→ ఒక మొక్క యొక్క ముఖ్యమైన భాగాలు వేర్లు, కాండం మరియు ఆకులు.
→ తల్లివేరు వ్యవస్థ మరియు గుబురువేరు వ్యవస్థ మొక్కలలో కనిపించే రెండు రకాల వేరు వ్యవస్థలు.
→ ద్విదళ బీజం మొక్కలకు తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. ఏకదళ బీజం మొక్కలకు గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది.
→ వేరు మొక్కను నేలలో స్థిరపర్చి, నీరు మరియు ఖనిజాలను గ్రహిస్తుంది.
→ కొన్ని మొక్కలలో వేర్లు అదనపు బలాన్ని ఇస్తాయి.
→ కొన్ని గుబురు వేర్లు ఆహారాన్ని నిల్వ చేయడానికి సహాయపడతాయి.
My class Notes
→ కాండం వ్యవస్థలో కాండం, ఆకులు, పువ్వులు మరియు పండ్లు ఉంటాయి. కాండం నీరు మరియు ఖనిజాలను వేర్ల నుండి మొక్కల పై భాగాలకు మరియు ఆహారాన్ని ఆకుల నుండి ఇతర భాగాలకు రవాణా చేస్తుంది.
→ బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం మరియు చెరకు కాండంలో ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి.
→ పత్ర పీఠం, పత్ర వృంతము మరియు పత్రదళం ఒక ఆకు యొక్క భాగాలు.
→ జాలాకార మరియు సమాంతర ఈనెల వ్యాపనం ఆకులలో కనిపిస్తాయి.
→ తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కలు జాలాకార ఈనెల వ్యాపనంను, గుబురు వేర్లు కలిగిన మొక్కలు సమాంతర ఈనెల వ్యాపనం కల్గి ఉంటాయి.
→ ఆకులు ఆహారాన్ని తయారు చేయడంతో పాటు, వాయువుల మార్పిడి మరియు బాష్పోత్సేకంలో కూడా ఇవి సహాయపడతాయి.
→ పరాగసంపర్కం కోసం కీటకాలను ఆకర్షించడానికి పువ్వులో రంగురంగుల ఆకర్షక పత్రాలు ఉన్నాయి.
→ ప్రకృతికి అందం ఇచ్చే రంగురంగుల పువ్వుల కోసం మొక్కలను పెంచుదాం.
→ తల్లి వేరు : మధ్యలో ఒక ప్రధాన వేరు ఉండి దాని నుండి పార్శ్వ వేర్లు ఏర్పడే వేరు.
→ గుబురు వేర్లు : కాండం నుండి ఏర్పడే ఒకే మందం, పొడవు కలిగిన వేర్ల సమూహం.
→ ఏకదళ బీజ మొక్కలు : విత్తనంలో ఒకే ఒక బీజదళం మాత్రమే ఉండే మొక్కలు.
→ ద్విదళ బీజ మొక్కలు : విత్తనంలో రెండు బీజదళాలు ఉండే మొక్కలు.
→ కణుపు : కాండం యొక్క భాగం. ఇక్కడ ఆకు మరియు ఇతర భాగాలు ఉత్పత్తి అవుతాయి.
→ అగ్ర కోరకం : కాండం పై భాగాన ఉండే పెరుగుదల చూపే మొగ్గ.
→ పార్శ్వ కోరకం : ఆకు యొక్క అక్షం వద్ద పెరిగే మొగ్గ.
→ పత్రం : మొక్కలో ఉండే ముఖ్య భాగము పత్రం. దీనిద్వారా బాష్పోత్సేకం, కిరణజన్య సంయోగక్రియ జరుగుతాయి.
→ పత్ర వృంతము : కాండంతో ఆకును కలిపే కాడ వంటి నిర్మాణం.
→ పత్ర దళం : ఆకు యొక్క చదునైన ఆకుపచ్చ భాగం.
My class Notes
→ జాలాకార ఈనెల వ్యాపనం : ద్విదళ ఆకులలో ఉన్న ఈ నెలు పత్రదళం అంతటా వలలాగా అమర్చబడి ఉండే ఈనెల అమరిక.
→ సమాంతర ఈనెల వ్యాపనం : ఏకదళ బీజం ఆకులలో ఉన్న ఈ నెలు ఒకదానికొకటి సమాంతరంగా అమర్చబడి ఉండే ఈనెల అమరిక.
→ పత్ర రంధ్రము : పత్రదళంలో గల చిన్న రంధ్రాలు.
→ బాష్పోత్సేకము : ఆకులు నీటిని, ఆవిరి రూపంలో విడుదల చేసే ప్రక్రియ.
→ కిరణజన్య సంయోగక్రియ : మొక్కలలో ఆహార తయారీ ప్రక్రియ.
→ పార్శ్వ వేర్లు : తల్లి వేరు వ్యవస్థలో ప్రధాన వేరు నుండి ప్రక్కకు పెరిగే చిన్న వేర్లు.
→ విత్తన ఆకులు : అంకురోత్పత్తి సమయంలో విత్తనం నుండి వెలువడే మొదటి ఆకులు.
→ బీజ దళం : విత్తనంలో గల పప్పు బద్దలు. ఆకులు ఏర్పడే వరకు పెరిగే మొక్కకు ఆహారం అందిస్తాయి.
→ దుంప వేర్లు : ఆహార పదార్థాలను నిల్వ చేయటం వలన లావుగా ఉండే వేర్లు.
→ కాండం వ్యవస్థ : మొక్కలలో భూమి పైన పెరిగే భాగం.
→ కాండం : మొక్క యొక్క ప్రధాన అక్షం కాండం. ఇది భూమి పైభాగాన పెరుగుతుంది.
→ కణుపు మద్యమం : రెండు వరుస కణుపుల మధ్య కాండ భాగం.
→ ఈనెలు : ఆకు పత్రదళంలో గల గీతల వంటి నిర్మాణాలు.
→ మధ్య ఈనె : పత్ర దళం మధ్యలో ఉన్న పొడవైన ఈనె.
My class Notes
→ పార్శ్వ ఈనెలు : ఆకులోని మధ్య ఈనెల నుండి ఏర్పడే సన్నని నిర్మాణాలు.
→ ఈనెల వ్యాపనం : పత్ర దళంలో ఈనెల అమరిక.
→ మడ అడవులు : సముద్ర తీర ప్రాంత ఉప్పు నీటిలో పెరిగే చెట్లు.
→ పువ్వు : ఒక మొక్క యొక్క లైంగిక భాగం.
→ పూ ఆకర్షక పత్రాలు : పువ్వులో రంగురంగుల భాగాలు. వీటినే ఆకర్షక పత్రాలు అంటారు.
→ పరాగసంపర్కం : పువ్వు నుండి పువ్వుకు లేదా అదే పువ్వులో పుప్పొడి బదిలీ చేయబడడం.
→ వాయుగత వేర్లు : కొన్ని మొక్కలలో వేర్లు భూమి పైకి పెరుగుతాయి. వీటిని వాయుగత వేర్లు అంటారు.