యంఒకవ్యక్తికిఅనుమతినిఇస్తున్నట్లుసూచిస్తున్నదికదూ! అంటేఇదిఅనుమత్యర్థక

వాక్యం.

ఏదైనాఒకపనినిచేయడానికిఅనుమతినిచ్చేఅర్థాన్నిసూచించేవాక్యంఅనుమత్యర్థకవాక్యం.

‘గోపాల్చెట్టుఎక్కగలడు.”

ఈవాక్యంలోగోపాలుచెట్టుఎక్కగలడు. అంటేగోపాల్కున్నచెట్టునుఎక్కేసామర్థ్యాన్ని

సూచిస్తున్నది. ఇదిసామర్థ్యార్ధకవాక్యం.

ఒకవ్యక్తికిగాని, వ్యవస్థకుగానిలేదాయంత్రానికిగానిఉన్నసమర్ధతనుసూచించేఅర్థంగల

వాక్యాన్నిసామర్థ్యార్ధకవాక్యంఅంటాం.

 

12)అసామాన్యులు

రచన:ప్రక్రియ – వ్యాసం , ఇతివృత్తం – శ్రమ సౌందర్యం,

అన్నమయములైన వన్నిజీవమ్ములు – కూడులేక జీవకోటి లేదు – పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

దారుశిల్పులు – వడ్రంగి

“ముప్పుఘటించివీనికులమున్, గలిమిన్గబళించిదేహమున్

బిప్పియొనర్చునీభరతవీరునిపాదముకందకుండఁగాఁ

జెప్పులుగుట్టిజీవనముసేయునుగానినిరాకరింపలే

దెప్పుడునప్పువడ్డదిసుమీభరతావనివీనిసేవకున్.”

–         గుఱ్ఱంజాషువగారు

 

13)ఆలోచనం

రచన : ప్రక్రియ –గేయం,ఇతివృత్తం – సామాజిక చైతన్యం , కవి –దాశరథి కృష్ణమాచార్య

మూలం –అగ్నిధార

నేపథ్యం

ప్రశ్నలరూపంలోకొనసాగుతూఅసంఖ్యాకమైనఆలోచనలనురేకెత్తించేగేయంఇది. ఇరవైఎనిమిదిపంక్తులలోసమస్తమానవప్రపంచాన్ని, విశ్వవిజ్ఞానశాస్త్రవిషయాలసారాన్నికవిత్వంలోసంక్షిప్తీకరించారు.

మొదటిచరణంసముద్రం, ఖగోళశాస్త్రాలసమ్మేళనం.

రెండోచరణంభూమి, మనిషిపుట్టుకలతీరునువివరిస్తుంది.

మిగిలినచరణాలుకవిలోకానుభవంనుంచివచ్చినచారిత్రకవాస్తవాలు , కవికలలు, అందమైనఊహలు, మరోకొత్తప్రపంచపుఆశలు, ఆశయాలు, ఆవేదనలు, ఆగ్రహాలతోఉద్వేగంగానడుస్తుంది.

కవిఅన్నీప్రశ్నలేవేశారు. ఇవిమానవాలికిసంధించినఆత్మవిమర్శనాత్మకఅస్త్రాలు.

కవి పరిచయం

కవి  : దాశరథికృష్ణమాచార్యులు

కలంపేరు : దాశరథి

జన్మస్థలం: చిన్నగూడూరు, వరంగల్జిల్లా

కాలం : 1925-1987

రచనలు : అగ్నిధార, పునర్నవం, రుద్రవీణ, అమృతాభిషేకం, మహాంద్రోదయం, ఆలోచనాలోచనాలు, గాలిబ్గీతాలు

బిరుదులు : కవిసింహ, అభ్యుదయకవితాచక్రవర్తి,

పురస్కారాలు : 1967లోఆంధ్రప్రదేశ్సాహిత్యఅకాడమి  , 1974లోకేంద్రసాహిత్యఅకాడమి

సాహిత్యసేవ : . ఆంధ్రప్రదేశ్ఆస్థానకవిగాసేవలందించారు.

సామాజికసేవ : హైదరాబాద్రాష్ట్రవిమోచనోద్యమంలోచురుకుగాపాల్గొన్నారు.

అర్థాలు

అనాధలు – ఏదిక్కు లేనివారు

బడబాన = సముద్రంలోని అగ్ని

అన్నార్తులు = ఆకలితో అలమటించేవారు

భాస్కరుడు = సూర్యుడు

శోకం – ఏడుపు

ప్రకృతి – వికృతి

రాయల – రాజరాజు

సముద్రం – సంద్రం

అగ్ని – అగ్గి

రూపం – రూపరేఖలు

ఆకాశం – ఆకసం

కావ్యం – కబ్బం

సంధులు

కుట్టుసురు = కుఱు + ఉసురు

చిట్టెలుక =చిఱు + ఎలుక

కట్టేదురు = కడు + ఎదురు

నట్టిల్లు = నడు + ఇల్లు

నిట్టూర్పు = నిడు + ఊర్పూ

చిట్టడవి = చిఱు + అడవి

నట్టేట = నడు + ఏట

నట్టనడుమ = నడుమ + నడుమ

కట్టకడ  = కడ + కడ

ఎట్టేదురు = ఎదురు + ఎదురు

తుట్టతుద = తుద + తుద

చిట్టచివర = చివర + చివర

14)కరపత్రం

రచన : ప్రక్రియ – కరపత్రం /వ్యాసం , ఇతివృత్తం–బాలల హక్కులు, రచయిత – గల్లా చలపతి

చేతిలోఅనువుగాఒదిగిఒకవిషయానికిసంబంధించినవివరణనుఇచ్చేకాగితాన్ని ‘కరపత్రం’ అనవచ్చు.

కరపత్రంసంస్కృతపదం. చేతిలోనికాగితమనిదీనిఅర్థం. దీన్నేఆంగ్లంలో ‘పాంప్లెట్’ అంటారు. పదిమందికితెలియవలసినవిషయంతోకూడుకొన్నదేకరపత్రం, ఒకవ్యక్తిఒకవిషయాన్నిమరొకరికితెలియబరచడానికివ్యక్తికేసంబంధించినదికాకఎందరికోసంబంధించినదికావచ్చు. సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మతస్థితులనుప్రతిబింబించేదికావచ్చు

లేఖలకు, కరపత్రాలకుఒకప్రధానమైనభేదముంది. లేఖలలోరాసే, చదివేవ్యక్తులవ్యక్తిగతవిషయాలుంటాయి. కరపత్రాలలోవ్యక్తిగతవిషయాలేకాకమనచుట్టూరాఉన్నసమాజం,

దేశం, ప్రపంచంలోనివిషయాలుంటాయి.

అచ్చుయంత్రంలేనిపూర్వకాలంలోఒకవిషయంఅందరికీకాగితాలమీదరాసివాటికిఅనేకప్రతులుతయారుచేస్తేపంచేవారు. ఈకరపత్రాలప్రతులనుఇప్పుడుకనిపించేకరపత్రాలకుఒకపరిణామదశఉంది.

విభిన్నఅభిప్రాయాలవ్యక్తీకరణలుకరపత్రాలలోకనిపిస్తాయి. ఈఅభిప్రాయవ్యక్తీకరణకుప్రాచీనకాలంనుంచిఅలవాటులోఉన్నపద్ధతులన్నీకరపత్రాలకుమూలరూపాలుగాచెప్పవచ్చు.

వాక్యాలు – రకాలు

రవిపనిచేస్తాడోచెయ్యడో. – సందేహార్ధక వాక్యం

నువ్వు నూరేళ్ళు వర్ధిల్లు – ఆశిర్వార్ధక వాక్యం

దయచేసి పని చేయండి –ప్రార్థనార్ధక వాక్యం

ఏం!ఇప్పుడచ్చావ్ – ప్రశ్నార్ధక వాక్యం

వర్షాలు లేక పంటలు పండలేదు – హెత్వర్థక వాక్యం

ఒక పని కావడానికి కారణం లేదా హేతువు సూచించే అర్థం ఉన్న వాక్యాన్ని హేత్వర్ధక వాక్యం అంటారు.

పంటలు పండలేదు

15)జానపద కళలు

సంగీతం, నృత్యం, సంప్రదాయకళావారసత్వంకళలుఅనేకరకాలు. అందులోప్రధానమైనవి 64. ముఖ్యంగాఆరింటినిలలితకళలుగాపేర్కొన్నారు. అవి

1) చిత్రలేఖనం 2) శిల్పం 3) సంగీతం 4) సాహిత్యం 5) నాటకం 6) నాట్యం.

వీటన్నింటిలోనుశాస్త్రీయరీతులున్నప్పటికీసంగీతనాట్యాలలోఅటుశాస్త్రీయరూపాలు, ఇటుజానపదకళాప్రక్రియలుప్రజలహృదయాలనుఅలరిస్తున్నాయి.

1. తోలుబొమ్మలాట :

తోలుబొమ్మలాట (పప్పెట్రీ) అతిప్రాచీనకళల్లోఒకటి. కొండగుహల్లోకొవ్వుదీపాలవెలుగులోరాతిగోడలమీదనీడలుపడేలాచేసికథలుఅల్లినపుడుఈకళపుట్టింది. కీలుబొమ్మలు, ఊచబొమ్మలతోప్రారంభమైనఈప్రక్రియ ‘తోలుబొమ్మలాట’ గాఒకపరిపూర్ణతసంతరించుకుంది.

“తొంభయిఆమడలైనాపోయితోలుబొమ్మలాటచూడాలి” అన్ననానుడితోలుబొమ్మలాటప్రాధాన్యాన్నితెలియజేస్తుంది. ఈతోలుబొమ్మలాటప్రాచీనఓడరేవులైన

కళింగపట్నం, భీమునిపట్నం, కోరంగి, మచిలీపట్నంవాడరేవునుండిభారతీయులతోపాటువిదేశాలైనటర్కీపర్షియా, గ్రీసు, ఆఫ్రికా, ఇటలీ, ఫ్రాన్స్దేశాలకుకూడావ్యాపించింది.

తోలుబొమ్మలనుమేకచర్మాలతోగాని, జింక, దుప్పిచర్మంతోగానితయారుచేస్తారు. రాముడు, సీత, ఆంజనేయుడుమొదలైనప్రధానపాత్రలకుజింకచర్మాన్నిఉపయోగించిమిగతాపాత్రలకుమేకచర్మాన్నివాడతారు.అందుకేతోలుబొమ్మలాటలనుచర్మనాటకంఅనికూడాపిలుస్తారు.

తోలుబొమ్మల్నితెరమీదఆడించడానికివీలుగాపేరుబద్దనుబొమ్మకుమధ్యభాగంలోకడతారు.

బొమ్మనుఆడించాలంటేఈబద్దేఆధారం.

హార్మోనియం, మద్దెలనువాయించేవ్యక్తులువంతపాడుతుంటారు. రథాలు, గుర్రాలుపరుగులెత్తేసమయంలోచెక్కలుటకటకలాడిస్తూశబ్దంచేస్తారు. మధ్యమధ్యలోవచ్చేకేతిగాడు, జుట్టుపోలిగాడు, బంగారక్కమొదలయినహాస్యపాత్రలుకడుపులునవ్విస్తాయి .

మహాభారతంలోభీష్మపర్వం, ద్రోణపర్వం, సైంధవునివధ, పద్మవ్యూహం, కర్ణపర్వం, ప్రమీలార్జునయుద్దం,వీరాభిమాన్యుడుభాగవతంలోకృష్ణలీలలు, త్రిపురాసురయుద్ధం, శివపురాణం, గంగమ్మపురాణం, ప్రహ్లాదచరిత్ర, గజేంద్రమోక్షం, రామాయణంలోసుందరకాండ, ఇంద్రజిత్తునివధ, లక్ష్మణమూర్చ, రావణవధ, దశరథునిపుత్రకామేష్టియాగంవంటిప్రదర్శనలుప్రఖ్యాతిచెందాయి.

మనరాష్ట్రంలోహిందూపురం, బొమ్మలాటపల్లి, అనంతపురం, ధర్మవరం, చెరువుపల్లి, మధిర, బసవయ్యపాలెం, వాడపల్లి, నెల్లూరు, కాకినాడప్రాంతాలలోతోలుబొమ్మలాటబృందాలుఉన్నాయి.

2. వీధిభాగవతం :

కూచిపూడిభాగవతం, చిందుభాగవతం, గంటెభాగవతం, ఎరుకలభాగవతం, శివభాగవతం, చెంచుభాగవతం, తూర్పుభాగవతంమొదలైనవిప్రసిద్ధిచెందినవీధిభాగవతకళారూపాలు.

పురాణగాథలనునాట్యరూపంగాప్రదర్శించేవారినిభాగవతులుఅంటారు. భాగవతులుఅంటేభగవంతునికిసంబంధించినకథలనుప్రదర్శించేవారనిఅర్థం.

మనరాష్ట్రంలోఈభాగవతాన్నిప్రదర్శించేవారిలోవివిధకులాలకుచెందినవారుండటంవిశేషం. వీరిలోఎర్రగొల్లలు, కూచిపూడిభాగవతులు, జంగాలు, చిందుభాగవతులు, యానాదులు, దాసరులు

ఈజానపదకళారూపాలుచాలావరకుకనుమరుగుకాగాతూర్పుతీరప్రాంతంలోనేటికీసజీవంగాఉన్నజానపదకళవీధిభాగవతంలేదాతూర్పుభాగవతం. దీనికిసత్యభామాకలాపంఅనేపేరుకూడాఉంది.

శ్రీకాకుళం, విజయనగరంజిల్లాల్లోతూర్పుభాగవతంపేరుతోఅమ్మవారిపండుగలలోపేరంటాలజాతరలలోప్రదర్శితమౌతోంది. ముఖ్యంగాపైడితల్లి, ముత్యాలమ్మ, నూకాలమ్మపండుగలలోదీన్నిప్రదర్శిస్తున్నారు. ఉత్తూంధ్రమాండలికాలు, వాణీలు, యాసతోతూర్పుభాగవతంఎంతోవినసొంపుగాఉంటుంది.

వరదఆదినారాయణ, బొంతలకోటిజగన్నాథం, దూడలశంకరయ్య, మీగడదాలయ్య, కాలుగంటివెంకటస్వామిమొదలైనవారువీధిభాగవతుల్లోప్రసిద్ధులు,

2. తప్పెటగుళ్ళు :,

తప్పటగుళ్ళుఉత్తరాంధ్రలోఎక్కువగాకనిపించేజానపదకళప్రదర్శనసమయంలోరంగులబనియన్లుధరించి, బరువైనఎక్కువశబ్దాన్నిచ్చేగజ్జెలుకట్టుకొని, రంగునిక్కర్లువేసుకుంటారు.

రేకుతోగుండ్రంగాతయారుచేసినతప్పెటగుండ్లునుగుండెకుకట్టుకునిరెండుచేతులతోఉదృతంగావాయిస్తారు. వలయాకారంగాతిరుగుతూ, లయబద్ధంగా, అడుగులువేస్తూ, గెంతుతూ, తప్పెటకొడుతూపాటలుపాడతారు.

20 మందివరకూఉండేఈబ్బందంలోతాళంలయతప్పకుండావలయాకారంగాతిరుగుతూనాయకునిఅనుసరిస్తూచేసేనృత్యంఅద్భుతంగాఉంటుంది.  రామాయణ, భారత, భాగవతపురాణాలలోగాథల్నిగేయాలుగాఅల్లుకుంటారు. ఇదంతామౌఖికసాహిత్యం.

మాండలికపదాలుగ్రామీణయాసలతోసారంగధర, లక్ష్మణమూర్చ, చెంచులక్ష్మిమొదలైనపురాణకథలేకాకుండా, తేలుపాట, గాజులోడిపాట, రెల్లిదానిపాట, మందులోడిపాట, చుట్టపాటమొదలైనజానపదాలుకూడాపాడుతారు.

కోరాడపోతప్పుడు, కోనచిన్నప్పయ్య, కోరాడఆదినారాయణ , కిల్లంపూడిబృందం, బొట్టఅప్పారావుబృందం, పొంతపల్లిఅప్పలనాయుడుబృందం, మహిళాకళాకారిణియలమంచిలి

బంగారమ్మ, ముద్దదుర్యోధనబృందంమొదలైనవిప్రసిద్ధిచెందినతప్పెటగుళ్ళకళాబృందాలు.

కింతాడసన్యాసిరావుగారుఆధునికశైలిలోతప్పెటగుళ్ళకళాబృందంద్వారానూతనసామాజికఅంశాలపైప్రదర్శనలుఇవ్వడంప్రారంభించారు.

“తాగొద్దుమామోనీవుసారాతాగొద్దుమామా-తాగితేనాతాళిమీదఒట్టుగామామా!!” వంటిపాటలతోసామాన్యజనచైతన్యంకోసంఇచ్చేప్రదర్శనలుప్రజలమన్ననలుపొందాయి.

బుర్రకథ

బుర్రలతోచెప్పేదికావడంవల్లఅదిబుర్రకథఅయింది. ప్రధానకథకుడుతంబురవాయిస్తూ, పాడుతూఅడుగులేస్తారు. వంతలిద్దరుగుమ్మెటవాయిస్తూవంతపాడతారు. కొన్నిప్రాంతాలలోగుమ్మెటలనుబుర్రలుఅంటారు. వీటిసాయంతోనడిచేదికాబట్టిదీనికిబుర్రకథఅనిపేరు.

ప్రధానకథకుడుచెప్పేకథకువంతలుగాఉండేవారిలోఒకరుకథావివరంచెబుతుంటే, మరొకరుహాస్యంచెబుతూరక్తికట్టిస్తారు.

ఆధునికబుర్రకథకుఆద్యుడుబుర్రకూపితామహుడుషేక్నాజర్తెలుగువారికీర్తినిప్రపంచంనలుదిశలావ్యాపింపజేశారు. అందుకేఆయనకుభార్యప్రభుత్వంపద్మశ్రీబిరుదుఇచ్చిసత్కరించింది.

అల్లూరిసీతారామరాజు, బొబ్బిలియుద్ధం, పల్నాటివీరచరిత్ర, బాలనాగమ్మవంటిచారిత్రకఘట్టాల్ని, పద్మవ్యూహం, లంకాదహనంమొదలైనఇతిహాసఘట్టాలనువీరుగానంచేస్తారు. బుర్రకథలలోవీర, కరుణరసాలకుప్రాధాన్యంఉంటుంది.

5. హరికథ

చేతిలోచిడతలు – కళ్ళకుగజ్జు – పట్టుపీతాంబరాలు -మెడలోదండ-నుదుటబొట్టు -హరికథకునివేషం.

ఆంధ్రప్రదేశ్లోప్రజాదరణపొందినకళారూపం

ఒకేవ్యక్తిఅన్నిపాత్రలలోనూరసవత్తరంగానటిస్తాడు. ఆకర్షణీయమైనఆహార్యంతోనోటితోవాచికంచెబుతూ, మృదుమధురంగాగానంచేస్తూముఖంలోసాత్వికం, కాలితోనృత్యం, చేతులతోఆంగికంప్రదర్శిస్తూఏకకాలంలోఅభినయిస్తాడు,

తోలిహరికథఆధ్యాత్మికరామాయణం. దీనిరచయితమునిపల్లెసుబ్రహ్మణ్యకవి.

హరికథాపితామహుడుఆదిభట్లనారాయణదాసుహరికథనుఒకరూపంలోకితీసుకొచ్చిసకలకళలసమాహారంగామలిచిప్రపంచప్రఖ్యాతితీసుకువచ్చారు.

ఉమాచౌదరి, మంత్రిప్రగడలలితకుమారి, రామకుమారి, తాళభత్తులమంగరాజుభాగవతారిణి,

గారునిర్మలభాగవతారిణి, ఇందిరాబాల, క్రీ. శె. వీరగంధంవెంకటసుబ్బారావు, కోటసచ్చిదానందభాగవతార్, అమ్ములవిశ్వనాథభాగవతార్, కడలివీరదాసువంటికళాకారులుప్రసిద్ధులు.

సామవేదంకోటేశ్వరరావు, చొప్పకసూర్యనారాయణభాగవతార్వంటివారుమధురహరికథాగాయకులుగాపేరుపొందారు.

కోలాటం :

కోలాటంభజనసంప్రదాయానికిచెందినజానపదకళారూపం. కోలఅంటేకర్రఅనిఅర్థం. కర్రలతో

ఆడుతూచేసేభజనఅన్నమాట.

గ్రామదేవతపండుగలు, తీర్థాలు, జాతరలు, ఉత్సవాల్లోకళాకారులుదీన్ని

ప్రదర్శిస్తారు.

జట్టునాయకుణ్ణికోలన్నపంతులు, మేళగాడుఅంటారు. జట్టునాయకుడునిలిచేప్రదేశాన్ని ‘గరిడీ’ అంటారు.

గుడిగుడిగుండేలయా, గొండేలమ్మారాగమా – ఏయేగండారమా, ఎండగాస్తున్నావుఅనేజానపదపాటలు,

‘ఉంగరమాముద్దుటుంగరమా’ అనేరామాయణఘట్టాలు, కృష్ణునిబాల్యచేష్టలు, భక్తిపాటలుపాడుతారు.

కోలాటంలోపాటకుఅనుగుణంగానృత్యంచేయడాన్ని “కోపు’ అంటారు.

కోలాటంకోపులలోకృష్ణకోపు, లాలికోపు, చిప్పాడకోపు, దంపుడుకోపు, బసవకోపుమొదలైనప్రక్రియలుంటాయి.

తూర్పుగోదావరిజిల్లావెల్లగ్రామానికిచెందినవెంకటరమణప్రముఖకోలాటవిద్వాంసుడు.

7. చెక్కభజనలు :

తెలుగువారిపల్లెల్లోఅనాదిగావస్తున్నకళారూపాలలోచెక్కభజనఒకటి. పండుగలు, జాతరలసమయాలలోకొంతమందియువకులుకలిసిరాత్రిపూటదేవాలయప్రాంగణంలోచెక్కభజనప్రదర్శిస్తారు.

పంచెకట్టు, రంగులతలగుడ్డ, నడుముపట్టి, కాళ్ళగజ్జలువీరిఆహార్యం.

ఇత్తడిబిళ్ళలున్నచెక్కలనుఒకచేతిలోపట్టుకునిఆడిస్తూ, తాళానికిఅనుగుణంగాముందుకు, వెనుకకుఅడుగులేస్తూ, వలయాకారంగాతిరుగుతూభజనచేస్తారు.

అందరూకలిసిపాటకుఅనుగుణంగాఒకేసారిఎగరడం, కూర్చోవడం, లేవడం, గుండ్రంగాతిరగడంవంటిభంగిమలుప్రదర్శిస్తారు.

హరిభజనలు, పండరిభజనలు, కోలాటభజనలుఅడుగుభజనలుఅనేప్రక్రియలుఉంటాయి. ఈచెక్కభజనబృందాలుపూర్వంప్రతిగ్రామంలోనూఉండేవి.

1. గిరిజననృత్యం (ధింసా):

జానపదనృత్యాలకుఆదిమజాతులనృత్యాలేఆధారం.

అరకులోయలోఅనేకగిరిజనజాతులవారున్నారు. వీరిలోకొండదొర, వాల్మీకి , భగత, భోంద్ (కోటి) కొటియా, బోండీఅనేప్రధానతెగలున్నాయి.

ఉత్సవాలసమయంలోఒకగ్రామానికిచెందినవారుమరొకగ్రామానికివెళ్ళిధింసానృత్యంలోపాల్గొంటారు.

వివాహసమయంలో, చైత్రమాసంలోజరుగు “ఇటికలపండుగ’ (ఈటెలపండుగ) రోజులలోఈధింసానృత్యంచేస్తారు.

ధింసాజట్టుకుఒకనాయకుడు (నాయుడు) ఉంటాడు. సుమారు 20 30 మందినృత్యంలోపాల్గొంటారు.

స్త్రీలుఅధికంగాపాల్గొంటారు. నృత్యంచేసేవారుఆడవారుకాగా, వాయిద్యాలుమగవారువాయిస్తారు.

ధింసాలోసన్నాయి, తుడుము, కిరిడి, డప్పు, బాకా, పిన్నలగర్ర, జోడికొమ్ములుఅనేఆరురకాలవాద్యాలనుపురుషులేవాయిస్తారు.

తమగ్రామదేవత “నిసానిదేవతలనుఆరాధిస్తూచేసేనృత్యాన్నిబోడిధింసాఅంటారు. ఈదేవతకుమరోపేరుబోడిదేవత.

ఒకవైపుపురుషులు, మరొకవైపుస్త్రీలుచేతులుకలిపిపట్టుకునివరసగానిలబడతారు. బృందనాయకుడినిఅనుసరిస్తూలయబద్ధంగాపాడుతూఅడుగులువేస్తారు.

ఈనృత్యంలోపొంగిబుల్లమ్మ, కొర్రరాజమ్మ, కిలోల్లలక్ష్మమ్మ, మొదలైనధింసానృత్యబృందాలు, దేశవ్యాప్తంగాకూడాప్రదర్శనలిస్తూపేరుపొందాయి.

కురవంజి :

ఆంధ్రులమొట్టమొదటిగిరిజనకళారూపమైనదృశ్యకావ్యంగాకురవంజినిపేర్కొంటారు.

అరణ్యాలలోనివసించేచెంచులు, కోయలు, కురవలు, ఈనృత్యాన్నిప్రదర్శించేవారు.

కురవంజిఅనగాఒకనృత్యవేషంతోకూడినలయబద్ధమైఅడుగు.

కురవలనేగిరిజనులుప్రదర్శించేదికాబట్టిదానినికురవంజిలేకకొరవంజిఅనిపిలుస్తూవచ్చారు

.

పుణ్యక్షేత్రాలగురించినపురాణగాధలుఇందులోప్రదర్శితమౌతాయి. నేటికీతిరుపతి, మంగళగిరి, శ్రీశైలం, భద్రాద్రి, సింహాచలంమొదలైనయాత్రాస్థలాల్లోకురవలుకురవంజినృత్యాన్నిప్రదర్శిస్తారు.

గోండ్లునాగోబాజాతరలోప్రదర్శించేగోండునృత్యందేశవిదేశాలలోగుర్తింపుపొందింది.

16)బాల్య క్రీడలు

రచన : ప్రక్రియ – ప్రాచీన పద్యం , ఇతివృత్తం – గ్రామీణ క్రీడలు – వర్ణన , కవి – పోతన

మూలం –  ఆంధ్ర మహా భాగవతం లోని దశమ స్కంధములోనిది

నేపథ్యం

వ్రేపల్లెలోశ్రీకృష్ణుణ్ణిచంపడానికికంసుడుఅనేకమందిరాక్షసులనుపంపాడు. ఆరాక్షసులనుఒక్కొక్కరినిఒక్కొక్కరీతిగాకృష్ణుడేచంపాడు. ఇవన్నీచూసివ్రేపల్లెలోనందుడుసమావేశంపెట్టాడు.

అంతవరకుజరిగినభయంకరమైనవిషయాలనుగురించిచర్చించాడు. ఆసమయంలోఉపనందుడనేవృద్ధగోపాలకుడుఇన్నిసమస్యలనుఎదుర్కొంటూవ్రేపల్లెలోఉండడంకన్న

బృందావనంవెళ్ళడంమంచిదనిసూచించాడు.

అందుకుఅందరూఅంగీకరించిబృందావనంచేరారు.

అక్కడబలరామకృష్ణులుతమతోటిబాలురతోఆడినఆటలనుగురించిఈపాఠ్యాంశంవివరిస్తుంది.

కవిపరిచయం

పేరు : బమ్మెరపోతన

కాలం : 15వశతాబ్దం

జన్మస్థలం : బమ్మెరగ్రామం, వరంగల్జిల్లా,

రచనలు : భోగినీదండకం, ఆంధ్రమహాభాగవతం, వీరభద్రవిజయం,

బిరుదు : సహజపండితుడు

అర్థాలు

కపి –కోతి

జలరాశి – సముద్రం

నరేంద్రుడు – రాజు

ప్రావీణ్యం – నేర్పు

భాగ్యం – అదృష్టం

అలంకారాలు

గంతులు వేతురు కౌతకమున. – వృత్యానుప్రాస అలంకారం

పోరుదురు గికురు వొడచచూ దూరుదురు  – వృత్యానుప్రాస అలంకారం

ఒకనొకనిచల్టికావడి,

నొకఁడడకించిదాచు, నొకఁడొకఁడదివే

టొకఁడొకఁనిమొఱగికొనిచన

నొకఁడొక…………వృత్యానుప్రాస అలంకారం

వేదశాఖలు వెలిసెనిచ్చట

ఆదికావ్యంబలరే నిచ్చట      – అంత్యానుప్రాస అలంకారం

తలుపు గొళ్ళెం

హారతింపళ్ళెం

గుఱ్ఱపుకళ్ళెం.    – అంత్యానుప్రాస అలంకారం

ఉపమాలంకారం

సోముడుభీముడులాగవున్నాడు

సోముడు – ఉపమేయం (అంటేఎవరినిగురించిచెప్తున్నామోఆపదం)

భీముడు – ఉపమానం (ఎవరితోపోలుస్తున్నామోఆపదం)

బలవంతుడు – సమానధర్మం – పోల్చడానికివీలయినసమానగుణం (ఉపమేయఉపమానాలలోఉన్నఒకేవిధమైనధర్మం)

లాగ (వలె) – ఉపమావాచకం (ఉపమానాన్నిసమానధర్మంతోకలపడానికివాడేపదం)

ఇక్కడఉపమాన, ఉపమేయాలకుచక్కనిసామ్యం – అంటేపోలిక – చెప్పటంజరిగింది. ఇలాచెప్పటాన్నిఉపమాలంకారంఅంటాం.

లక్షణం : ఉపమానోపమేయాలకుచక్కనిపోలికచెప్పడమేఉపమాలంకారం.

ఉత్ప్రేక్షాలంకారం

ఆఏనుగునడిచేకొండా ! అన్నట్లుఉంది

లక్షణం: ఉపమేయాన్నిమరొకదానిలా (ఉపమానంగా) ఊహించిచెప్పడంఉత్ప్రేక్షఅలంకారం.

గోపిసూర్యుడిలాగప్రకాశిస్తున్నాడు.   – ఉపమాలంకారం

మండేఎండనిప్పులకొలిమా! అన్నట్లుఉంది. –ఉత్ప్రేక్షాలంకారం

ఛందస్సు

కనురెప్ప కాలంలో , చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు లఘువులు I.

లఘువు కంటే ఉచ్ఛారణ కు ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు గురువు.U.

ధ్విత్వాక్షరం ,సంయుక్త అక్షరం ముందున్న అక్షరం గురువుగా గుర్తిస్తాం

పోల్లు తో కూడిన అక్షరాలను గురువుగా గుర్తిస్తాం .

17)వేసవి సెలవుల్లో

రచన : ప్రక్రియ – వ్యాసం , ఇతివృత్తం – నైతిక విలువలు

పాత్రలు : క్రాంతి,చంద్ర శేఖర్ , శ్రీను , భారతి,తాతయ్య,రాఘవ కృష్ణస్వామి,నాని,ఆరిఫ్, రవి, శ్రీ హర్ష , అరుణ్, మధుసూధన్ శాస్త్రి,అగ్నివేష్,సయ్యద్ అమిముధ్దిన్,